నిత్యం అనేక రకాల యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ ఫన్నీ వీడియో కూడా.
ఒక కుక్క డీజే సాంగ్ కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు..
ఈ వీడియోలో కొన్ని కుక్కలు ఇంటి బయట నిలబడి ఉన్నాయి. ఇంతలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వినిపిస్తోంది. అది డీజే సాంగ్ మ్యూజిక్. ఇంతలో ఓ కుక్క ఆ మ్యూజిక్ కి మైమరచిపోయి… రెండు కాళ్లపై నిలబడి చిందులేస్తూ… సరదాగా డ్యాన్స్ చేసింది.
చూడబోతే ఆ కుక్క డీజే మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తోంది. అందుకే, అంతలా డ్యాన్స్ ఆదరగొట్టేసింది. ఇలా డ్యాన్స్ చేస్తున్న కుక్కని చూసి… పక్కనే ఉన్న మరో కుక్క ఎంతో ఫిదా అయిపోయి… అలాగే చూస్తుండిపోయింది. దీన్నిబట్టే అర్ధమవుతోంది ఈ కుక్క డ్యాన్స్ ఎంత ఇరగదీసిందో..!
Lets dance 🐶🐕🦮pic.twitter.com/3BWKjFj90m
— Funny Videos / Viral Videos (@SeeFunnyVideo) April 7, 2021