బంగారం కొనాలంటే ఎవరైనా ఆచితూచి అడుగేస్తారు. ఎందుకంటే, అది అసలైనదో, నకిలీదో అనే భయం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి. నిజానికి ఈ విషయంలో ఎంత అనుభవం ఉన్నవాళ్ళైనా ఎక్కడో ఒకచోట పప్పులో కాలేస్తారు. ఇక మార్కెట్లో నకిలీ బంగారం విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. ఈ నేపధ్యంలో ఏది అసలైన బంగారమో… ఏది నకిలీ బంగారమో… తెలుసుకోవటం కష్టం. అందుకే, నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి నకిలీ బంగారాన్ని ఇట్టే పట్టేయెచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
- బంగారం నిజమైనదో… కాదో… తెలియాలంటే, దానిపై ఉన్న హాల్‌మార్క్ గుర్తు చూడాలి. బంగారం కొనేటప్పుడు తప్పకుండా ఈ హాల్‌మార్క్ గుర్తుని పరిశీలించండి. నిజమైన బంగారానికి హాల్‌మార్క్ గుర్తు ఖచ్చితంగా ఉండి తీరుతుంది.
- నిజమైన హాల్‌మార్క్ గుర్తు అనేది ట్రయాంగిల్ షేప్ లోగో తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని రాసి ఉంటుంది. దీనితోపాటు గోల్డ్ ప్యూరిటీ గురించి కూడా రాసి ఉంటుంది.
- నకిలీ బంగారాన్ని గుర్తించాలంటే… ఏదైనా ఒక బంగారు ఆభరణాన్ని తీసుకొని… దానిపై కొన్ని చుక్కల వెనిగర్ వేసి చూసినప్పుడు రంగు మారకపోతే, అది నిజమైన బంగారం.
- బంగారు ఆభరణాన్ని తీసుకొని… దాన్ని పిన్‌తో స్క్రాచ్ చేసి… అలా స్క్రాచ్ చేసిన దానిపై ఒక్క చుక్క నైట్రిక్ యాసిడ్ వేయండి. మంచి బంగారమైతే… రంగు మారదు. నకిలీ బంగారమైతే… ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
- జ్యూయలరీని ధరించినప్పుడు మన ఒంటిపై ఉన్న చెమట తగిలి… ఆ జ్యూయలరీ నాణెం వంటి వాసన వస్తే, అది నకిలీ బంగారం. నిజమైన బంగారానికి ఎలాంటి వాసన రాదు.
- నీటిలో బంగారాన్ని వేస్తే… అది పూర్తిగా మునిగి పోయినట్లయితే, నిజమైన బంగారం, అలా కాక తెలినట్లితే, అది నకిలీ బంగారం.
- బంగారు ఆభరణాలపై అయస్కాంతం ఉంచినప్పుడు ఆ అయస్కాంతానికి ఆభరణం అంటుకుంటే… అది నిజమైనది.
- గోల్డ్ కొనేటప్పుడు ఎప్పుడూ నమ్మదగ్గ జ్యూయలరీ షాపుల్లోనో… లేదా బ్రాండెడ్ జ్యూయలరీ షాపుల్లోనో… కొనండి. వారైతే, ఖచ్చితంగా మీరు కొన్న ఐటెమ్ కి సంబందించిన డీటెయిల్స్ తో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు.
- అలాగే, గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు బిల్లు తీసుకోవటం మర్చిపోకండి. ఆ బిల్లులో మీరు కొన్న గోల్డ్ కి సంబంధించిన అన్ని వివరాలు ఎంటర్ చేయమని షాప్ ఓనర్ ని రిక్వెస్ట్ చేయండి.
ఏదేమైనా గోల్డ్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనండి. అంతేకానీ, షాప్ యజమాని చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకండి. కొనటం పూర్తయ్యాక ఖచ్చితమైన ఎవిడెన్స్ వారి వద్ద నుండీ తీసుకోండి.