పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు.
చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్… లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. రోజూ లానే అక్టోబర్ 23న అంటే శనివారం రోజు కూడా ఇక్కడికి టూరిస్టులు వచ్చారు. అయితే, ఈ టూరిస్టులలో ఒక వ్యక్తి ఏకంగా పులులు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో మొత్తం 9 తెల్ల పులులు అక్కడ ఉన్నాయి. డైరెక్టుగా వాటి ఎదురుగా వెళ్లి కూర్చున్నాడు. ఇంతలో మరో 2 తెల్ల పులులు కూడా అక్కడికి వచ్చాయి. కొంతసేపు అతన్ని అయోమయంగా చూశాయి.
ఇక ఎన్‌క్లోజర్ బయట ఉన్న టూరిస్టులు మాత్రం ఇదంతా చూసి కంగారుపడుతుంటే… ఆ వ్యక్తి మాత్రం తనకేం పట్టనట్లు ఉన్నాడు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.
ఒక్క పులికి ఎదురుగా కూర్చోవటమే కష్టం. అలాంటిది ఏకంగా 11 పులులకి ఎదురుగా కూర్చోవడమంటే మాటలా. తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఏదేమైనా ఈ వ్యక్తి చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, అన్ని పులుల మద్య ఉన్నా ఎలాంటి గాయాలు లేకుండా సేఫ్ గా బయటకి రాగలిగాడు.