ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి చుట్టుపక్కల పరిసరాలంతా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న దుకాణాలు, ఇళ్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఆర్థనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఓ ఫ్యూయల్ ట్యాంకర్ బ్లాస్ట్ అవటమే!
రాజధాని ఫ్రీ టౌన్‌లో… నిత్యం ఎంతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో… ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొనటంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి అక్కడ మార్కెట్లో షాపింగ్‌కు వచ్చిన వాళ్లు కూడా చనిపోయారు.
సమీప ప్రాంతంలోనే ఫ్యూయల్ స్టేషన్ ఉండటంతో… పేలుడు జరిగిన వెంటనే చాలా వేగంగా మంటలు వ్యాపించాయి. ఫ్యూయల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు జనావాసాలకు కూడా ప్రాకాయి.
ఇదిలా ఉంటే… బ్లాస్ట్ అయిన ఆయిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో… దానిని బాటిళ్ళు, క్యాన్లు, డబ్బాలతో తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున జనం పోగయ్యారు. ఇదే వాళ్ల పాలిట శాపం అయింది. ఊహించని విధంగా పేలుడు జరగడంతో… వీరంతా ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా కాలిపోయి, సగం కాలిపోయి, శరీర భాగాలు కోల్పోయి ఇలా అనేక రకాలుగా వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చూడటానికి ఆ ప్రదేశమంతా ఓ భయానక వాతావరణాన్ని నెలకొల్పింది.
Tanker explosion kills hundreds at a gas station on Friday night in Wellington a surbub in #Freetown according to Disaster Management Agency rescue efforts underway @AFP pic.twitter.com/YjDpafGGe1
— Mohamed Saidu Bah (@MohamedSaiduBah) November 6, 2021