మొత్తానికి డ్రాగన్ కంట్రీ అనుకున్నది సాధించింది. ఆర్టిఫిషియల్ సన్ ని క్రియేట్ చేసి రికార్డ్ సృష్టించింది. కొద్ది రోజుల క్రితం అరుణ గ్రహంపై రోవర్‌ని సేఫ్ గా ల్యాండ్ చేయించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన చైనా… రీసెంట్ గా కృత్రిమ సూర్యుడిని సృష్టించడంలోనూ సక్సెస్ అయ్యింది.
ఇప్పటివరకూ కొత్త కొత్త ప్రయోగాలు చేసి… విజయం సాధించడంలో చైనాది అందె వేసిన చేయి. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగం చేసి… అగ్రరాజ్యాలకే సవాలు విసురుతోంది. మనకి తెలిసి సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. ఎల్లప్పుడూ నిప్పులు చెరుగుతూ… విశ్వం మొత్తానికీ వెలుతురు, వేడిని ఇస్తాడు. అయితే, అలాంటి సూర్యుడినే కృత్రిమంగా సృష్టించింది చైనా. అయితే, ఈ కృత్రిమ సూర్యుడు కేవలం చైనాకి మాత్రమే వెలుగునిస్తాడు.
నిరంతరం మండే స్వభావమున్న హైడ్రోజన్ మరియు హీలియంల అణుకలయికతో… సూర్యుడు ఎప్పుడూ నిప్పులు చెరుగుతూ ఉంటాడు. 15 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ వద్ద సూర్యుడు ఎర్రటి నిప్పుల కొలిమిలా మారతాడు. అలాంటిది 70 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ వద్ద ఈ కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. సుమారు 1056 సెకన్ల పాటు ఈ టెంపరేచర్ అలానే స్థిరంగా ఉంది. అంటే… ఒరిజినల్ సూర్యుడికంటే ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడు దాదాపు 5 రెట్లు ఎక్కువ వేడిని కలిగి ఉంటాడు.
అయితే, ఈ కృత్రిమ సూర్యుడు నిజమైన సూర్యుడిలానే ఆకాశంలో ఉండి వెలుగునిస్తాడు అనుకుంటే పొరపాటే! ఇది కేవలం చైనాలోని ఎలక్ట్రిసిటీ, తదితర అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది.
నిజం చెప్పాలంటే, ఇదొక న్యూక్లియర్ రియాక్టర్. ఎక్స్ పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టోకామాక్ (EAST) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్. ఈ రియాక్టర్ ప్రొడ్యూస్ చేసే హై పవర్, అండ్ హై ఎనర్జీ కారణంగా దీనిని ‘ఆర్టిఫిషియల్ సన్’ అని పిలుస్తారు.
ఈ రీసర్చ్… చైనాలోని హెఫీ ప్రాంతంలో ఉన్న ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ ఆఫ్ చైనీస్ అకాడమీలో నిర్వహించారు. సూర్యుడి యొక్క పరమాణు కేంద్రంలో ఎలాగైతే హైడ్రోజన్, హీలియం అణువులు విచ్చిన్నమై… భారీ శక్తి ఉత్పత్తి అవుతుందో, అలానే న్యూక్లియర్ ఫ్యూజన్ లో హైడ్రోజన్, డ్యుటీరియం అణువులు విచ్చిన్నమై… భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది.
ఇలా ఉత్పత్తి చేసిన శక్తిని తమ దేశంలోని ఎలక్ట్రిసిటీ కోసం వినియోగిస్తామని చైనా చెప్తున్నప్పటికీ, దీని వెనుక ఏదో దురుద్దేశం కూడా ఉండే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ న్యూక్లియర్ పవర్ ని అణ్వాయుధాలకి సైతం ఉపయోగించే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే పలు దేశాలకి ముప్పు పొంచి ఉన్నట్లే!