Mahabharata Powerful Weapons, Ancient Indian Warfare

Mahabharata’s Magical Weapons

ధర్మానికీ, అధర్మానికీ మద్య జరిగిన సంగ్రామమే మహాభారత యుద్ధం. ఈ యుద్ధంలో మొత్తం 47,23,920 మంది పాల్గొన్నారు. కానీ, యుద్ధం ముగిసేసరికి కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. ఇంత భారీ నష్టం జరగటానికి కారణం ఈ యుద్ధంలో పవర్ ఫుల్ వెపన్స్ ప్రయోగించడమే! మహాభారత యుద్ధం మామూలు యుద్ధం కాదు, ‘న్యూక్లియర్ వార్’ అని చాలామంది హిస్టారియన్స్ చెపుతుంటారు. అంతేకాదు, మహాభారత యుద్ధంలో ఉపయోగించిన వెపన్స్ అన్నీ మిస్సైల్సే! అని కూడా అంటుంటారు. 18 రోజుల్లో 47 లక్షలకి పైగా జనాభా మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది మామూలు వెపన్స్ తో సాధ్యమయ్యేది కాదు. ఈ యుద్ద సమయంలో, పవర్ ఫుల్ సెలెస్టియల్ వెపన్స్  ఉపయోగించబడ్డాయి. వాటికి అపారమైన శక్తి ఉంది. అవసరమైతే అవి ఖండాలను, గ్రహాలను కూడా నాశనం చేయగలవు. మరి అలాంటి వాటిలో 10 మోస్ట్ పవర్ ఫుల్ వెపన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం.

వాసవి శక్తి (ఇంద్రుని ఆయుధం)

వాసవి శక్తి ఇంద్రునికి చెందిన ఆయుధం. దీనిని భారతంలో ఇంద్రుడు కర్ణుడికి గిఫ్ట్ గా ఇస్తాడు. ఇది మోస్ట్ పవర్ ఫుల్ వెపన్. హై ఇంటెన్సిటీతో ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేసే ఒక దైవిక ఈటె ఇది. అంటే… ఉరుములతో దాడి చేస్తుంది. దీనిని ఒక్కసారి ప్రయోగిస్తే… టార్గెట్ ఫినిష్ చేసేదాకా ఆగదు. కానీ, ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఉపయోగించిన తర్వాత, ఖచ్చితంగా అది శత్రువుని చంపి తీరుతుంది. 

వాసవి శక్తి అసలు పేరు శక్తి అస్త్రం మాత్రమే! కానీ, వాసవి ఇచ్చిన శక్తి కాబట్టి దీనిని వాసవి శక్తి అని పిలుస్తారు. ఈ అస్త్రాన్ని కర్ణుడు అర్జనుడిని సంహరించటం కోసం ఉంచుతాడు. కానీ, శ్రీకృష్ణుడి యుక్తితో ఈ అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించేలా చేస్తాడు.

మహాభారత యుద్ధంలో కర్ణుడికి, అర్జనుడికి మద్య పోరు మొదలైంది. ఆ సమయంలో, దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి… తన కవచ కుండలాలని ఇవ్వవలసిందిగా కోరతాడు. వెంటనే కర్ణుడు తనని దానమడిగిన దేవేంద్రుడికి… పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలని తీసి ఇచ్చేస్తాడు. అందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలని భావిస్తాడు ఇంద్రుడు. అప్పుడే తన దగ్గర ఉన్న వాసవి శక్తి అస్త్రాన్ని కర్ణుడికి బహుమతిగా ఇస్తాడు.  ఈ అస్త్రానికి దేవుళ్లని సైతం చంపే శక్తి ఉంది. ఇది ఒక దైవిక ఆయుధం. 

ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నవారికి సృష్టిలో తిరుగుండదు. అలాంటి ఆయుధాన్ని కలిగి ఉండటానికి కర్ణుడు ఒక్కడే అర్హుడని భావించి ఇంద్రుడు దానిని కర్ణుడికి ఇస్తాడు. అయితే, అర్జునుడిని చంపగల ఏకైక శక్తివంతమైన అస్త్రం ఇదేనని భావించి, అతని కోసం దాచిపెడతాడు కర్ణుడు. కానీ, దుర్యోధనుడు పట్టుబట్టడంతో,  భీముడి కుమారుడైన ఘటోత్కచుడు కౌరవ సైన్యం మొత్తాన్ని ఒంటరిగా తుడిచిపెట్టేస్తాడు.  దీంతో కర్ణుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాసవి శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుని మీద ప్రయోగించాల్సి వస్తుంది. 

వజ్రాయుధం (ఇంద్రుడి వ్యక్తిగత ఆయుధం)

వజ్రాయుధం ఇంద్రుని యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీనిని మహాభారత యుద్ధ సమయంలో ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడికి ఇచ్చాడు. ఇది దధిచి అనే మహర్షి వెన్నెముక నుండి తయారు చేయబడింది. వజ్ర అంటే సంస్కృతంలో “డివైన్ లైటింగ్” అని అర్ధం. 

ఈ వెపన్ గాలినుండీ లైటింగ్ ని ప్రొడ్యూస్ చేస్తూ… మెరుపులతో దాడి చేస్తుంది. ఒక్కసారి దీనిని టార్గెట్ చేసి వదిలితే… ఆకాశం నుండి మెరుపుల వర్షం కురిపిస్తుంది. వజ్రాస్త్రాన్ని యుద్ధభూమిలో అత్యంత భయంకరమైన ఆయుధాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది శత్రువులకి ప్రాణనష్టం ఎక్కువగా కలిగిస్తుంది. మరియు శత్రు సైన్యాన్ని చెదరగొడుతుంది. 

మహాభారతంలో ఈ మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ని వృత్రాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఉపయోగించారు. వృత్రాసురుడు మహాశక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతలపై కోపంతో, తపస్సు చేశాడు. లోహంతో తయారుచేయని ఆయుధం తప్ప… మరే ఇతర దానితో చావు రాకూడదని వరం పొందాడు. వర గర్వంతో దేవలోకం మీదకి దండెత్తి, ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలందరినీ హింసించాడు. ఏమీచేయలేని పరిస్థితుల్లో ఇంద్రునితో సహా దేవతలంతా  విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. అప్పుడు శ్రీహరి అత్యంత బలమైన వెన్నుముకతో ఓ పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు. అయితే, దానికి బలంతోపాటు, తపశ్శక్తి కూడా కలబోసి ఉండాలని చెప్పాడు. 

అందుకోసం భృగుమహర్షి కుమారుడు, మహా తపస్సంపన్నుడైన దధీచిని ఎంచుకొంటారు. వెంటనే,  దేవేంద్రుడు దధీచి మహర్షి ఆశ్రమానికి చేరుకొని విషయం చెప్పగా… ఆ మహర్షి తన వెన్నెముక ఇవ్వడానికి అంగీకరించి… యోగశక్తితో ప్రాణత్యాగం చేస్తాడు. అలా తయారైందే ఈ వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుని వధిస్తాడు దేవేంద్రుడు. అప్పటినుండీ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.

నారాయణాస్త్రం (విష్ణువు యొక్క వ్యక్తిగత ఆయుధం)

నారాయణాస్త్రం సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి యొక్క ఆయుధం. మహాభారతంలో దీనిని ప్రయోగించడం కేవలం కృష్ణుడు, ద్రోణుడు, మరియు అశ్వత్థామకి మాత్రమే తెలుసు. విష్ణువు స్వయంగా ఈ ఆయుధాన్ని ద్రోణుడికిచ్చి ఆశీర్వదించారు. ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామకు ఈ అస్త్రాన్ని ప్రేమతో సమర్పిస్తాడు. 

చూడటానికి ఇది ఒక సర్క్యులర్ డిస్క్ రూపంలో ఉంటుంది. కానీ, లక్షలాది మిసైల్స్ ని ఒకేసారి ప్రయోగించినంత తీవ్రత ఉంటుంది. ఈ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, బాణాల జల్లులు కురిపిస్తుంది. దీనినుండీ తప్పించుకోవడానికి గల ఏకైక మార్గం ఏంటంటే… దీనిని ప్రతిఘటించకుండా ఉండటమే! 

దీనిని ఎవరైనా తమ జీవితకాలం మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అలాకాక  ఎక్కువసార్లు ఉపయోగించడానికి ప్రయత్నిస్తే, ఎవరైతే దానిని ప్రయోగిస్తారో… వారినే టార్గెట్ చేస్తుంది. అందుకే, హిందూ పురాణాలలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ వెపన్స్ లో ఇది ఒకటి. 

మహాభారత యుద్ధంలో పాండవుల చేతిలో ద్రోణుడు మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన పాండవులపై కక్ష్య కడతాడు అశ్వత్థామ. అందుకే వారిపై నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే అప్రమత్తమైన శ్రీకృష్ణుడు, పాండవులు, మరియు ఇతర యోధులని తమ తమ ఆయుధాలని వదిలేసి, నేలపై పడుకోమని చెప్తారు. ఇది విష్ణుమూర్తి యొక్క దివ్యాస్త్రం; కాబట్టి ఆ అస్త్రానికి పూర్తిగా లొంగిపోక తప్పదని సలహా ఇస్తాడు. మిగిలిన వీరులంతా ఒప్పుకున్నప్పటికీ, పాండవ వీరుడు భీముడు మాత్రం అది పిరికి చర్యగా భావించి… లొంగిపోవడానికి నిరాకరించాడు. అంతేకాక దానిపై ఎదురుదాడికి దిగుతాడు. దీంతో, ఆ అస్త్రం భీముడిని టార్గెట్ చేస్తుంది. చివరికి అతని  సోదరులు, మరియు కృష్ణుడు అడ్డుకోవడంతో భీముడు చంపబడలేదు. 

ఇది కూడా చదవండి: అర్జునుడు VS కర్ణుడు: ఎవరు గొప్ప?

బ్రహ్మాస్త్రం (బ్రహ్మ సృష్టించిన ఆయుధం)

బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించాడు. ఈ అస్త్రాన్ని ప్రయోగిచే జ్ఞానం అందరికీ ఉండదు. భారతంలో కేవలం పరశురాముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు మొదలైనవారు మాత్రమే ఈ ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. 

బ్రహ్మాస్త్రం ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ శక్తితో తయారైంది. అందుకే దీనికి నాశనం లేదు, వినాశనం తప్ప. బ్రహ్మస్త్రాన్ని 5th జనరేషన్ మిస్సైల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇది న్యూక్లియర్ బాంబుతో సమానమైన శక్తి కలిగి ఉంది. బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, ప్రపంచం మొత్తాన్ని తుడిచి పెట్టేస్తుంది. అయితే, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒద్దనుకుంటే మళ్ళీ వెనక్కి రప్పించేయెచ్చు. కాకపోతే దానిని ఉపసంహరించటం తెలిసి ఉండాలి.

మహాభారతంలో భీష్ముడు, పరుశురాముడితో యుద్ధం చేసే సమయంలో ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అలానే, కురుక్షేత్ర యుద్దంలో కర్ణుడు, అర్జనుడితో యుద్ధం చేసేటప్పుడు దీనిని అర్జనుడిపై ప్రయోగించాలని కర్ణుడు భావిస్తాడు. కానీ, పరుశురాముడి శాపం వల్ల కర్ణుడు ఆ జ్ఞానాన్ని మర్చిపోతాడు. ఇక మహాభారతం చివరిఘట్టంలో, అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ, దానిని ఉపసంహరించడం అతనికి తెలియకపోవటంతో చాలా తీవ్ర నష్టం జరిగింది. మొత్తమీద ఇది మహాభారత ఇతిహాసంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడింది.

బ్రహ్మశీర్షాస్త్రం (బ్రహ్మ సృష్టించిన రహస్య ఆయుధం)

బ్రహ్మశీర్షాస్త్రం బ్రహ్మ సృష్టించిన ఓ రహస్య ఆయుధం. మహాభారత యుగంలో అగ్నివేశ ఋషి, ద్రోణుడు, కర్ణుడు, అర్జునుడు, మరియు అశ్వత్థామ మొదలైనవారు మాత్రమే ఈ ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అయితే, వీరిలో అర్జునుడుకి తప్ప మిగిలిన వారికి ప్రయోగించటమే కానీ, ఉపసంహరించటం తెలీదు. 

బ్రహ్మశీర్షాస్త్రం బ్రహ్మ యొక్క శీర్షం అంటే… బ్రహ్మ తలతో సృష్టించాడు. అందుకే ఈ అస్త్రం 4 తలల్ని కలిగి ఉంటుంది. ఇక బ్రహ్మశీర్షాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఒక్కసారి దీనిని ప్రయోగిస్తే చాలు, దశాబ్దాలుగా ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయగలదు. ఇది అణు బాంబు కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది. దేవతలను సైతం హతమార్చగలదు.

భారతంలో అశ్వత్థామ, మరియు అర్జునుడు ఒకరిపై ఒకరు ఈ వెపన్ ని ప్రయోగిస్తారు. ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు, భూగోళంలో భయంకరమైన మంటలతో దూసుకు పోతుంది. 

ఆ సమయంలో ఆకాశం కంపించేంతలా ఉరుములు ఉరిమాయి. వేలాది ఉల్కలు రాలి పడ్డాయి. భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటి అతలాకుతలం అయింది. జంతువులు భయంతో పరుగులు తీసాయి. చెట్లన్నీ నేలకూలాయి. పర్వతాలు బద్దలయ్యాయి. సముద్రాలు ఉప్పొంగాయి. మొత్తం మీద ఒక ప్రళయ భీబత్సాన్ని సృష్టించింది. ఇదంతా గమనించిన నారదుడు, మరియు వ్యాసుడు ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. చేసేదేమీలేక అర్జనుడు తన ఆయుధాన్ని ఉపసంహరించుకున్నాడు. అయితే, అశ్వత్థామకి అది చేతకాక అర్జనుడి మనవడైన పరీక్షిత్ వైపుకి  మళ్ళించాడు.

పాశుపతాస్త్రం (శివుని ఆయుధం)

పాశుపతాస్త్రం పరమ శివునికి చెందిన అత్యంత విధ్వంసక ఆయుధం. దీనిని స్వయంగా శివుడే అర్జునుని తపస్సుకి మెచ్చి బహుమతిగా ఇస్తాడు. ఈ అస్త్రాన్ని ఉపయోగించటం కేవలం అర్జనుడు, కర్ణుడు, మరియు పరశురాముడికి మాత్రమే తెలుసు. 

ఇది విశ్వంలో ఉన్న అన్ని అస్త్రాల కంటే చాలా శక్తివంతమైనది. ఈ అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, ఎలాంటిదైనా బూడదై పోవాల్సిందే! సృష్టి మొత్తాన్ని కేవలం ఈ ఒక్క అస్త్రంతో నాశనం చేయవచ్చు. శివుడు ఈ సర్వ సృష్టిని నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాడు. అలాంటి శివుని యొక్క నాశనం చేయలేని, మరియు ఎదురులేని ఆయుధం ఈ పాశుపతాస్త్రమే! 

మహాభారత యుద్ధ సమయంలో, అర్జనుడు ఈ అస్త్రాన్ని శివుని వద్దనుండీ పొందాడు. అసలు ఈ అస్త్రాన్ని మొదట పరమశివుడు పరశురాముడికి బహుమతిగా ఇచ్చాడు. తర్వాత పరశురాముడు తన శిష్యుడైన ద్రోణుడికి బహుమతిగా ఇస్తాడు. కురుక్షేత్రంలో ద్రోణుడు దానిని అర్జునుడిపై ప్రయోగించాలని చూసి… విఫలమవుతాడు. ఇక కర్ణుడు కూడా యుద్ధసమయంలో చిట్టచివరికి ఈ అస్త్రాన్ని అర్జనుడిపై ప్రయోగించాలని చూస్తాడు. కానీ, గురు శాపం వల్ల దానిని ఉచ్చరించటం మర్చిపోతాడు. 

బ్రహ్మదండాస్త్రం (బ్రహ్మ యొక్క శిక్షా దండం)

బ్రహ్మదండాస్త్రం బ్రహ్మదేవుని యొక్క పనిష్మెంట్. నిజానికిది ఆయుధం కాదు, ఒక వ్యక్తి తన భక్తి, లేదా తపస్సు ద్వారా సంపాదించుకున్న శక్తి. దీనిని ఎవరూ గిఫ్ట్ గా పొందలేరు. 

పూర్వం మునులు, యోగులు యుగాల తరబడి, ఏళ్ళ తరబడి తమ శక్తినంతా ధారపోసి, తపస్సు చేసి సంపాదించుకున్న బ్రహ్మ తేజం ఒక స్పిరిచ్వల్ లైట్ రూపంలో ప్రకాశిస్తూ… బ్రహ్మ దండంగా మారుతుంది. దీన్ని ఒక్కసారి ప్రయోగిస్తే… రెప్పపాటు కాలంలో పూర్తి విశ్వాన్నే తనలోకి లాగేసుకొనే శక్తి కలిగి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే… బ్లాక్ హోల్ క్రియేట్ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. బ్రహ్మదండాస్త్రం అనేది పర్సనల్ వెపన్. ఇది ఒక డివైన్ రాడ్. 

మహాభారతంలో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన రక్షణ ఆయుధం ఈ బ్రహ్మదండ. విశ్వామిత్రుని దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి దీనిని వశిష్ట మహర్షి ఉపయోగించినట్లు పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శీర్షాస్త్రం వంటి ఇతర శక్తివంతమైన అస్త్రాలని  తిప్పికొట్టగల సామర్థ్యం ఈ బ్రహ్మదండ అస్త్రానికి ఉంది. 

ఇది కూడా చదవండి: మహాభారతంలో శకుని జీవిత రహస్యం

సుదర్శన చక్రం (విష్ణువు యొక్క వ్యక్తిగత ఆయుధం)

సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క మోస్ట్ పవర్ ఫుల్ వెపన్. రాక్షస సంహారం కోసం శ్రీమహావిష్ణువు వేయి సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తికి ఈ సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి మహావిష్ణువు అన్ని అవతారాల్లోనూ ఈ ఆయుధం ఉంటుంది. 

సుదర్శన చక్రం అత్యంత భయంకరమైన ఆయుధం. ఇది 108 పదునైన కత్తుల్లాంటి ఆకారాలు కలిగి ఉన్న డిస్క్ రూపంలో ఉంటుంది. దీనికి టార్గెట్ ఎయిమ్ చేసి వదిలితే… శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే… వెంటాడి… వేటాడి మరీ చంపుతుంది. టార్గెట్ ఫినిష్ చేసుకున్న తర్వాత తిరిగి దాని గమ్యానికి అదే చేరుకుంటుంది.  

మహాభారతంలో, ఈ ఆయుధాన్ని ఉపయోగించి శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపుతాడు. అలాగే, తన కుమారుడైన అభిమన్యుడి మరణవార్త తెలుసుకున్న అర్జనుడు మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు జయద్రథుని సంహరిస్తానని, లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేస్తాడు. అది తెలిసి, జయద్రథుడు అర్జునుడి కంట పడకుండా ఉండేలా కౌరవ సైన్యం అతనికి రక్షణ కవచంగా నిలుస్తారు. వారందరినీ జయించి జయద్రథుని సంహరించేందుకు సమయం సరిపోలేదు. 

ఇంతలో సూర్యాస్తమయం కావస్తుండటంతో, కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు. అది తెలియని జయద్రథుడు రక్షణ కవచం నుండి బయటికి వచ్చేస్తాడు. వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం, అర్జునుడు జయద్రథుని సంహరించడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి.

త్రిశూలం (శివుడి వ్యక్తిగత ఆయుధం)

త్రిశూలం శివుని యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడికి ఈ ఆయుధాన్ని ఇస్తుంది. త్రిశూలం చూడటానికి 3 పదునైన ఈటెల్లాంటి కొనలు కలిగి ఉంటుంది. ఈ మూడు కొనలు కోరిక, చర్య, మరియు జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. 

ఎక్కడైతే, తప్పు జరుగుతుందో… అక్కడ ఈ త్రిశూలాన్ని ప్రయోగిస్తే… దాన్ని విచ్చిన్నం చేస్తుంది. హిందూ పురాణాలలో త్రిశూలం అత్యంత శక్తివంతమైన ఆయుధం. శైవ సాంప్రదాయం ప్రకారం, ఈ ఆయుధాన్ని శివుడు, మరియు శక్తి దేవత తప్ప ఎవరూ ఆపలేరు. 

మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఇదీ ఒకటి. విధ్వంసం గురించి మాట్లాడాలంటే, అన్యాయాలనీ, అక్రమాలనీ తుదముట్టించే అత్యంత శక్తివంతమైన ఆయుథాలలో త్రిశూలం కంటే శక్తివంతమైనది ఏదీలేదు. 

బుద్ధి (దైవిక ఆయుధం)

బుద్ధి అనేది ప్రతి ఒక్కరికీ దివ్యాయుధం. ఇది ఎవరూ మరొకరికి ఇచ్చేది కాదు. దాని మార్గాలు సింపుల్ గానే ఉంటాయి. కానీ, వెళ్ళే మార్గం మాత్రం టఫ్ గా ఉంటుంది. దానికున్న శక్తి ఎలాంటి దానినైనా కదిలిస్తుంది. విధ్వంసకరమైన ఆయుదాలకంటే, అత్యంత శక్తివంతమైన ఆయుధమిది. ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే తెలివితేటలు, తెలివితేటల కంటే ఆత్మ చాలా గొప్పది. 

కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జనుడికి చేసిన గీతోపదేశంలో ఈ విషయం గురించి ప్రస్తావించాడు. మైండ్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి, దానిని నిలకడగా ఉంచితే, భౌతిక ఇంద్రియాలపై దాని ప్రభావం గురించి వివరించాడు. మైండ్ ని ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలి. మన మైండ్ మన కంట్రోల్ లో ఉండాలి. అలా ఉండాలంటే, స్పిరిచ్వల్ ఇంటలిజన్స్ కలిగి ఉండాలి. దీని ద్వారానే కామం అనే శత్రువుని జయించగలుగుతాం అని అర్జనుడితో చెప్తాడు. 

మహాభారత యుద్ధంలో ఉపయోగించిన పవర్ ఫుల్ వెపన్స్ అన్నిటికన్నా… మైండే మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ అని నిరూపించాడు శ్రీకృష్ణుడు. ఎలాగంటే, ఈ యుద్ధంలో ఆయన యుద్ధ నైపుణ్యం కన్నా… వ్యూహాత్మకంగానే యుద్ధం నడిపించగలిగాడు. అందుకే, ఎలాంటి ఆయుధాన్ని పట్టలేదు, కేవలం మైండ్ పవర్ తోనే పాండవులని గెలిపిస్తూ… ధర్మాన్ని నిలబెట్టాడు. దీన్నిబట్టే అర్ధమవుతోంది అన్ని ఆయుధాలకన్నా… మన మనసే గొప్ప ఆయుధమని. 

చివరిమాట 

మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం. ఇది పురాణ యోధులు ప్రయోగించిన శక్తివంతమైన ఆయుధాల గురించి తెలియచేస్తుంది. ఈ పౌరాణిక ఆయుధాలు యుద్ధాల భవితవ్యాన్ని నిర్ణయించడమే కాకుండా చెడుపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. మహాభారతం యొక్క శక్తివంతమైన ఆయుధాల వర్ణన భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా పనిచేస్తుంది అంతేకాదు, ముందు తరాలకు స్ఫూర్తినిస్తూ, వారి ఊహలకి  మరింత ఇన్స్పిరేషన్ ని అందిస్తుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top