ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే!
ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ.
ఒక అడవిలో జింకల గుంపు చెరువును దాటే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో ఒక జింక పిల్ల అనుకోకుండా ఆ గుంపులోనుండీ విడిపోతుంది. ఒంటరిగా చెరువుని దాటుతూ ఉంటుంది. ఇంతలో ఒక మొసలి అది గమనిస్తుంది. దానిని వేటాడటం కోసం వేగంగా జింక పిల్లని సమీపిస్తుంది.
తన బిడ్డ ప్రాణం ప్రమాదంలో పడిందని గమనించిన తల్లి… ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి…మొసలికి తాను ఆహారంగా మారి… బిడ్డకు ఒక కవచంలా నిలుస్తుంది. వెంటనే జింక పిల్ల సురక్షితంగా ఒడ్డుకి చేరుతుంది. తల్లి మాత్రం… నేను చెప్పలేను… మీరే చూడండి.
ఈ వీడియో చూశాక ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా కంట తడి పెట్టి ఉంటారు కదూ! తల్లి ప్రేమంటే అదే మరి. తన బిడ్డని కాపాడుకొనే నేపధ్యంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టటానికి సిద్ధమైంది. అందుకే, ఈ వీడియో అందరి హృదయాలని కదిలించి వేస్తోంది.
View this post on Instagram