Cockatoo Aggressive Attacked the Owner

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో)

ఎమోషన్స్  ఆనేవి మనకే కాదు జంతువులకీ, పక్షులకీ కూడా ఉంటాయండోయ్… కాకపోతే, మనం బయటపడతాం, అవి బయటపడవు అంతే తేడా! కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే వాటి ఎమోషన్స్ ఏమిటో మనకి అర్ధమవుతుంది.

సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఆకలి దప్పికలు సహజమే! కడుపు నిండినప్పుడే ఆత్మా రాముడు శాంతిస్తాడు. మరి ఆకలి వేసినప్పుడు మనిషే కాదు, మూగ జీవాలు సైతం తప్పు చేస్తాయి. పొట్ట కూటికోసం దేన్నైనా ఎదిరిస్తాయి. చివరికి సొంత యజమానిపైన అయినా తిరగబడతాయి. అలాంటి విచిత్ర సంఘటనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా.

ఎక్కడో తెలియదు కానీ, ఒక ఇంట్లో కొకాటోని పెట్ బర్డ్ గా పెంచుకుంటున్నారు. దాని యజమాని ఫిష్ కర్రీ చేయడం కోసం ఒక చేపని తెచ్చి కిచెన్ లో టేబుల్ పై పెట్టింది. కొకాటో మంచి ఆకలి మీద ఉన్నదో ఏమో… ఆ ఫిష్ ని లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది. ఇంతలో అది చూసిన యజమాని ఆ చేపని పట్టుకోవడానికి ట్రై చేయగా… ఆమెపై కోపంతో ఊగిపోతూ… ఆ చేపని లాక్కుని… దాన్ని తన కాళ్ళ క్రింద వేసుకొని కూర్చొంది.  ఈ ఘటన ఇన్సిడెంట్ జరుగుతున్నంతసేపు కొకాటో బర్డ్ ఫుల్ సీరియస్‏గా కనిపిస్తుంది. 

 

View this post on Instagram

 

A post shared by Tü Sh Ãr (@earthdixe)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top