కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్ర మాసం. అందుకే ఈ మాసంలో కనిపించే ప్రతి దేవునికీ మొక్కుతారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఏం జరిగినా అది దైవ లీలగా భావిస్తుంటారు. అంతలా మనసంతా దైవాన్ని నింపుకొని ఉంటారు.
అలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కొన్ని వింతలు కూడా చోటుచేసుకొంటూ ఉంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. దాని గురించి ఊరంతా చెప్పుకొంటూ ఉండటమే కాక, ఆ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా పరిగెత్తుతున్నారు. దీంతో ఈ టాపిక్ కాస్తా ఆ నోటా… ఈ నోటా… పడి మీడియా దృష్టికి వెళ్ళింది. అంతే ఇంకేముంది దానిని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టారు. అదికాస్తా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం కడియపులంక చింతలో ఓ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉంది. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావటంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
భక్తులంతా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో విగ్రహంలోనుంచీ అమ్మవారు కళ్లు తెరిచినట్లు ఉండటం చూసి అంతా షాక్ అయ్యారు. ఈ విషయం బయటికి తెలియటంతో ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. కార్తీక మాసంలో జరిగిన అద్భుతమని అంతా అనుకున్నారు. ఇదంతా అమ్మవారి మహిమేనని… ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసిన తమ జన్మ ధన్యమని భావించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.