జమ్మూ కాశ్మీర్ లో తాజాగా భారీ ఎన్ కౌంటర్ జరుగుతుంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్ కౌంటర్ ఎప్పుడూ చూడలేదు. గత 12 రోజులుగా సాగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో… దాదాపు 3000 మంది సైనికులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఎరివేతే లక్షంగా వీళ్ళు ఈ ఎన్ కౌంటర్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ఏరియాకి సంబంధించిన పూంచ్ సెక్టార్ నుండి ఉగ్రవాదులు ఎప్పుడూ చొరబాట్లకి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే, ఎప్పటికప్పుడు భారత బలగాలు వారిని తిప్పికోడుతూనే ఉన్నాయి. కానీ, ఈసారి భారీ సంఖ్యలో ఈ చొరబాటు అనేది జరిగింది. ఈ నేపధ్యంలోనే ఈసారి వారిని తిప్పికొట్టేందుకు స్పెషల్ బలగాలతో కూడిన ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగాయి. ఈ నేపద్యంలోనే భారీ ఎన్ కౌంటర్ జరుగుతుంది.
ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైందో… అప్పుడే ఉగ్రవాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. దీనికి తోడు పాకిస్థాన్ ఉగ్రవాదులకి శిక్షణనిచ్చి మరీ భారత భూభాగంలోకి పంపుతుంది. ఇప్పుడీ చొరబాట్ల ద్వారా వచ్చిన టెర్రరిస్టులు అంతా ఇలా వచ్చినవారే! అందుకే వారందరినీ ఏరివేయడమే లక్షంగా పెట్టుకోండి భారత్.