యుద్ధం అనేక ప్రతికూల పరిస్థితులని కల్పిస్తుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్రమం తప్పకుండా డ్యూటీ నిర్వహించే వారే డాక్టర్లు. యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నా… డాక్టర్లు మాత్రం ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు. ఇపుడు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్ లో ఉక్రెయిన్ డాక్టర్లు చేసిన సాహసం గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే! ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరమంతా రష్యన్ క్షిపణులు ఆక్రమించేసాయి. దీంతో ఈ నగర వ్యాప్తంగా విద్యుత్ స్తంభించిపోయింది. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రజలపై ఎక్కువగా పడుతుంది. దీంతో వారు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కి చెందిన ఓ చిన్నారికి ఎమెర్జెన్సీగా గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కీవ్‌లోని ఓ హాస్పిటల్ లో ఆ చిన్నారికి గుండెలోని రెండు కవాటాలను మార్చే ‘కార్డియోపల్మోనరీ బైపాస్’ సర్జరీ కోసం ఏర్పాటు చేశారు. అందుకోసం ఆపరేషన్ టేబుల్‌పై చిన్నారిని పడుకోబెట్టారు. సర్జరీ చేస్తుండగా మధ్యలో కరెంటు పోయింది. దీంతో వైద్యులకి ఏం చేయాలో తోచలేదు.
వెంటనే అక్కడే ఉన్న వైద్య సహాయకులు ఎమర్జెన్సీ లైట్‌ను ఏర్పాటు చేశారు. డాక్టర్లు ఆ వెలుతురులోనే ఎంతో శ్రమించి ఆ బాలికకి శస్త్రచికిత్స చేశారు.. గుండె రెండు కవాటాలను మార్పిడి చేశారు. ఇదంతా అక్కడున్న ఓ డాక్టరే స్వయంగా వీడియో తీశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆ డాక్టర్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Today, during the missile attack by the russians on Ukraine, electricity was cut off at the Heart Institute in Kyiv. At this time, surgeons were performing emergency heart surgery on the child. pic.twitter.com/GqhxpXpYVC
— Iryna Voichuk (@IrynaVoichuk) November 23, 2022