విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ది బిగ్గెస్ట్ ఫన్ ఫ్రాంచైజీ F3. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై, దిల్‌రాజు, శిరీష్ ల నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.
లోకంలో తెలిసిన పంచభూతాలు ఐదు ఉంటాయి.. కానీ, ఆరో భూతం ఒకటి ఉంది అదే డబ్బు… అంటూ మురళీ శర్మ ఇచ్చే వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో మురళీశర్మ కోటీశ్వరుడిగా నటిస్తుంటే, వెంకటేష్ రేచీకటితోనూ… వరుణ్ తేజ్ నత్తితోనూ బాధపడే వ్యక్తులుగా నటిస్తున్నారు. ఇక వారికి భార్యలుగా తమన్నా, మెహరీన్ డబ్బు, బంగారం అంటే ఆశపడే వారిగా నటిస్తున్నారు.
డబ్బాశ కల భార్యల కారణంగా హీరోలు ఎలాంటి కష్టాలు ఎదుర్కోవలసి వచ్చిందో తెలియచేసేదే ఈ F3 సినిమా. డబ్బంటే పడిచచ్చే వారిగా ప్రగతి, వై.విజయ, అన్నపూర్ణమ్మ మొదలగువారు నటిస్తుంటే… డబ్బున్న వాడికి ఫన్… లేని వాడికి ఫ్రస్టేషన్… అంటూ మురళీ శర్మ డైలాగ్ అదిరింది.
ఒక సందర్భంలో రఘుబాబు వాళ్ళది పెద్ద మాయల మరాఠీ ఫ్యామిలీ అని చెపితే… వాళ్ళది మాయల మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ అంటాడు వెంకటేష్. ఇక మరో సందర్భంలో వాళ్ళది దగా ఫ్యామిలీ అని వెంకటేష్ చెపితే… వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ అంటాడు వరుణ్ తేజ్. ఇలా సినిమా మొత్తం మంచి ఫన్ అందిస్తుంటారు.
సునీల్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ మరింత ఫన్ క్రియేట్ చేశారు. ఇక వీరితోపాటు సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేయనుంది.
వీరందరి కాంబినేషన్ లో గతంలో రిలీజైన F2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే! అందుకే దానికి సీక్వెల్ గా వస్తున్న F3 లో ఈ ఫన్ డోస్ ని మరింత పెంచేశారు. ఏదేమైనా ఈ కామెడీని ఫుల్ గా ఎంజాయ్ చేయాల్నాటే, మే 27 వరకూ ఆగక తప్పదు.