కొన్ని ప్రమాదాలు మన ఏమరపాటు వల్ల జరిగితే, ఇంకొన్ని ప్రమాదాలు మనం అస్సలు ఊహించకుండా జరిగిపోతాయి. అయితే, మరికొన్ని ప్రమాదాలు మాత్రం యమలోకం అంచులదాకా తీసుకువెళతాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది.
మార్చి 24 సాయంత్రం కేరళ రాష్ట్రంలో ఓ మిరాకిల్ జరిగింది. కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలో ఉన్న చోరుక్కల అనే ప్రాంతం వద్ద ఓ సైకిల్ ప్రమాదం జరిగింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్పీడ్ గా సైకిల్ తొక్కుకుంటూ ఓ సందులో నుంచి వస్తున్నాడు. అదే స్పీడుతో మెయిన్ రోడ్ క్రాస్ చేసేందుకు ట్రై చేశాడు.
కానీ, అనుకోకుండా తన సైకిల్ బ్యాలన్స్ తప్పి, అటువైపుగా వెళ్తున్న ఓ బైక్ ని ఢీకొట్టటం జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఆ బైక్ వెనుకే ఓ బస్సు కూడా వస్తోంది. అయితే, బైక్ ని గుద్దిన బాలుడు ఎగిరి రోడ్డుకి అవతల పక్కన పడిపోగా… తన సైకిల్ పైకి మాత్రం బస్సు ఎక్కేసింది.
ఆ పిల్లవాడు లక్కీగా సేవయ్యాడు కానీ, లేదంటే ఆ బస్సు చక్రాల కింద తను పడాల్సింది. కాకపోతే, బ్యాడ్ లక్ ఏంటంటే, బస్సు కింద పడ్డ తన సైకిల్ మాత్రం నుజ్జు నుజ్జయింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో… ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. మొత్తం మీద అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చాడు ఆ బాలుడు.
#RoadSafety
Share your thoughts… pic.twitter.com/9m4ctrrwJq— Telangana State Police (@TelanganaCOPs) March 25, 2022