నేచర్ ఎంత గొప్పదంటే, ఈ సృష్టిలో ఉండే అన్ని జీవులకు సమానంగా బ్రతికే హక్కునిచ్చింది. మనకి ఉన్నంతలో ఇతరులకి దానం చేయమని నేర్పించింది. కానీ, మాటలు నేర్చిన మనుషులేమో దారితప్పారు. మాటలు రాని మూగజీవాలు మాత్రం అది నిలబెట్టుకున్నాయి.
అందులో భాగంగానే ఒక బాతు తనకి లభించిన ఆహారంలో… చెరువులో ఉన్న చేపలకి కూడా షేర్ ఇచ్చింది. అది కూడా అలా ఇలా కాదు. స్వయంగా ఆహారాన్ని తన నోటితోనే ఆ చేపలకి అందిస్తుంది. ఆ ఆహారాన్ని అందుకునేందుకు చేపలు ఒకదాని వెంట ఒకటి పోటీపడి మరీ దాని దగ్గరకి వెళ్తున్నాయి. ఇదే కదా స్నేహమంటే..!
సాదారణంగా మనుషులైతే, తాము తిన్నాక మిగిలింది కూడా పక్క వాళ్లకు పెట్టడానికి ఇష్టపడరు. మొత్తం తామే తినాలి, లేదంటే పారేయాలి. అంతేకానీ వేరొకరి కడుపు నిండకూడదు ఇదే ఈ కాలపు సగటు మనిషి కాన్సెప్ట్. కానీ, నోరులేని మూగ జీవాలు అలాకాదు, ఇలాంటి విషయాల్లో మనుషుల కంటే చాలా బెటర్. తాము తినే ఆహారాన్ని సైతం ఇచ్చివేస్తానికి సిద్ధపడతాయి. ఇంకా ఈ లోకంలో మంచి అనేది ఏదైనా ఉంది అంటే… అది వీటివల్లే!
View this post on Instagram