రిలేషన్ షిప్ బాగుండాలంటే పార్టనర్స్ మద్య ఉండాల్సింది అండర్ స్టాండింగ్. ఒక్కోసారి ఎంత మీరు ఎంత పర్ఫెక్ట్ పార్టనర్ అయినప్పటికీ సరైన అవేర్నెస్ లేకపోతే రిలేషన్ షిప్ బ్రేకప్ అయిపోతుంది. ఒక్కోసారి మీ పార్టనర్ మీతో మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజమా..! కాదా..! అనే డౌట్ మీకు రావచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో నిజమెంతో ఎలా గెస్ చేయచ్చో ఈ క్రింది అంశాలని ఫాలో అయితే అర్ధమవుతుంది. అవేంటో మీరూ తెలుసుకోండి.
బాడీ లాంగ్వేజ్ :
మీ పార్టనర్ ని మీరు బాగా అర్ధం చేసుకోవాలంటే, వారిలో మీరు స్టడీ చేయవలసింది వారి యొక్క బాడీ లాంగ్వేజ్. ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్‌ని బాగా అర్థం చేసుకున్నారంటే… వాళ్ళ పర్సనాలిటీ ఏంటో కూడా ఖచ్చితంగా అర్థమైపోతుంది. వాళ్ళు ఏ క్షణానికి ఎలా ఆలోచిస్తున్నారు? ఏ విషయాలకి ఎలా రియాక్ట్ అవుతున్నారు? వంటి విషయాలని గ్రహించగలిగితే వారి బాడీ లాంగ్వేజ్ ఏంటో మీకు పూర్తిగా అర్ధమైనట్లే!
ఎనర్జీ :
మీ పార్టనర్ యొక్క ఎనర్జీని బట్టి కూడా మీరు వాళ్ళని అంచనా వేయొచ్చు. మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారా..? లేదా..? మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా..? లేదా..? మీతో ఉన్నంతసేపూ వాళ్ళు ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారా..? లేకా బోర్ ఫీఅలవుతున్నారా..? ఇలాంటి విషయాలని బట్టి మీరు వారి ఎనర్జీని గ్రహించవచ్చు.
బ్రీతింగ్ :
మీ పార్టనర్ బ్రీతింగ్ ని బట్టి కూడా మీరు వాళ్ళని నమ్మచ్చో… లేదో… ఈజీగా తెలుసుకోవచ్చు. వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే ఒక రకంగాను, కాన్ఫిడెంట్‌గా ఉంటే వేరొక రకంగాను, కంగారు పడుతూ ఉంటే మరొక రకంగాను ఉంటారు. ఇలా బ్రీతింగ్ ని బట్టి వారి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో గ్రహించవచ్చు.
కళ్ళు :
అవతలి వ్యక్తి చెప్పేది నిజమో… కాదో… వాళ్ళ కళ్ళని బట్టి తెలుసుకోవచ్చు. ఎందకంటే నోరు అబద్ధమాడినా కళ్ళు నిజమే చెప్తాయి. అందుకే, ఎదుటి వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తే… వాళ్ళు చెప్పే మాటలో నిజమెంతో మీకే తెలుస్తుంది.
టోన్ :
అవతలి వ్యక్తి టోన్ బేస్ ని బట్టి కూడా వాళ్ల యొక్క ఎమోషన్స్‌ని మనం క్యాచ్ చేయవచ్చు. మీ పార్టనర్ మీతో మాట్లాడేటప్పుడు టోన్ రైజ్ చేసి మాట్లాడితే… మీమీద కోపంగా ఉన్నట్లు, అదే దిక్కులు చూస్తూ మాట్లాడితే మీమీద నమ్మకం లేకపోవటమో… లేక అబద్ధమాడటమో… చేస్తున్నారని అర్ధం. అలాకాక, నేలని చూస్తూ మాట్లాడితే మీమీద ప్రేమతో ఉన్నారని అర్ధం.
పై లక్షణాలన్నీ బేస్ చేసుకొని మీ పార్టనర్ మీతో ఎలా బెహేవ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.