వ్యాలంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13ని ‘కిస్ డే’గా సెలెబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ డేకి ఒక్కరోజు ముందుగా జరుపుకునేదే ఈ కిస్ డే. అయితే, ఈ కిస్ డే కి ఓ ప్రత్యేకత ఉంది. ఎలాగంటే, మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అనేది ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
చాలామంది తమ ప్రేమని అవతలివారికి ముద్దు రూపంలోనే తెలియజేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ముద్దు అనేది ప్రేమికుల మధ్య సన్నిహితత్వం పెంపొందేలా చేస్తుంది. అలాంటి ముద్దులలో అనేక రకాలు ఉన్నాయి. ఏ ముద్దు ఎక్కడ పెడితే… ఎలాంటి లాభాలు ఉన్నాయో… ఇప్పుడు తెలుసుకుందాం.
నుదిటిపై ముద్దు:
నుదిటిపై ముద్దు ఆప్యాయతని, రక్షణని గౌరవాన్ని, నమ్మకాన్ని కల్గిస్తుంది. నుదిటిపై ముద్దు పెట్టుకుంటే… మీ భాగస్వామి మీ పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారని అర్ధం. మీరు వారితో ఉన్నంతసేపూ ఎంతో సేఫ్ గా ఉంటారని మీ పార్టనర్ నమ్మే విధానం ఇది. అంతేకాదు, నుదుటిమీద ముద్దు పెట్టుకున్నప్పుడు మనస్సు ఆనందంతో నిండిపోతుంది. ఇంకా ఫ్రెష్ ఎనర్జీని కూడా అందిస్తుంది.
ముక్కుపై ముద్దు:
ముక్కుపై ముద్దు మీ భాగస్వామికి మీపై ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలియజేస్తుంది. ఇది ఇంద్రియాలకు సంబంధించినది కాబట్టి ఈ ముద్దు ఎంతో సెన్సిటివ్. ముక్కుపై ముద్దాడటం వల్ల మీ పార్టనర్ పట్ల మీకున్న ప్రేమ, శ్రద్ధ, ఆరాధన ఎలాంటిదో ఇది తెలుపుతుంది.
బుగ్గలపై ముద్దు:
బుగ్గలపై ముద్దు మీరా వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు సంకేతం. ఇది ఆప్యాయత, మరియు స్నేహాన్ని తెలియచేస్తుంది. ఇలా బుగ్గపై ముద్దు పెట్టుకోవడం అనేది కేవలం లవర్స్ మాత్రమే కాదు, మీకు తెలిసినవారు, స్నేహితులు, లేదా ప్రేమించే వారు ఎవరికైనా ఇవ్వచ్చు.
మెడపై ముద్దు:
మెడపై ముద్దు కూడా ఇంద్రియాలకు సంబంధించినది. ఇలా ముద్దు పెట్టుకోవటం వల్ల అవతలి వ్యక్తి మిమ్మల్ని మరింత గాఢంగా ప్రేమిస్తున్నారని అర్ధం. అంతేకాక, మీ వైపు ఉద్రేకంతో ఆకర్షితుడవుతున్నట్లు అర్ధం.
చేతిపై ముద్దు:
చేతిపై ముద్దు మీరు ఎంతో ప్రత్యేకం అని తెలియచేస్తుంది. అవతలి వ్యక్తి చేతిని ముద్దాడటం అంటే… అవతలి వ్యక్తిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారని, మీరు వారిపట్ల చాలా వినయంగా ఉంటారని అర్ధం.
నాభిపై ముద్దు:
నాభిపై ముద్దు మీ పార్టనర్ మిమ్మల్ని పూర్తిగా నమ్మవచ్చని అర్ధం. అంతేకాక, వారికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని, అది వాళ్ళు గ్రహించాలని అర్ధం.
పెదవులపై ముద్దు:
పెదవులపై ముద్దు మీ పార్టనర్ మీతో మరింత సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నట్లు అర్ధం. లిప్ టూ లిప్ కిస్ చేయడం ద్వారా భాగస్థులిద్డరూ సరికొత్త మైకంలోకి వెళ్ళిపోతారు. ఈ ముద్దు భాగస్థులిద్డరికీ మొదటిసారి అయితే, జీవితాంతం వారి మనసులో నిలిచిపోతుంది. ఇదే ముద్దు ఎక్కువసేపు కొనసాగితే హద్దులు దాటేలా చేస్తుంది.