Emotional Turkey Chicken in Man Hands

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిందే చైనాలోని మటన్ మార్కెట్లో! ఈ విషయం తెలిసీ కూడా ఇప్పటికీ ఎవరికీ నాన్-వెజ్ మీద మక్కువ పోలేదు. అందుకేనేమో..! ఈ మధ్య తరచుగా టర్కీ చికెన్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. 

ఈ వీడియోలో టర్కీ జాతికి చెందిన చికెన్ ఒకటి… ఏదో చెప్పుకోలేని బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా నా మనసులోని బాధని దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్… అన్నట్లుగా ఒక వ్యక్తి ఒడిలో కళ్ళు మూసుకుని పడుకుంటుంది. ఈ కోడిపిల్లని చూస్తే… ఏదో ప్రమాదాన్ని చూసి భయపడి… ఉలిక్కిపడి… గుక్కపెట్టి ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏడ్చి… ఏడ్చి… సొమ్మసిల్లి వ్యక్తి ఒడిలో సేద తీరుతున్నట్లుగా ఉంటుంది. 

Also Read: ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో)

నన్ను ఏ చికెన్ షాప్ కి పంపకండి ప్లీజ్… నన్ను కాపాడాల్సిన బాధ్యత మీదే! అన్నట్లుగా ఆ వ్యక్తినే నమ్ముకొని… ఆయన ఒడే తనకి సేఫ్ జోన్ అనుకొని ఆదమరచి పడుకుంది. ఆ వ్యక్తి కూడా నీకేం కాదు! నేనున్నాను అన్నట్లుగా చికెన్ తలపై ప్రేమతో చేయితో నిమురుతున్నట్లు కనిపిస్తుంది. 19 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ఈ వీడియోలోని చికెన్ ఫీలింగ్స్ చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఇక నుంచి మేం మారిపోయాం. ముందుముందు శాకాహారులుగానే ఉంటాం అంటూ డిసైడ్ అయిపోయారు.  

నవంబర్ 25 #Thanksgiving డే సందర్భంగా  John Oberg@JohnOberg అనే ట్విట్టర్ యూజర్… ఈ వీడియోని షేర్ చేశారు. వీడియోతో పాటు ‘‘ఎవరైనా టర్కీ చికెన్ తినాలని ప్లాన్ చేస్తే, ఈ వీడియో చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు.’’ అని క్యాప్షన్ పెట్టారు. జాన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ చూసి చాలా మంది నాన్-వెజ్ ప్రియులు ఎమోషనల్ అయ్యారు. తమ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. కొంతమంది  నెటిజన్లు అయితే ఈ వీడియో చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. అంతలా ప్రజల హృదయాలని కదిలించివేసిన ఆ వీడియోలో ఏముందో మీరే చూడండి.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top