మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. కొంతమందిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక్కోసారి కొంతమందిని చూస్తే… ఎక్కడో చూశామన్న భావం కలుగుతుంది. ఎప్పుడో పరిచయమున్నట్లు అనిపిస్తుంది. నిజానికి వాళ్ళని ఇప్పుడే మొదటిసారి చూసినప్పటికీ, ఎంతోకాలంగా పరిచయం ఉన్నవాళ్ళలా అనిపిస్తుంది.
ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులని అనేక చోట్ల మనం చూస్తుంటాం. సెలేబ్రిటీలు, ప్లేయర్స్ వాళ్ళూ, వీళ్ళూ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటుంటారు. అలాంటివారి వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి.
ఇక తాజాగా దివంగత నటి సౌందర్య విషయంలో కూడా అదే జరిగింది. శ్యాండిల్ వుడ్ కి చెందిన సౌందర్య… ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. వచ్చీ రావటంతోనే సక్సెస్ ని వెంటపెట్టుకొని మరీ వచ్చింది. స్టార్ హీరోలందరితో పాటు… చిన్నా, పెద్దా, అనే తేడా లేకుండా దాదాపు అందరితోనూ నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషలలో నటించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో సావిత్రి తర్వాత అంతటి క్రేజ్ ని సొంతం చేసుకుంది.
కానీ ప్రమాద వశాత్తూ… తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. సౌందర్య మరణించి 17 ఏళ్ళు గడుస్తున్నా… ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకొంది. ఇప్పటికీ ఆమెను తలచుకొని రోజంటూ లేదు.
అయితే, తాజాగా సౌందర్య పోలికతో ఉన్న ఒక అమ్మాయి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమె పేరు చిత్ర. మలేషియాలో పుట్టింది. అయితే, చిత్రకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా ఈ అమ్మాయి రివీల్ చేసిన కొన్ని వీడియోలు సౌందర్యని మరిపిస్తున్నాయి.
అనుకోకుండా ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలు చూసి… ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తమ అభిమాన తార మళ్ళీ ఈ భూమిపై పుట్టిందా..! అని ఆశ్చర్యపోయారు. అంతేకాదు, సౌందర్యన్ని గుర్తుకు తెచ్చుకొని కామెంట్లు కూడా పెడుతున్నారు.
View this post on Instagram