ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఇక్కడ విచిత్రం ఏంటంటే, వ్యక్తుల మద్య జరిగిన ఘర్షణ మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. ఈ గొడవల్లో కత్తిపోట్లకి గురైన వ్యక్తిని లైవ్ లో మనం చూడొచ్చు.
హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న రసూల్ పురా ఏరియాలో ఈ తెల్లవారు ఝామున జరిగిన ఇన్సిడెంట్ కలకలం సృష్టించింది. ప్రదీప్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు.
రసూల్ పురా ఇల్లాహి మసీదు ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న ప్రదీప్ అనే వ్యక్తితో మరికొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత వాళ్ళు ప్రదీప్ పై దాడికి దిగారు. అంతేకాక, కత్తితో పొడవటంతో అతనికి తీవ్ర గాయమైంది. రక్తపు మడుగులో ఉన్న అతనిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా అక్కడి సీసీ టీవీ ఫూటేజ్ లో రికార్డు అయింది.