ఇటీవలి కాలంలో అకౌంట్ నుంచి మనీ విత్ డ్రా చేయాలంటే… బ్యాంకుకే వెళ్ళక్కర్లేదు, ATM కి వెళితే చాలు. ATM లో అయితే క్షణాలమీద డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇంతవరకూ ఓకే. కానీ, ఒక్కోసారి అనుకోకుండా ATM నుంచీ చిరిగిన నోట్లు, లేదా చెల్లని నోట్లు వస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
సాదారణంగా బ్యాంకుల్లో అయితే మనీ విత్ డ్రా చేసేటప్పుడు ఇలా జరిగితే, వెంటనే మార్చుకొనే అవకాశం ఉంటుంది. మరి ఏటీఎంలో అలా కుదరదు. ఎందుకంటే, అక్కడ ఎవ్వరూ ఉండరు కాబట్టి. అలాంటి సమయంలోనే చాలామంది టెన్షన్ పడుతుంటారు. వచ్చిన డబ్బుని ఏం చేయాలి? ఎవరూ కూడా తీసుకోరు. మరి ఆ నోట్లని మార్చేదెలా? అని తెగ కంగారు పడిపోతారు.
కానీ, ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. RBI మార్గదర్శకాల ప్రకారం పాత నోట్లు, లేదా చిరిగిన నోట్లు ఏవైనా ఉంటే… వాటిని మార్పిడి చేసుకొని… వాటి స్థానంలో కొత్త నోట్లని రీప్లేస్ చేసుకోవచ్చు.
కరెన్సీ ఎక్సేంజ్ విషయంలో… 2017 ఏప్రిల్‌లో… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ పాస్ చేసింది. దీని ప్రకారం, ఏటీఎంల నుంచి పాడైపోయిన, లేదా చిరిగిపోయిన నోట్లు వచ్చినట్లయితే… కంగారు పడాల్సిన పనేమీ లేదు. వెంటనే ఆ ATM ఏ బ్యాంకుకి సంబందించిందో తెలుసుకొని… ఆ బ్యాంక్ మేనేజర్ ని అప్రోజ్ అయి… రాతపూర్వకంగా అప్లై చేస్తే చాలు. దీనితోపాటు, ATM విత్ డ్రా స్లిప్ కూడా పిన్ చేయాలి. ఒకవేళ స్లిప్ లేకపోతే, మీ మొబైల్ కి వచ్చిన SMS ని సెండ్ చేయాలి.
మీ అప్లికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్యాంక్ మీకు చెల్లని నోటు స్థానంలో వేరే కరెన్సీని ఇష్యూ చేస్తుంది. ఈ ఫార్మాలిటీ అంతా కొద్ది సేపట్లోనే పూర్తి అవుతుంది.