ఇప్పటివరకూ క్రూరమృగాలంటే… సింహం, పులి, చిరుత వంటి జంతువులని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాం. ఈ వీడియో చూస్తే ఇకమీదట ఎండ్రకాయని కూడా ఆ జాబితాలో చేర్చక తప్పదేమో అనిపిస్తుంది.
సోషల్ మీడియా పుణ్యామా అని రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అదే కోవలోకి చెందింది ఈ వీడియో కూడా. ముఖ్యంగా చేపలని మనుషులే కాదు, ఎన్నో రకాల జీవులు కూడా తమ ఆహారంగా చేసుకుంటాయి. అందులో భాగంగానే లోబ్ స్టర్ తన ఆహారం కోసం ఒక చేపని వేటాడింది. సాదారణంగా ఇవి చేపలని వేటాడటం కామనే! కానీ, ఈ పీత వేటాడిన విధానం అత్యంత క్రూరంగా, పాశవికంగా ఉంది.
లోబ్ స్టర్ తన రెండు కొండెలతో చేపని బంధించి… దాని కనుగుడ్డుని క్రూరంగా పెకిలించి… మరీ తినేసింది. అయితే, ఇక్కడ అంత పెద్ద చేపని ఈ ఎండ్రకాయ తినలేదు కాబట్టి ప్రస్తుతానికి దాని కళ్లని ఆహారంగా తీసుకొని తన ఆకలి తీర్చుకుందామని ఆలోచించిందేమో..! అందుకే కేవలం ఈ లోబ్ స్టర్… ఫిష్ కళ్ళని మాత్రమే టార్గెట్ చేసింది. ఏదేమైనా ఈ వీడియో చూసిన నెటిజన్లకి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
View this post on Instagram