ఈ సృష్టిలో భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒకే ఒక వరం నవ్వు. ఇది మరొకరి దగ్గర దొరికేది కాదు. అంత మాత్రాన ఇది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనకి పోయేదేం లేదు, బోలెడంత ఆరోగ్యాన్ని మూటగట్టుకోవటం తప్ప.
ఆర్ధిక ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువైనప్పుడు జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. బ్రతుకుబండి లాగటం కష్టమై పోతుంది. ఇలాంటి సందర్భంలో చూద్దామన్నా ముఖంపై చిరునవ్వు రాదు.
మరి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ మూడూ ఒకేసారి రావాలంటే… ఏం చేయాలి? ఇలాంటి సందర్భం ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఏదో ఒకరోజు వచ్చే ఉంటుంది. వీటన్నిటికీ లాఫింగ్ బుద్దా చెక్ పెట్టేస్తాడు.
ఫెంగ్ షుయ్ పేరు చెప్పగానే ముందుగా మనకి గుర్తొచ్చేది లాఫింగ్ బుద్దా. ఈ మధ్య కాలంలో చాలామంది తమ ఇళ్ళలోనూ, షాపుల్లోనూ, మరియు కొన్ని రకాల ప్రాంతాలల్లోనూ లాఫింగ్ బుద్దా స్టాట్యూని పెడుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా వచ్చే రక రకాల సమస్యల నుంచి దూరం కావటానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు.
లాఫింగ్ బుద్ధాని కేవలం 10 సెకన్లపాటు ధీర్ఘంగా చూస్తే చాలు… మన పెదాలపై నవ్వుల వర్షం కురవాలిసిందే! మనం పుట్టెడు దుఃఖంలో ఉన్నా… భరించలేనంత బాధలో ఉన్నా… సరే అదే పనిగా కొంతసేపు ఈ లాఫింగ్ బుద్ధాను చూస్తే టకీమని నవ్వేస్తారు.
ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు మీ సొంతం చేసుకోవచ్చు. అప్పులు తగ్గి రాబడి పెరుగుతుంది. ధనం విలువ కూడా పెరుగుతుంది. ఎంతో ఉల్లాసంగా కూడా గడుపుతారు.
వ్యాపార సంస్థల్లో ఈ విగ్రహాన్ని ప్రధాన ద్వారం వద్ద పెట్టుకుంటే… రాబడి పెరిగి వ్యాపారం భాగా అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మీరు నష్ట పోయే పని కూడా ఉండదు.
ఆర్ధిక సమస్యలతో బాద పడేవారు ఎవరైనా సరే ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే… వారి ఆర్ధిక సమస్యలు తొలగి… పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక వారికి సంపదకి ఎలాంటి లోటు ఉండదు.
మీరు బయటకు వెళ్లి… ఇంటి లోపలకి రాగానే ముందుగా ఈ విగ్రహమే కనపడేలా చూసుకోండి. దీని వల్ల వెంటనే మీ పెదవులల్లో చిరు నవ్వు దర్శనమిస్తుంది. ఎదుటి వారి నీచ దృష్టి తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగని ఈ లాఫింగ్ బుద్ధాని ఇంటి ప్రదాన ద్వారానికి ఎదురుగా మాత్రం అస్సలు పెట్టవద్దు. ఇలా చేయటం వల్ల మీరి ఆర్ధికంగా నష్ట పోతారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే లాఫింగ్ బుద్దాను అందరూ తమ ఇళ్ళల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఉంచినట్లయితే… ప్రతి ఒక్కరు ఆనందంతోనూ, ఆరోగ్యంతోనూ, ఐశ్వర్యంతోనూ జీవించవచ్చు.