మహాభారతంలోని ప్రతి సంఘటన మన జీవితానికి ఓ గొప్ప గుణపాఠం. దానికి ఉదాహరణే గాంధారి శాపం. ద్వాపరయుగం నుండీ కలియుగం వరకూ వెంటాడుతూ ఉంది ఈ శాపం. పురాణ కాలంలో గాంధారి పెట్టిన శాపం కారణంగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అట్టుడికి పోతుంది. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ కి గాంధారి పెట్టిన శాపమేంటి? అసలు ఆఫ్ఘనిస్తాన్ తో గాంధారికి ఉన్న లింకేంటి? ఇలాంటి ఇంటరెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం.
గాంధార చరిత్ర ఏమిటి?
ఋగ్వేదం, అథర్వణ వేదం వంటి వేదాలు; రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో ప్రస్తావించబడిన పురాతన భారతీయ రాజ్యం గాంధార.
గాంధార ప్రాంతంలో నివసించే గాంధారీల గురించి మొదటి ప్రస్తావన ఏంటంటే… వాళ్ళు గొర్రెలను కాసే ఒక తెగగా ఋగ్వేదంలో పేర్కొన్నారు. అథర్వణ వేదంలో కూడా వీరిని మరికొన్ని తెగలలో ఒకటిగా తెలిపారు.
ఇక రామాయణ కాలంలో రాముని సోదరుడైన భరతుడు ఇక్కడ తక్షశిలని స్థాపించాడు. ఆ తర్వాత భరత వంశస్థులు ఈ ప్రాంతాన్ని పాలించారు. గాంధార తెగని సూపర్ నేచురల్ పవర్స్ కలిగి ఉన్న గంధర్వులు అని కూడా చెప్పేవారు. ఎందుకంటే, మహాభారత కాలంలో యాదవ రాజైన బల రాముడు ఒకసారి తన తీర్థయాత్ర సమయంలో గాంధారానికి దూరంగా ఉన్న సరస్వతి నది ఒడ్డున అనేక గంధర్వ స్థావరాలను చూశాడు. ఇక కురువంశ రాజైన ధృతరాష్ట్రుని భార్య కూడా గాంధారకి చెందినది. అందుకే ఆమెకి గాంధారి అనే పేరుపెట్టబడింది. ఇలా ఎటునుంచీ చూసినా గాంధార ప్రాంతానికీ, అక్కడ నివసించే గాంధార ప్రజలకీ పురాణ కాలం నుంచీ ఓ ప్రత్యేకత ఉంది.
నిజానికి ఒకప్పుటి గాంధార అంటే ఈరోజు మనం చూసేది కాదు, ఇప్పుడు మనమంతా చెప్పుకొంటున్న ఆఫ్ఘనిస్థాన్ నే అప్పట్లో గాంధార అనే పేరుతో పిలువబడేది. గాంధార రాజ్యం ఇప్పుడున్న ఉత్తర పాకిస్తాన్ మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది పోతోహార్ పీఠభూమి, పెషావర్ లోయ మరియు కాబూల్ నదీ లోయ వరకూ విస్తరించి ఉంది.
ఈ భూభాగమంతా ఒకప్పుడు మన దేశంలోనే కలిసిపోయి ఉండేది. ఆ తర్వాత భారత్ నుండీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ రెండు దేశాలుగా విడిపోయాయి. దీన్నిబట్టి చూస్తే గాంధార అనేది పురాతన భారతీయ ప్రాంతం.
గాంధార రాజ్య యువరాజు ఎవరు?
మహాభారత పురాణం ప్రకారం, సుమారు 5,500 సంవత్సరాల క్రితం ఈ గాంధార రాజ్యాన్ని సుబల అనే రాజు పరిపాలించేవాడు. అతనికి మొత్తం 100 మంది సంతానం. వారిలో 100వ సంతానం శకునైతే, ఆయనకున్న ఏకైక కూతరు గాంధారి. ఈమె మతి అనే దేవత యొక్క అవతారంగా భావిస్తారు.
అయితే గాంధారి జన్మించినప్పుడు జ్యోతిష్కులు ఆమె జాతకం ఏమీ బాలేదని చెప్తారు. ఆమెను పెళ్ళిచేసుకొనే వారెవరైనా సరే… వాళ్ళ ఆయుష్షు తీరి, వెంటనే మరణిస్తారని కూడా చెప్పారు. ఈ దోషాన్ని పోగొట్టటం కోసం ముందుగా ఆమెకి ఒక మేకతో వివాహం జరిపించి, వెంటనే ఆ మేకను బలి ఇచ్చి చంపేస్తారు. ఈ విధంగా గాంధారి విధవరాలు అవుతుంది.
ఆ తరువాత ఆమెకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని తగిన వరుడి కోసం వెదుకుతున్న సమయంలో ఒకసారి అనుకోకుండా సుబలుడు భీష్ముడుని కలుస్తాడు. మాటల మద్యలో వీరి మద్య పెళ్ళి టాపిక్ వస్తుంది. అప్పుడు సుబలుడు గాంధారి పెళ్ళి గురించి ప్రస్తావన తెస్తాడు. తన కూతురు పుట్టుకతోనే ధర్మ స్వభావం కలిగి ఉండి అంకిత భావంతో ఉండేదని తనకొక మంచి వరుడి కోసం వెతుకుతున్నానని చెప్తాడు.
వెంటనే భీష్ముడు పుట్టు గుడ్డివాడైన ద్రుతరాష్ట్రుడికి గాంధారే తగిన భార్య అని, వీరిద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని తలచి… ధృతరాష్ట్రుడి గురించి చెప్తాడు. అయితే ద్రుతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం తెలియనీయకుండా బీష్ముడు చాలా జాగ్రత్త పడతాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ ఒప్పుకోదని తెలిసి భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెడతాడు. మొత్తంమీద వీరిద్దరికీ వివాహం జరిపిస్తారు.
ఇదిలా ఉంటే… అనుకోకుండా ఒకరోజు గాంధారి విధవరాలు అన్న విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతాడు. విషయం దాచిపెట్టి తనని మోసం చేసినందుకు ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయండి! అంటూ ఆదేశిస్తాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు.
రాజాజ్ఞ మేరకు గాంధారి తండ్రిని, సోదరులను బందించి కారాగారంలో వేస్తారు. అయితే, రాజధర్మం ప్రకారం కారాగారంలో వేసిన వాళ్ళందరికీ ఆహరం తప్పకుండా ఇవ్వాలి. కానీ ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు మాత్రమే ఇచ్చేవారు. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలు కలగడానికి కారణం బీష్ముడు కాబట్టి అతనిపై పగ పెంచుకుంటాడు సుబలుడు.
భీష్ముడిని, ఇంకా కురువంశం మొత్తాన్ని నాశనం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం అందరిలోకీ తెలివి గలవాడైన శకునిని ఎంచుకొంటాడు. అతనిని ఎలాగయినా బతికించాలని అనుకొంటాడు. ఈ క్రమంలో వారికి పెట్టిన అన్నం మెతుకులన్నిటినీ కలిపి ఒక ముద్దగా చేస్తాడు. దానిని శకునికి పెట్టి… అతనిని బతికిస్తారు. శకుని తండ్రి, మరియు మిగతా సోదరులు మాత్రం ఆకలితో అలమటించి కొంతకాలానికి జైల్లోనే మరణిస్తారు.
మరణించే ముందు సబలుడు శకునితో ఇలా అంటాడు. మేమిక్కడ ఎన్ని నరకయాతనలు అనుభవించి చనిపోతున్నామో నువ్వు కళ్లారా చూశావు కదా! మేమంతా కలిసి నిన్ను బతికించింది నువ్వు మన పగ తీరుస్తాతావని. భవిష్యత్తులో నీకు రాజభోగాలు కలిగి మన పగను మరిచిపోతే మా ఈ ప్రాణ త్యాగాలకు అర్ధం ఉండదు అని చెబుతాడు. అంతేకాదు, కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి శకుని తొడ ఎముకను విరిచి అతనిని అవిటివాడిగా కూడా మారుస్తాడు.
యువరాజుగా ఉన్న శకుని, తన తండ్రి సుబల మరణించిన తరువాత గాంధార రాజ్యానికి రాజు అవుతాడు. ఒకపక్క తండ్రికిచ్చిన మాట, మరోపక్క కురువంశంపై తీర్చుకోవాల్సిన పగ. ఈ రెండు కారణాల వల్ల తన సోదరి గాంధారితో పాటు హస్తినా రాజ్యంలో నివసించాల్సి వచ్చింది. అందుకే తన సొంత రాజ్యాన్ని విడిచిపెట్టాడు.
మహాభారతం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సన్నిహిత సంబంధం ఏమిటి?
మహాభారతానికీ, ఆఫ్ఘనిస్థాన్ తో చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. వేల సంవత్సరాల క్రితంనుండే వీటిమధ్య లోతైన సంబంధం ఉంది. గాంధార రాజు సుబల మరణం, మరియు గాంధార రాజ కుటుంబం పతనానికి దారితీసిన రాజకీయ కుతంత్రాల తరువాత, శకుని తన సోదరిని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవటం తన బాధ్యతగా భావించాడు.
తన కుటుంబంపై జరిగిన అన్యాయాలకి గాను శకుని కురు రాజవంశం పట్ల, ముఖ్యంగా ధృతరాష్ట్రుడు మరియు అతని కుమారుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో రగిలిపోయాడు.
మొదటినుండీ తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ఆ అభిమానంతోనే గాంధారిని ఒక గుడ్డివాడికిచ్చి పెళ్లి చేశాడని భీష్ముడిపై ఒకపక్క కోపం పెంచుకొంటాడు. మరోపక్క తన కుటుంబాన్ని చెరసాలలో బంధించి ఆకలితో అలమటించి మరణించేలా చేశాడని ధృతరాష్ట్రుడిపై పగ పెంచుకొంటాడు. ఈ రెండు బలమైన కారణాలతో కురువంశాన్ని అంతమొందించటమే లక్షంగా పెట్టుకొంటాడు. దాని కోసమే హస్తినలో తిష్టవేస్తాడు.
కొంతకాలానికి గాంధారికి కౌరవులు అని పిలువబడే 100 మంది కుమారులు కలుగుతారు. వీరంతా కురు వంశానికి చెందిన వారసులు. అందుకే వారి పతనాన్ని కోరుకొంటూ వాళ్ళందరినీ తప్పుదారి పట్టిస్తాడు, ముఖ్యంగా కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడిని తనవైపుకి తిప్పుకొంటాడు. ఒకవైపు కురువంశాన్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ… మరోవైపు మనసులో ఉన్న పగనీ, ప్రతీకారాన్నీ ఎవ్వరికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడతాడు.
పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడు చేసిన కుట్రలన్నింటికీ గాంధార యువరాజు శకుని మూలం. ఇది చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. మహాభారత కాలంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతమైన అప్పటి గాంధార రాజ్యం చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. 18 రోజుల పాటు సాగిన ఆ మహా యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రక్తపాతం జరిగింది. ఆ తర్వాత కౌరవ వంశానికి చెందినవారిలో మిగిలి ఉన్న ప్రజలు ఈ గాంధార రాజ్యంలోనే నివసించారని నమ్ముతారు. ఈ విధంగా మహాభారతానికీ, ఆఫ్ఘనిస్థాన్ తో చాలా బలమైన సంబంధమే ఉంది.
ఇది కూడా చదవండి: మహాభారతంలో శకుని జీవిత రహస్యం
గాంధారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఎందుకు శపించింది?
కురుక్షేత్ర సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో హస్తినలో ఉన్న గాంధారి, ధృతరాష్ట్రులు విదురుడి ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకానొక సారి కౌరవులంతా చనిపోయరని తెలుస్తుంది. ఆ విషయం తెలిసి గాంధారి ఒక తల్లిగా ఎంతో తల్లడిల్లి పోతుంది. తనకింత పుత్రశోకాన్ని మిగిల్చినందుకు వెంటనే శకునిని శపిస్తుంది. తన 100 మంది కొడుకుల చావుకి మూల కారణమైన, తన సోదరుని రాజ్యంలో కూడా ఎప్పుడూ రక్తపాతమే జరుగుతూ ఉంటుందనీ, అక్కడ శాంతి అనేది ఉండకుండా ఎల్లప్పుడూ బాధలు పడతారనీ, ఎవరూ కూడా అక్కడ శాశ్వతంగా నివసించలేరని శపిస్తుంది.
ఇక కడసారిగా తన కుమారులని చూసుకోవటం కోసం గాంధారి కురుక్షేత్రానికి వెళ్తుంది. యుద్ధ భూమిలో నిర్జీవంగా పడి ఉన్న తన కుమారులందరినీ చూసి ఎంతో వేదనతో విలపిస్తుంది. చివరిగా తన పెద్ద కుమారుడు దుర్యోధనుడిని చూసి గాంధారి ఒక్కసారిగా కుప్పకూలి పోతుంది. కురు వంశంలో ఇంతమంది పెద్దలు ఉండీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేక పోయారే అని చింతిస్తుంది. చివరికి సర్వం తెలిసిన కృష్ణుడు కూడా ఈ వినాశనాన్ని ఆపలేకపోయాడే అని గర్భ శోకంతో కృష్ణుడిని కూడా నిందిస్తుంది. నా వంశం ఎలా నాశానమైందో… నీ యాదవ వంశం కూడా అలాగే నాశనమైపోయి నీవు దిక్కులేని చావు చస్తావు అని శపిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్‌పై గాంధారి శాపం ప్రభావం ఏమిటి?
గర్భ శోకంతో గాంధారి ఇచ్చిన ఆ శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో ఎప్పుడూ శాంతి వాతావరణం అనేదే లేదు. యుగాలు మారినా గాంధారి పెట్టిన శాప ఫలితం మనల్ని వెంటాడుతూనే ఉంది. ద్వాపర యుగం ముగిశాక ఎన్నో రాజ వంశాలు ఈ గాంధార ప్రాంతాన్ని పరిపాలించాయి. అయినప్పటికీ ఇక్కడ శాంతి లేదు.
తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, అంతకు ముందు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణం లేదు. ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించినా అక్కడ గొడవలు, అలర్లు, మారణ హోమాలు వంటి ఉద్రిక్తతలే తప్ప ప్రజల మద్య సయోధ్య అనేదే లేదు.
ఇది పౌరాణిక శాపంగా మాత్రమే కాకుండా వివిధ చారిత్రక, భౌగోళిక, రాజకీయ మరియు సామాజిక కారకాలకు కూడా కారణమని చెప్పవచ్చు. వీటన్నిటికీ మూల కారణం గాంధారి శాప ప్రభావమేనని చెప్పవచ్చు.
గాంధారం కాందహార్‌గా ఎలా మారింది?
గాంధార అనే పేరుకు అనేక అర్థాలు ఉన్నాయి. నిజానికి గాంధారలో “గాంధ” అనేది సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అర్ధం “సువాసన”, ఇక “హర్” అంటే ‘భూమి’ స్ట్రైట్ గా చెప్పాలంటే, గాంధార అంటే ‘సువాసన గల భూమి’. అని అర్ధం.
నిజానికి గాంధార ప్రాంత చరిత్ర అనేది 50,000 సంవత్సరాల పూర్వమే మొదలైంది. ఇది ప్రపంచం లోనే అత్యంత పురాతనమైన ప్రాంతంగా చెప్పబడుతుంది. మరో విధంగా చెప్పాలంటే, శివుని సహస్రనామాలలో గాంధారం అనే పేరు కూడా ఒకటి. అందుకేనేమో ఈ గాంధార రాజ్యంలో నివసించే ప్రజలు మొదటినుండీ శివ భక్తులు. ఈ రకంగా చూస్తే గాంధార స్వచ్చమైన హిందూ దేశం. అయితే, రాను రానూ గాంధారీలు అంతరించి పోయి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాస్తా కాందహార్ గా మారిపోయింది.
కృత యుగంలో మొదట ఈ గాంధార ప్రాంతమంతా కొండలతో, ఎత్తైన పీఠభూములతో నిండి ఉండేది. అందుకే ఈ ప్రాంతంలో ఎవరూ నివసించే వారు కాదు..
త్రేతా యుగ కాలం వచ్చేసరికి ఈ ప్రాంతాన్ని భరతుడు స్థాపించాడు అతని కుమారుడు తక్ష పేరు కలిసి వచ్చే విధంగా ఈ ప్రాంతానికి తక్షశిల అని పేరు పెట్టారు. అతనే దీని మొదటి పాలకుడు. ఈ తక్షశిల ఒకప్పుడు ఆంధ్రా రాజధానిగా ప్రసిద్ధ నగరంగా వెలుగొందింది.
ద్వాపర యుగంలో ఈ ప్రాంతాన్ని గాంధార రాజ్యమనే పేరుతో పిలిచేవారు. గాంధార రాజ్యానికి యువరాజు శకుని. ఈ గాంధార రాజ్యానికి చెందిన ప్రముఖులంతా కురు క్షేత్ర యుద్ధంలో పాల్గొని కౌరవుల తరపున పోరాడిన వాళ్ళే. యుద్ధానంతరం మిగిలి ఉన్న వాళ్ళు, కురు వంశీయులు అంతా ఈ గాంధార సామ్రాజ్యంలోనే స్థిరపడి పోయారు. ఆ తర్వాత క్రమంగా వాళ్ళంతా సౌదీ అరేబియా, ఇరాక్‌లకు వలస వెళ్లారు.
గాంధారా పురాతన భారత ఉపఖండం. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాయవ్య భాగంలో పెషావర్ బేసిన్లో ఉన్న ఒక పురాతన రాజ్యం. ఇది మహాజనపదంగా ఉండేది. మహాజనపదం అంటే కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపే ఒక పెద్ద భూభాగం. అప్పట్లో గాంధార యొక్క రాజధాని నగరంగా పుష్కలవతి ఉంది.
క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో కుషాను చక్రవర్తి కనిష్క ఈ రాజధాని నగరాన్ని పెషావర్ కు తరలించారు. అప్పటినుంచీ పెషావర్ కేంద్రంగా కుషానులు అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి కాలంలో బౌద్ధమతం, సంస్కృతి బాగా ఉచ్ఛస్థితికి చేరుకున్నాయి. 3వ శతాబ్దంలో కుషానులను ఓడించి సస్సనిదులు తమ రాజ్యాన్ని స్థాపించారు. తరువాత 4వ శతాబ్దంలో హూణుల పాలన ప్రారంభమైంది. వారిని ఓడించిన హెఫ్తాలైట్ల పాలన కొద్దికాలమే సాగింది. కాని వారి రాజ్యం 5వ శతాబ్ది నాటికి చాలా బలమైనదిగా ఉండేది.
క్రీస్తుపూర్వం 557 లో హెఫ్తాలైట్లను ఓడించి ససానియా రాజు 1వ ఖుస్రో మళ్ళీ బలం పుంజుకున్నాడు. కాని కుషానులు, హెఫ్తాలైట్ల తర్వాత వచ్చిన రాజులు కాబూలిస్తానులో ఒక చిన్న రాజ్యం మాత్రమే నిలుపుకొన్నారు. వారిలో చివరివాడైన ‘కాబూలి షా’ను జయించి అరబ్బు సైన్యాలు ఇస్లామిక్ పాలన ఆరంభించారు.
6వ శతాబ్దంలో గాంధారాన్ని అచెమెనిడ్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. అది క్రీస్తుపూర్వం 327లో అలెగ్జాండర్ ది గ్రేట్ చేత జయించబడింది. తరువాత మౌర్య సామ్రాజ్యంలో భాగమైంది ఆ తరువాత ఇండో-గ్రీక్ సామ్రాజ్యంలో భాగమైంది.
7వ శతాబ్దం నాటికి గాంధారంలోని అనేక ప్రాంతాలలో బౌద్ధమతం చాలా అభివృద్ధి చెందింది. 7వ శతాబ్దం తర్వాత అరబ్ మరియు టర్క్ ముస్లింలు ఇక్కడ దండయాత్ర చేయడం ప్రారంభించారు. క్రీస్తుపూర్వం 870లో అరబ్ సైన్యాధ్యక్షుడు యాకుబ్ అలెస్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నాడు. దీని తరువాత, ఇక్కడ బౌద్ధులచే హిందువుల బలవంతపు మతమార్పిడి ప్రచారం ప్రారంభమైంది. ఈ పోరాటం వందల సంవత్సరాల పాటు కొనసాగింది చివరికి, కాఫీరిస్తాన్ మినహా ఆఫ్ఘన్లు అందరూ ముస్లింలుగా మారారు.
8-9 శతాబ్దాల వరకు ఈ ప్రాంతమంతా బౌద్ధమతం ప్రచారంలో ఉంది. 10వ శతాబ్దంలో ఘజనీ మొహమ్మద్ దండయాత్ర కారణంగా బౌద్ధమతం క్షీణించింది. 18వ శతాబ్దం మధ్యకాలంలో కాందహార్ కేంద్రంగా అహమ్మద్ షా దుర్రానీ విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు. అప్పటినుండీ ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుతో ప్రత్యేక ప్రాచుర్యం పొందింది. కాని 19వ శతాబ్దంలో ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమయింది. ఆగస్టు 19, 1919 న మళ్ళీ స్వతంత్ర దేశంగా మారింది. ఇలా గాంధార కాస్తా కాందహార్ గా మారి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ గా పిలవబడుతుంది.
ఇది కూడా చదవండి: Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటికీ ఎలాంటి మారణహోమం జరుగుతోంది?
1970 దశకం నుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీ దాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఆఫ్ఘనులోని ప్రభుత్వ వ్యతిరేక ముజాహిదీన్ బలగాలకు పాకిస్తాను గూఢచారి సంస్థ ఐ.ఎస్.ఐ ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది.
ఫలితంగా 10 సంవత్సరాలు సాగిన ఈ అంతర్యుద్ధంలో దాదాపు 20 లక్షల ,మంది ఆఫ్ఘన్ వాసులు మరణించారని అంచనా. 50 లక్షలు పైగా ఆఫ్ఘన్లు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్ళారు. దీనికి ప్రపంచదేశాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. తరువాత ఆఫ్ఘనిస్థాన్ అవసరాలను అమెరికా పట్టించుకోలేదు. 1992 దాకా రష్యా మద్దతుతో కొనసాగిన నజీబుల్లా ప్రభుత్వం, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తానులో కొనసాగి తరువాత పతనమయ్యింది.
అప్పటికే ఆఫ్ఘనిస్థాన్ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. 1994లో జరిగిన ఘర్షణలో కాబూలులో 10,000 మందికి పైగా మరణించారు. సరైన నాయకత్వం లేకపోవటంతో యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం వంటివి పెరిగిపోయాయి. సమయాన్ని అవకాశంగా తీసుకుని, తాలిబన్లు బలమైన శక్తిగా మారారు. 1996 నాటికి క్రమక్రమంగా కాబూలును తమ వశం చేసుకున్నారు. 2000 నాటికి దేశంలో 95% వారి అధీనంలోకి వచ్చేసింది. 2001 తరువాత నాటో జోక్యంతో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం అమెరికా సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో పోలిస్తే UAE మరియు సౌదీ అరేబియా వంటి దేశాలు ఎలా ఉన్నాయి?
మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అయిన యుఎఇ, సౌదీ అరేబియా వంటి దేశాలు తరచుగా ఆఫ్ఘనిస్థాన్‌తో కంపేర్ చేయబడతాయి. కానీ, అవి ఆఫ్ఘనిస్థాన్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. UAE బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు స్థిరమైన పాలనను కలిగి ఉంది. సౌదీ అరేబియా కూడా ఆర్థికంగా బలంగా ఉంది. దానికి కారణం అక్కడ ఉన్న చమురు నిల్వలే! ఈ రెండు దేశాలు రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఇక్కడ విద్య, వైద్యం, చదువు, ఉద్యోగం వంటి విషయాలలో పూర్తి అభివృద్ధి సాదించాయి. మోడ్రెన్ సిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో ఈ రెండు దేశాలూ ముందున్నాయి. మహిళల హక్కులు, సామాజిక స్వేచ్ఛ వంటి విషయాలలో ఇప్పటికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌తో పోల్చినప్పుడు మరింత అభివృద్ధి చెందాయి.
మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ అనేక సంవత్సరాలపాటు సంఘర్షణ, అస్థిరత, రాజకీయ గందరగోళం కారణంగా సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఎదుర్కొంది. కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న తాలిబాన్ నియంత్రణ, ప్రజా సేవలకు పరిమిత ప్రాప్యత, ఆర్థిక అస్థిరత, బలహీనత వంటి అంశాలు న్యాయ వ్యవస్థ, పేదరికం మరియు లింగ అసమానత, మానవ భద్రతా సమస్యలతో ఆ దేశం భయంకరమైన జీవనాన్ని గడుపుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు విజయం సాధించలేకపోయింది?
ఇస్లామిక్ శకానికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ మతం ఆధిపత్యం వహించింది. ఆ తర్వాత బలవంతంగా మతమార్పిడి చేశారు. హిందువులను హింసించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూమతాన్ని బెదిరించి, చంపి తరిమికొట్టారు. 11వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు, చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యి మసీదులుగా మారుతున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ భారతదేశంలో భాగమే కాదు, హిందూ దేశం కూడా. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూయిజం అంటే బౌద్ధమతం మరియు సిక్కుమతం అని కూడా అర్థం. కానీ, నేడు ఆఫ్ఘనిస్తాన్‌లో హిందూ మతం ఉనికి ముగింపు దశకు చేరుకుంది.
అవినీతి, అభద్రత, అనిశ్చితి, పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, దేశమంతటా ఉన్న మందు పాతరలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేకంగా సాగుతున్న గంజాయి పెంపకం, బలహీనమైన పాలన రాజకీయ అంతర్యుద్ధాలు, తాలిబాన్ల దాడులు, మిగిలి ఉన్న అల్-కైదా ప్రభావం ఇవన్నీ ఆఫ్ఘన్ ప్రభుత్వం యొక్క భవిష్యత్తుని సవాలు చేస్తున్నాయి. ఈ కారణాల వల్లనే ఆఫ్ఘనిస్తాన్ జీవన ప్రమాణాలు ప్రపంచంలోనే చాలా ఆటడుగు స్థాయిలో ఉన్నాయి.
చివరిమాట
ఇక ఫైనల్ గా ఈ టాపిక్ గురించి మనం తెలుసుకొన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మహా పతివ్రతకి తీరని దుఃఖాన్ని మిగిల్చిన ఈ ప్రాంతంలో ఎప్పటికీ ప్రశాంతతకి చోటు లేదు. పుత్రశోకంతో ఆమె పెట్టిన శాపమే ఇప్పుడు కార్చిచ్చుగా మారి ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని దహించివేస్తుంది. యుగాలు మారినా ఆ శాప ప్రభావం ఇప్పటికీ ఆ దేశంపై చెరగని ముద్ర వేసింది. అంతేకాదు, ఇదే చిలికి చిలికి గాలివానై 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కూడా చరిత్ర చెప్తుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, యుగాంతానికి నాంది పలికే ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టేది కూడా ఈ ఆఫ్ఘనులే! అంటే, ద్వాపర యుగం నాటి ఆ గాంధారి శాప ఫలితమే… కలియుగం నాటి ఈ భూ వినాశనం.