మెగాస్టార్ ఏది చేసినా ప్రత్యేకమే! ఆడియన్స్ లో ఆయనకున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటైనా… పాటైనా… ఫైటైనా… డ్యాన్సైనా… యాక్షనైనా… కామెడీ అయినా… ఏదైనా చిరు రూటే సపరేటు. ఇక ఏవైనా ఈవెంట్స్ లో స్టేజ్ పై జరిగే చిరు మార్క్ కామెడీ అయితే సరేసరి.
సందర్భం ఏదైనా సరే చిరు మాత్రం ఎప్పటికీ ఫుల్ జోష్లో కనిపిస్తుంటారు. పంచ్ లతో నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి చిరు ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ నే ఇమిటేట్ చేసి వావ్… అనిపించారు.
ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహా… తెలుగు ఇండియన్ ఐడల్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే! ఈ షో ఫైనల్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ కి … ఓ సందర్భంలో సూపర్ స్టార్ గురించి ప్రస్తావన తేవాల్సి వచ్చింది. పనిలో పనిగా ఆడియన్స్ ని ఖుషీ చేయటం కోసం రజినీ కాంత్ స్టైల్ ఫాలో అవుతూ… ఆయన ఎలా నడుస్తారో… అదే విధంగా నడిచి ఆయన్ని ఇమిటేట్ చేసి చూపించారు.
దీంతో స్టేజ్ పై ఉన్న ఆడియన్స్ ఒకటే నవ్వులు, ఈలలు, కేకలు, అరుపులు, కేరింతలతో దద్దరిల్లి పోయింది. అంతటితో ఆగకుండా, అక్కడున్న ఓ కంటెస్టెంట్ రజినీ వీరాభిమాని కావడంతో, అతనికి తన కళ్లజోడును కానుకగా ఇచ్చి… రజినీ కాంత్ స్టైల్లో పెట్టుకోమన్నారు. ఈ విధంగా షో మొత్తం రచ్చ రచ్చ చేశారు చిరంజీవి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
View this post on Instagram