మెగాస్టార్ చిరంజీవి ఏది చేసినా… అది సంచలనమే! టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరు రూటే సపరేటు. అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. అప్పుడప్పుడూ వెరైటీ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ… ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు.
ఇక తాజాగా ఆయన నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను భయపెట్టేశారు. అదేదో మామూలు లుక్ కాదండోయ్… దెయ్యం లుక్. అవును మీరు విన్నది నిజమే! చిరు దెయ్యం లుక్‌లో కనిపించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇదేదో మూవీకి సంబందించిన లుక్ అనుకునేరు. కానే కాదు, రియల్ గానే చిరు ఈ సాహసం చేశారు.
నిజానికి చిరు ఇలా చేయడానికి ఓ రీజన్ ఉంది. అక్టోబర్ 31న ‘హలోవీన్ డే’ కావటంతో చాలామంది సెలెబ్రిటీలు ఫన్నీ మేమీస్ తో, ఘోస్ట్ గెటప్స్ తో ఈ ఈవెంట్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగానే చిరంజీవి కూడా గోస్ట్ గెటప్ లో కనిపించి అందరినీ భయపెట్టారు. గోస్ట్ లుక్ లో ఉన్న ఫన్నీ వీడియోని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. దీంతోపాటు ‘హ్యాపీ హలోవీన్’ అనే క్యాప్షన్ కూడా జత చేశాడు. దీనికితోడు ఇది ఎంతో ‘ఉత్కంఠభరితమైన రోజు’ అనే కామెంట్ కూడా జత చేశారు.
అయితే, ఈ లుక్ కోసం మెగాస్టార్ ఎలాంటి మేకప్ వేసుకోలేదు, జస్ట్ ఒక యాప్ ద్వారా ఇలా చేశారు. ఏదేమైనా కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.
Boss @KChiruTweets Insta story ❤️❤️😂😂 pic.twitter.com/7HYJmUyoJN
— chiranjeevi tharvathe yevarayina | Aacharya 🔥🔥 (@Deepu0124) October 31, 2021