ఈ మధ్యకాలంలో యువత సినిమాలను చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. తమకి తాము హీరోల్లా ఫీలవుతున్నారు. సినిమాలల్లో డూపులని పెట్టి చేసే స్టంట్లన్నీ… వీళ్ళు రియల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటిని వీడియో తీసి… సోషల్ మీడియాలో పెట్టి… క్రేజ్ సంపాయించుకుందాం ఆనుకుంటున్నారు. కానీ, రియల్ లైఫ్ లో అలాంటి ఫీట్స్ ప్రాణాలకి ఎంత ప్రమాదమో గ్రహించట్లేదు.
గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో బైక్ నడిపితే… బైక్ ఇక మన కంట్రోల్‌లో ఉండదు. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. ఈ విషయం తెలిసీ కూడా కొంతమంది ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ… పక్కన వచ్చే వెహికల్స్ అన్నిటినీ ఓవర్ టేక్ చేస్తుంటారు. అంతేకాదు, ర్యాష్ డ్రైవింగ్ చాలా థ్రిల్‌గా ఫీలవుతారు.
చాలామంది కుర్రాళ్ళు చేతిలో బైక్… అందులో పెట్రోల్… ఉంటే చాలు ఎలాంటి ఫీట్సైనా చేసేయొచ్చు అనుకుంటున్నారు. కానీ, తెలిసి తెలిసి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నామని అనుకోవట్లేదు. బైక్‌ని బైక్ లాగే నడపాలి. అందులోనూ రోడ్డుపై ఫీట్స్ చేయటం చట్ట రీత్యా నేరం. వీరు చేసే చేష్టల వల్ల ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందే!
ఇక రీసెంట్ గా ఓ బైకర్… హైవేపై బైక్ నడుపుతూ… సడెన్‌గా దాని హ్యాండిల్ వదిలేసి… రెండుకాళ్లతో సీటు పైకి ఎక్కి నిల్చున్నాడు. అలా కొంతదూరం నిలబడే రైడ్ చేశాడు. ఆ సమయంలో ఓ కారుని కూడా ఓవర్ టేక్ చేశాడు.
కొంతదూరం ఇలా సాగిన తర్వాత బైకర్… తిరిగి బైక్‌పై కూర్చుందామని ప్రయత్నించి… హ్యాండిల్ పట్టుకొని కూర్చోబోయి… బొక్క బోర్లా పడ్డాడు. అతను కొంతదూరం రోడ్డుపై పడి దొర్లుకుంటూ వెళ్ళాడు. కానీ, అతని బైక్ మాత్రం అదే స్పీడ్ తో దూసుకుపోయింది. అతను పడిపోయిన సమయంలో, వెహికల్స్ ఏవీ రాకపోవడంతో లక్కీగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే స్పాట్ లోనే అయిపోయేవాడు. ఎందుకంటే, అసలే అది హైవే కదా!
ఇలాంటి ఫీట్స్ చేయడం వల్ల తాత్కాలిక ఆనందం కలుగుతుదేమో గానీ… పొరపాటున ఏ చెయ్యో, కాలో పోతే… జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఫీట్స్ అనేవి సినిమాలకే పరిమితం. రియల్ లైఫ్ లో మాత్రం వద్దే వద్దు.
Sin manos… pic.twitter.com/rAqF5GPDMk
— El Chiki (@Elchiki_hn) October 9, 2021