మొదటిసారి తీసుకొనే శాలరీ ఎవరికైనా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అంతేకాదు, మొట్టమొదటి సంపాదన, నెలరోజుల కష్టార్జితం తమ ఎకౌంట్లో పడగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అంతేకాదు, అప్పటివరకూ ఉండే ఒత్తిడి, చిరాకు వంటివి ఒక్కసారిగా మాయమై పోతాయి. శాలరీ చేతిలో పడగానే రిఫ్రెష్ అయిపోతారు.
అయితే, ఈ హ్యాపీనెస్ అంతా జీతం తీసుకొని బయటికి వచ్చాక మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి అప్పటిదాకా ఆగలేకపోయింది.తన ఇన్ సైడ్ ఫీలింగ్ ని డైరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేసింది. అందుకే, ఏకంగా ఏటీఎం ముందే స్టెప్పులేసేసింది.
ఈ సంఘటన జరిగింది ఎక్కడో! ఏమిటో! తెలియదు కానీ ఒక అమ్మాయి తన ఫ్రెండ్ తో కలిసి ఫస్ట్ శాలరీ తీసుకోవటానికి ఏటీఎం కి వస్తుంది. ట్రాన్సాక్షన్ జరుగుతుండగా ఇంకొద్ది సెకండ్లలో శాలరీ తన చేతికి వస్తుందని తెలిసి తనని తాను కంట్రోల్ చేసుకోలేక పోయింది. అంతే! అక్కడే డాన్స్ చేయటం మొదలు పెట్టేసింది. డబ్బులు చేతిలో పడగానే చివర్లో ఏటీఎంకు థ్యాంక్స్ చెబుతూ దండం కూడా పెట్టేసింది.
ఇది గమనించిన తన ఫ్రెండ్ సైడ్ అయి పోతుంది. వెంటనే మొబైల్ లో కెమెరా ఆన్ చేసి ఇదంతా షూట్ చేస్తుంది. అంతేకాదు, అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ సన్నివేశం మొత్తం రికార్డ్ అయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.