మహేష్ బాబు ఈసారి అందరికీ షాకిచ్చాడు. సెలెబ్రిటీ హోదాలో ఉన్న అతను ఒక సామాన్యుడిలా మారిపోయాడు. మల్టీ ప్లెక్స్ ఓనర్ అయిన ఈయన సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డారు. అంతేనా..! ఏకంగా ఒక అమ్మాయిని నెట్టేసి మరీ సినిమా టికెట్ కొట్టేశారు. ఇదంతా ఎక్కడ? ఏమిటి? అనేదేగా మీ డౌట్. అయితే వినండి.
మహేష్ నిర్మాతగా మారి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేజర్ సందీప్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగుతోపాటు, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఆ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు టికెట్ కోసం ఓ థియేటర్ లో క్యూలో నిల్చున్నారు.
అప్పటికే క్యూలో నిల్చున్న అడివి శేష్ ని వెనక్కి పంపిన యూట్యూబర్, మరియు డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం మహేష్ ని మాత్రం చూడగానే కాదనలేక పోయింది. మహేష్ ని చూసి సిగ్గుపడుతూ… మీరు ముందు నిల్చున్నా ఏం పర్లేదు అన్నట్లు చెప్తుంది. అదిచూసి వెనకున్న అడివి శేష్ ఆమెవైపు సీరియస్ గా చూస్తాడు.
ఇక మహేష్ తాను నిలబడ్డదే కాక, మా స్నేహితులను కూడా పిలవొచ్చా..? అని అడగ్గానే ఒకే అంటుంది. వెంటనే మహేష్ తన ఫ్రెండ్స్ ని పిలవగానే క్యూ లైన్ మరింత పెరుగుతుంది. ఇంతలో మహేష్ ఫోన్ నంబర్ అడిగేలోపు అతను టికెట్ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత అడివి శేష్ నుంచి నంబర్ తీసుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F
— Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022