రోడ్డుపై వెళుతున్నప్పుడు సడెన్ గా కుక్క ఎదురొస్తేనే భయపడిపోతాం. అలాంటిది పులి ఎదురొస్తే… ఇంకేమన్నా ఉందా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోదూ! కానీ, ఇప్పుడు మనం అలాంటి సంఘటనే ఒకటి చెప్పుకుందాం.
అసోంలోని కంజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఓ ఘాట్ రోడ్డు ఉంది. రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలతో అడవిని తలపించేలా ఆ రూట్ ఉంటుంది. ఇక ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కామనే!
అయితే, ఓ సైక్లిస్ట్ అటువైపుగా వెళ్తున్నాడు. అతని పక్కనుండే ఓ కారుకూడా వెళ్తుంది. ఇంతలో పొదలచాటు నుంచి ఓ చిరుతపులి దూసుకొచ్చి… అతనిపై దాడి చేయబోయింది. ఎగిరి అతని నడుం పట్టుకోబోయింది. ఐతే పట్టు తప్పడంతో… చిరుత జారి రోడ్డుపై పడిపోయింది. వెంటనే పొదల్లోకి పారిపోయింది. దాని దెబ్బకి ఆ సైక్లిస్ట్ కూడా బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయాడు.
పులి పంజా నుండీ తప్పించుకొని కిందపడిన సైక్లిస్టుకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వెంటనే లేచి, సైకిల్ తీసుకొని ముందుకు వెళ్లకుండా… గబా గబా వెనక్కి వెళ్లిపోయాడు. ఈ సంఘటన అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో పాతదే అయినప్పటికీ, ఇప్పుడు వైరల్ అవుతుంది.