ఈ సృష్టిలో ప్రతి జీవి మనుగడ కోసం పోరాడాల్సిందే! అది ప్రకృతి ధర్మం. అయితే కొన్నిసార్లు ఈ పోరాటం అనేది చాలా క్రూరంగా ఉంటుంది. సాదారణంగా బలహీనులు బలవంతుల చేతిలో బలవుతారు. కానీ, అలాంటి బలవంతులు కూడా ఏదో ఒక రోజు బలహీనులుగా మారక తప్పదు. వయసులో ఉన్నప్పుడు నాకంటే తోపెవ్వరు లేరు అనే అహంకారంతో విర్రవీగిన వారంతా… వయసు మళ్ళాక తల వంచక తప్పదు.
ఇక అడవికి రారాజుగా సింహాన్ని చెప్పుకుంటాం. సింహం వేట మొదలుపెట్టిందంటే… ఎలాంటి జంతువైనా దానికి బలవ్వాల్సిందే! కానీ, ఈ సింహం అలా కాదు, ఒక బర్రెల మంద చేతిలో పడి… చిత్తు చిత్తయింది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే, సౌత్ ఆఫ్రికాలోని అడవిలో ఓ ముసలి సింహం సేదతీరుతోంది. ఇంతలో ఓ బర్రెల గుంపు అక్కడికి వచ్చింది. చుట్టూ రౌండప్ చేసి సింహాన్ని భయపెట్టటం మొదలుపెట్టసాగాయి. అయినా ఆ సింహం ఏమీ స్పందించలేదు. కారణం వయసు పైబడటంతో సత్తువ లేదు.
దీంతో ఆ బర్రెలు సింహంపై దాడికి దిగాయి. కొమ్ములతో సింహాన్ని ఎత్తెత్తి పడేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సింహాన్ని ఫుట్ బాల్ ఆడుకున్నాయి. అయితే, ఆ సింహం ఒకానొక సమయంలో ఎదురు దాడికి ప్రయత్నించబోయింది కానీ దాని శక్తి చాలలేదు. చేసేదేమి లేక పక్కనే ఉన్న పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అదే సింహం వయసులో ఉండి ఉంటే బర్రెల గుంపుని బ్యాటింగ్, బౌలింగ్ ఆడుకొని ఉండేది. కానీ, వయసు మళ్ళి ఉండటంతో అది వాటికి ఫుట్ బాల్ గా మారింది. ఏదేమైనా పవర్ కి డెఫినిషన్ గా ఉండే మృగరాజు ఇలా ఢీలా పడి ఉండటం చూస్తే కడుపు తరుక్కు పోతుంది.
మొత్తం మీద ఆ సింహం అప్పటికి సేవ్ అయింది కానీ, దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులకే అనారోగ్యంతో మరణించింది. ఇదంతా ఫారెస్ట్ సఫారీకి వచ్చిన ప్రముఖ ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
View this post on Instagram