Cats Trying to Catch Squirrel and Rat

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో)

సాదారణంగా పిల్లులు నడిచినప్పుడు వాటి కాళ్ల నుంచి శబ్దం రాదు. అందుకే, ఈజీగా అవి తమ ఆహారాన్ని పట్టుకోగలవు. కానీ, ఒక చోట ఉడత, మరో చోట ఎలుక ఈ రెండూ కూడా పిల్లులకి దొరకకుండా వాటిని ఆటపట్టించాయి. దీంతో నోటిదాకా వచ్చిన ఆహారం ఎటు పోయిందో కనిపించక బిక్కమోహం వేసుకొని అక్కడినుంచీ నీరసంగా వెళ్ళిపోతాయి ఆ పిల్లులు. 

ఓ వీడియోలో ఉడుత, మరో వీడియోలో ఎలుక ఈ రెండూ కూడా పిల్లుల్ని ఓ రేంజ్ లో ఏడిపించాయి. వాటిని పట్టుకోవటానికి సమీపిస్తున్నప్పుడు అవి పిల్లులకి చుక్కలు చూపించాయి.  ఈ రెండు వేరు వేరు వీడియోలే అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

“A Page to make you Smile” కి సంబంధించిన ట్విట్టర్‌ ఎకౌంట్ లో రీసెంట్ గా ఒక వీడియోని షేర్ చేశారు. అందులో ఓ పిల్లి ఉడుత కోసం వెతుకుతూ ఉంటుంది. “ఇప్పటి దాకా ఇక్కడే ఉంది కదా! సడెన్‌గా ఎటుపోయిందబ్బా!” అని సీరియస్ గా థింక్ చేస్తుంది. అయితే, ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా వెతుకుతుంది కానీ, ఆ ఉడుత దాని వీపు పైనే ఎక్కి కూర్చుని ఉందని గమనించలేకపోతుంది. ఇలా ఉడుత ఆ పిల్లికి చిక్కకుండా చుక్కలు చూపించింది. 

ఇక మరో వీడియోని డాక్టర్ అజయిత తన ట్విట్టర్‌ ఎకౌంట్ లో షేర్ చేశారు. అందులో ఓ పిల్లి ఎలుకను వేటాడుతోంది. ఎలాగైనా సరే తన  ప్రాణం కాపాడుకోవాలనుకున్న ఆ ఎలుక… అక్కడే ఆగి ఉన్న ఓ లారీ టైరు చక్రం మధ్యలో ఉండే బోల్డుల దగ్గర దాక్కుంది. ఆ బోల్టులకి బురద అంటుకొని ఉండటంతో రంగులో రంగు కలిసిపోయి… ఆ ఎలుక అక్కడున్నట్లు కనిపించట్లేదు. ఇదంతా తెలియక ఆ లారీ టైర్ ముందే పదే పదే తిరుగుతూ ఉంటుంది. చంకలో పిల్లాణ్ని పెట్టుకొని… ఊరంతా వెతికినట్లు… తన ఎదురుగా ఉన్న టైరు పైనే ఉడుత ఉన్నా.. ఆ పిల్లికి మాత్రం అది ఎక్కడుందో కనిపించలేదు. కొంతసేపు అలా వెతికిన తర్వాత నిరాశతో పిల్లి అక్కడి నుంచి వెనుదిరిగింది. ఈ రకంగా పిల్లి నుంచి ఎలుక తెలివిగా తప్పించుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top