దసరా అంటే… దేశమంతా ఒక లెక్క… మైసూర్ ప్యాలెస్ ఒక్కటే మరో లెక్క. అక్కడ జరిగే దసరా ఉత్సవాల్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది “జంబో సవారీ”. ఇందులో స్వయంగా ఏనుగులే పాల్గొంటాయి. మంగళ వ్యాయిద్యాల నడుమ అందంగా ముస్తాబైన గజరాజులు బారులుతీరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఇది మైసూర్ ప్యాలెస్ లో తరతరాలుగా వస్తున్న ఆచారం.
ప్రతీయేటా లాగే ఈ ఏడు కూడా ఈ ఉత్సవాల కోసం బయలుదేరిన ఏనుగులు సెప్టెంబర్ 13న మైసూర్ ప్యాలెస్ కి చేరుకున్నాయి. పోలీస్ బ్యాండ్ మేళాలతో, మంగళ వ్యాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అయితే, ఏటా ఈ ఉత్సవాల్లో దాదాపు 15 ఏనుగులు పాల్గొంటాయి. అయితే గతేడాది కరోనా కారణంగా ఈ ఉత్సవాల్ని సాదాసీదాగా జరిపారు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి అట్టహాసాలు లేకుండా కొద్దిపాటి ఏర్పాట్లతోనే జరపబోతున్నారు. అందువల్ల ఈ సంవత్సరం జంబో సవారీలో కేవలం 8 ఏనుగులు మాత్రమే పాల్గొనబోతున్నాయి.
ఈ 8 ఏనుగుల్లో 5 మగ, 3 ఆడ ఏనుగులు ఉన్నాయి. వీటన్నిటినీ గజరాజు అభిమన్యు ముందుండి నడిపించింది. మిగతా 7 ఏనుగులైన లక్ష్మీ, కావేరీ, చైత్ర, విక్రమ, అశ్వత్థామ, ధనంజయ, గోపాలస్వామి జయమార్తాండ గేట్ ద్వారా ప్యాలెస్ ఆవరణలోకి అడుగుపెట్టాయి. అయితే, అశ్వత్థామ మాత్రం తొలిసారిగా ఈ వేడుకల్లో పాల్గొనబోతుంది. అందుకే, ప్యాలెస్ దగ్గరికి రాగానే అక్కడి హంగామా చూసి… కాస్త టెన్షన్ పడింది.
Gajapayana – Mysuru Dasara 2021 ..
Aranya bhavana to Mysuru palace lead by Ambaari elephant AbhimanyuVC : Manoranjan pic.twitter.com/SvmuR6b9VK
— Mysuru Memes (@MysuruMemes) September 16, 2021