స్పేస్ రీసర్చ్ లలో ప్రపంచ దేశాలన్నీ ఒక రూటులో వెళ్తుంటే… చైనా మాత్రం డిఫరెంట్ రూట్ లో వెళ్తుంది. అగ్రరాజ్యాలు సైతం స్పేస్ టూరిజంలో ఆధిపత్యం కోసం పోరాడుతుంటే… చైనా మాత్రం దానికి భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసం పోరాడుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.
ఏలియన్స్ పై రీసర్చ్ చేయటానికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన ఒక రాకెట్ ని స్పేస్ లోకి పంపింది చైనా. అక్టోబరు 15 అర్ధరాత్రి గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2 ఎఫ్ రాకెట్ ని ప్రయోగించింది. దీనిద్వారా ముగ్గురు ఆస్ట్రోనట్స్ టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఆరు నెలలపాటు స్టే చేయనున్నారు.
ఈ 6 నెలల కాలంలో వీళ్ళు టియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఎక్విప్మెంట్ని సెటప్ చేయడంతో పాటు… టెక్నాలజీని కూడా టెస్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే… చైనా ఇప్పటివరకూ ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ రీసర్చిల కోసం భారీగానే ఖర్చు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రయోగం ద్వారా ఏలియన్స్ ఉనికిని మరింత ముమ్మరం చేయనున్నారు. చైనా ఇప్పటివరకూ చేపట్టిన ప్రయోగాలలో సుదీర్ఘ అంతరిక్ష ప్రయోగం ఇదే!