“గేట్ ఆఫ్ ది గాడ్స్” ని ‘అరము మురు’ లేదా ‘ప్యూర్టా డి హయు మార్కా’ అని కూడా పిలుస్తారు. ఇది పెరూలోని రాతి శిల్పం. ఇది దక్షిణ అమెరికాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన టిటికాకా సరస్సు సమీపంలోని అండీస్ పర్వతాలలో ఉంది.
గేట్ ఆఫ్ ది గాడ్స్ అనేది సహజమైన రాతి ముఖం నుండి చెక్కబడిన పెద్ద, తలుపు లాంటి నిర్మాణం. ఇది ఏడు మీటర్ల పొడవు మరియు వెడల్పుతో ఉంటుంది, దాదాపు రెండు మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ వద్ద ఒక చిన్న అల్కోవ్ ఉంది. అరము మురు అనే పేరుకి “పాము నోరు” అని అర్ధం వస్తుంది. ఇది పోర్టల్ ఆకారాన్ని సూచిస్తుంది.
పురాణాల ప్రకారం, టిటికాకా సరస్సు సమీపంలో ఒక రహస్యమైన తలుపు ఉంది. ఆ తలుపు, ఏదో ఒక రోజు తెరుచుకుంటుంది. దానిని స్వయంగా దేవతలే తెరుస్తారట. అప్పుడు మానవాళి మొత్తం దేవతలను స్వాగతిస్తూ నివాళులు అర్పిస్తారు. ఆ దేవతలంతా “సోలార్ షిప్స్” లో మన భూమిపైకి వస్తారు. వారిని చూసి మొత్తం మానవజాతి విస్మయం చెందుతుంది అని అంటారు.
విచిత్రమేమిటంటే, పరిశోధకుల ప్రకారం అలాంటి తలుపు నిజంగా ఉనికిలోనే ఉంది. పెరూలోని పునో నగరానికి 35 కి.మీ దూరంలో ఉన్న ‘హయు బ్రాండ్’ పర్వత ప్రాంతానికి సమీపంలో ఉంది. దీనిని “గేట్ ఆఫ్ ది గాడ్స్” అంటారు.ఇది మనకి కనిపిస్తుంది కానీ, దాని వెనుక తెలియని రహస్యమేదో దాగి ఉంది.
పురాతన కాలం నుండి, ఈ ప్రాంతం స్థానికులచే గౌరవించబడుతోంది. వాస్తవానికి దీనిని “దేవతల నగరం” గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు కనుగొనబడినప్పటికీ, ఉపరితలం క్రింద అనేక స్మారక చిహ్నాలు దాగి ఉన్నాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
ఈ నిర్మాణానికి భారతీయుల పురాణాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. పురాణాల ప్రకారం, సుదూర కాలంలో, గొప్ప వీరులు దేవతలు భూమిని దాటి, సంపన్నమైన మరియు అద్భుతమైన అమర జీవితాన్ని ఆస్వాదించారు.
మరొక పురాణం ప్రకారం, స్పానిష్ ఆక్రమణ సమయంలో, “టెంపుల్ అఫ్ సెవెన్ రేస్” పూజారి అయిన ‘అమరు మురు’ అని పిలువబడే వ్యక్తి తన ఆలయం నుండి పవిత్రమైన బంగారు డిస్క్‌తో పారిపోయాడు. స్పానిష్ వారు అతని నుండి ఆ కీని తీసుకుంటారని భయపడి హయు బ్రాండ్ పర్వతాలలో ఉన్న ఓ రాతి గుహలో దాక్కుంటాడు.
తరువాత పూజారి హయు మార్కా వద్ద ఉన్న “గేట్ ఆఫ్ ది గాడ్స్” వద్దకు చేరుకుంటాడు, అక్కడ అతను ఆ ప్రాంతంలోని అనేక మంది పూజారులు మరియు షమన్లకు ఆ కీని చూపించాడు. వారు ఒక విధమైన పూజ చేసిన తర్వాత, దాని నుండి వెలువడే నీలి కాంతితో తలుపు తెరవబడింది. పూజారి అమరు మురు బంగారు డిస్కును షామన్లలో ఒకరికి ఇచ్చి, తలుపులోకి ప్రవేశించాడు, వెంటనే అతను మళ్లీ కనిపించలేదు. ఏమయ్యాడో కూడా తెలియదు.
అప్పటినుండీ దీని లోపలికీ ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఏదో శక్తి ఆపివేస్తుంది. “గేట్ ఆఫ్ ది గాడ్స్” తలుపు మీద చేతులు ఉంచిన సందర్శకులు తమకు కరెంట్ షాక్ కొట్టినట్లు తమ శరీరాల ద్వారా ప్రవహించే గొప్ప శక్తిని అనుభవిస్తున్నట్లు చెప్పారు. దీని లోపలికి వెళ్ళిన కొంతమంది చనిపోయారు. మరికొంత మంది ఆ శక్తిని తట్టుకోలేక బయటికి పరుగులు తీశారు. ఆ శక్తినుండీ కాపాడుకొనేందుకు చివరికి ఆ ద్వారాన్ని మొత్తం రాతి తలుపుతో మూసేశారు.
అప్పటినుంచీ ఈ సెవెన్ రేస్ గేట్ ఆఫ్ ది గాడ్స్ ని కేవలం గాడ్స్ మాత్రమే వచ్చి తెరుస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది అసాధారణమైనది అని కొందరి భావన.
పరిశోధకులు టిటికాకా సరస్సు క్రింద ఉన్న పురాతన నగరం యొక్క అవశేషాలను కూడా కనుగొన్నారు, ఈ ప్రాంతంలోని తెలిసిన సంస్కృతులకు పూర్వం, వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉందని భావించారు.
ఇతర గెలాక్సీలతో అనుసంధానించబడిన “పోర్టల్స్” భూమిపై ఉండే అవకాశం ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాక్స్ పై అనేక ఏలియన్ ముఖాలని పోలిన ముఖ చిత్రాలు, గుర్తు తెలియని లిపిలో చెక్కబడిన రాతలు ఉన్నాయి. ఇంకా వీటిపై ఎటువైపు నుంచీ చూసినా 7 మీటర్లు వచ్చేలా గీసిన సరళ రేఖలు కనిపిస్తున్నాయి. అవి వెతికి సంకేతమో తెలియట్లేదు. మరి ఈ రహస్య ప్రదేశంలో దాగున్న మర్మమేమిటో అంతు చిక్కట్లేదు.
చివరి మాట:
ఏది ఏమైనప్పటికీ, దీని ప్రత్యేకమైన డిజైన్ మరియు స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంది. “గేట్ ఆఫ్ ది గాడ్స్” మిస్టరీ దాని నిజమైన ఉద్దేశ్యం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది.