మూగ జీవాల్ని ప్రేమిస్తే… ప్రాణమిస్తాయి. అదే ద్వేషిస్తే… ప్రాణం తీస్తాయి. తన జోలికి రానంత వరకూ క్రూర మృగం కూడా మనిషిని ఏమీ చేయదు. కానీ, మనిషే మానవత్వాన్ని మర్చిపోయి పశువులా ప్రవర్తిస్తున్నాడు.
సరిగ్గా ఇలాంటి సంఘటనే కర్నూల్ జిల్లాలో జరిగింది. తప్పతాగి దున్నపోతు జోలికి పోయాడు. దానికి తిక్క రేగింది. ఆ వ్యక్తిని గుల్ల గుల్ల చేసి వదిలేసింది.
కర్నూల్ జిల్లాలో దున్నపోతులు మేతకి వెళ్ళే ప్రాంతంలో కొంతమంది డ్రింకర్స్ కలిసి మందుకొట్టారు. వారిలో ఒక వ్యక్తి తాగిన మైకంలో అక్కడున్న దున్నపోతులపై రాళ్ళు విసిరాడు. దీంతో ఒక దున్నపోతుకి తిక్క రేగింది. నాతోనే పెట్టుకుంటావా..! అంటూ… ఆ వ్యక్తిపై దాడికి దిగింది.
దానిష్టం వచ్చినట్లు ఆ డ్రింకర్ ని కొమ్ములతో పొడిచి… నేలకేసి కొట్టి… కుళ్ళబొడిచింది. కొంతసేపు అలా చేశాక… కోపం తగ్గాక… అతనిని ఒదిలి పెట్టింది. అంతచేసినా ఆ వ్యక్తి స్పందించలేదు. కారణం పీకల్లోతు వరకూ తాగటంతో మందు మత్తులో ఏం జరుగుతుందో అతనికి తెలియట్లేదు.
ఇక దాడి నుండీ బయటపడ్డ అతనిని మిగిలిన వ్యక్తులు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. గాయాలు అయ్యాయని, ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్ చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.