తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మాట మనుషులకే కాదు, సృష్టిలో ప్రతి జీవికీ వర్తిస్తుంది. లక్ష్యంపై ఏకాగ్రత పెట్టాలే కానీ, ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు.
అయితే, ఇప్పటివరకూ సోషల్ మీడియాలో జంతువులకి సంబంధించి ఎన్నో క్యూట్ వీడియోస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి కోవకే చెందింది ఈ వీడియో కూడా.
తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని రెండు కుక్కపిల్లలు నిరూపించాయి. ఈ కుక్కపిల్లలు మనలో ప్రతి ఒక్కరికీ జీవిత సత్యాన్ని నేర్పించాయి. అందుకే, ఈ కుక్కపిల్లలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఓ ఇంటి పెరట్లో రెండు పెంపుడు కుక్కపిల్లలు ఆడుకుంటున్నాయి. అనుకోకుండా వాటికి ఒక ఐడియా వచ్చింది. అవి ఆడుకుంటున్న ప్లేస్ లో ఒక చెట్టుకొమ్మ అంచున ఓ పువ్వు కనిపించింది. దానిని ఎలాగైనా అందుకోవాలన్నదే వాటి ఎయిమ్.
ఇక ఆ పప్పీస్ రెండూ కలిసి ఒక గేమ్ మొదలుపెట్టాయి. ఒకదాని తర్వాత ఒకటి జంపింగ్‌ల మీద జంపింగ్‌లు చేయటం మొదలుపెట్టాయి. ఒక పక్క పువ్వు అందటం కష్టంగా ఉంది. మరోపక్క ఎగిరీ ఎగిరీ ఆయాసం వస్తుంది. అయినా సరే, పట్టు విడవలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ పువ్వు చేతికి చిక్కే వరకూ అలా ఎగురుతూనే ఉన్నాయి.
చివరికి ఒక పప్పీ ఆ పువ్వుని చేజిక్కించుకుంది. దీంతో వాటి మద్య గేమ్ కూడా పూర్తయింది. మనిషైనా… జంతువైనా… ఎన్ని అడ్డంకులు ఎదురైనా… టార్గెట్ ని రీచ్ అవ్వడం అంటే… ఇది! So,“Life is a game; Play it; Win it.”
Keep going. Tough situations build strong people in the end. pic.twitter.com/2duAeEcdYW
— Susanta Nanda IFS (@susantananda3) October 21, 2021