అసలే ఇరుకైన రోడ్డు… చుట్టూ చెట్లు… బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. ఇంతలో ఒక సింహం పొదల్లో నుంచి బయటకి వచ్చి వాళ్ళ బైక్ ఎదురుగా నిలబడింది. అంతే! ఆ వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అయింది. ఏం చేయాలో అర్ధకాలేదు.
గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఇద్దరు బైకర్స్ కి రియల్ గా జరిగిన ఎక్స్ పీరియన్స్ ఇది. వేలేజ్ లో ట్రావెలింగ్ అంటే… ఎవరికైనా ఇష్టమే! కానీ, ఫారెస్ట్ మద్యలో నుంచీ వెళ్ళాలంటేనే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది.
ఇక ఆ ఫారెస్ట్ లో కూడా ఇరుకైన దారిలో ఒంటరిగా వెళ్ళాలంటే… ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిందే!
అసలే రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో పక్కనున్న పొదల్లో నుంచీ ఎప్పుడే క్రూర మృగం బయటకి వస్తుందో తెలియదు. అందుకే, చాలా స్లోగా బైక్ నడుపుతూ… భయం భయంగా వెళ్తున్నారు.
ఇంతలోనే సడెన్ గా చెట్ల పొదల్లో నుంచి ఒక లయన్ బయటకి వచ్చింది. అది కాస్తా వీళ్ళ బైక్ వైపుకి నడుచుకుంటూ వస్తుంది. సింహం సమీపించే కొద్దీ గుండె వేగం పెరిగి పోతుంది. ఏం చేయాలో అర్ధం కావట్లేదు, ఏం జరగబోతుందో తెలియట్లేదు. ఇద్దరూ షాక్ లో ఉన్నారు.
కానీ, అది వారిపై అటాక్ చేయలేదు. అంతేకాక, వీళ్లని చూసి చూడనట్టుగా రోడ్డు దాటి… పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో బతుకుజీవుడా! అంటూ వాళ్ళిద్దరూ ముందుకి సాగారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.