తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుడు తనని వివాహం చేసుకోవడానికి నిరాకరించటంతో… అతనిపై యాసిడ్ దాడి చేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, కేరళ లోని తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ కి షీబా అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకి దారితీసింది. దీంతో కొంతకాలంగా తనిని పెల్లిచేసుకోవాలంటూ అతనిని వేధించసాగింది.
అయితే, అప్పటికే షీబాకి వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గొడవల కారణంగా భర్తతో విడిపోయి… పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. షీబా వివాహిత అని తెలియక అరుణ్ ఆమెతో ప్రేమాయణం సాగించాడు.
ఈ క్రమంలో ఒకరోజు షీబా వివాహిత, మరియు పిల్లలు కూడా ఉన్నారన్న విషయం అరుణ్ కి తెలిసింది. దీంతో అతను తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నాడు. కానీ, షీబా అందుకు అంగీకరించలేదు. ఎలాగైనా తనని వివాహం చేసుకొని తీరాల్సిందే అంటూ పట్టుబట్టింది. అంతేకాదు, తమ రిలేషన్ గురించి నలుగురికి చెప్తానని బెదిరించి… అతని దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయసాగింది.
ఇక నవంబర్ 16న అరుణ్ కుమార్ తన అన్న, మరో స్నేహితుడితో కలిసి… తిరువనంతపురంలోని ఇరుంపుపాలెం వద్ద ఉన్న చర్చికి వెళ్లాడు. ఆ సమయంలో షీబా అడిగిన మొత్తాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య మళ్ళీ మ్యారేజ్ టాపిక్ వచ్చింది. అరుణ్ కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వివాహం చేసుకోవటం కుదరదని తేల్చి చెప్పాడు.
అయితే, అప్పటికే షీబా తనతోపాటూ యాసిడ్ బాటిల్ ని కూడా తెచ్చుకుంది. ఎప్పుడైతే, అరుణ్ తమ రిలేషన్ కంటిన్యూ చేయలేనని తెగేసి చెప్పెశాడో… ఆ వెంటనే ఆమె తన దగ్గరున్న యాసిడ్ ని అతనిపై పోసి… వెంటనే అక్కడ నుంచి పరారయ్యింది.
ఈ యాసిడ్ దాడిలో అరుణ్ తన కంటి చూపును కోల్పోయాడు. అతనితోపాటు చర్చికి వచ్చిన యువకులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పటిల్లో అతనికి చికిత్స జరగుతుంది. అయితే, ఈ దాడిలో షీబాకి కూడా గాయాలయ్యాయి.