మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు బాగా వేయటమే కాదు, దోశలు కూడా బాగా వేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, చిరు దోశ స్పెషలిస్ట్. ఇక రీసెంట్ గా మొన్న పొంగల్ సెలెబ్రేషన్స్ లో… మెగా కాంపౌండ్ లో… వరుణ్ తేజ్ తో కలిసి దోశల పోటీ పెట్టుకున్నారు. ఈసారి సమంతహోస్ట్ చేస్తున్న ఆహా ఓటీటీ ఫ్లాట్ఫామ్ ‘సామ్ జామ్’లో కూడా దోశ వేసి తానెంతో నిరూపించుకున్నారు.
సెలబ్రిటీ టాక్ షో… సామ్ జామ్‌లో, ఇప్పటివరకూ ఎంతోమంది సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసిన సమంత ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కి వెల్కమ్ చెప్పింది. ఈ షోలో సామ్ అడిగిన ప్రశ్నలకి చాలా ఎనర్జిటిక్ గా సమాధానాలు చెప్పారు చిరు. తర్వాత మీరు దోశ స్పెషలిస్ట్ అని విన్నాను. మా ఆడియన్స్ కోసం ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అంటుంది సమంత.
వెంటనే ఓకే చెప్పేసిన చిరు దోశ వేయటం స్టార్ట్ చేశారు. దోశ పర్ఫెక్ట్ గా వేయటమే కాకుండా దానిని ఎంతో చాకచక్యంగా ఫ్లిప్ చేశారు. అంతేకాదు, తన కళ్ళకి గంతలు కట్టుకొని మరీ దోశని ఫ్లిప్ చేశారు. ఇంకా తన ఫ్యాన్స్ ని కూడా ట్రై చేయమంటూ ఛాలెంజ్ విసిరారు. వాళ్ళు చేసినది వీడియో తీసి #MegastarDosaFlipChallengeకి ట్యాగ్ చేయమని కూడా కోరారు.
ఈ సందర్భంగా చిరు గతంలో తనకి దోశ ఫ్లిప్ చేస్తుండగా జరిగిన అనుభవాన్ని ఈ వేదిక సాక్షిగా షేర్ చేసుకున్నారు. మొదట్లో తనుకూడా ఇలా ఫ్లిప్ చేద్దామని ఆమ్లెట్ వేశారట. తీరా దానిని ఫ్లిప్ చేసే సమయంలో ఎగిరి తన మొహమంతా చిందిందట. అప్పుడు దోశని తిప్పటమేమో కానీ, పేస్ మొత్తం నీస్ కంపు కొట్టింది అంటూ వాపోయారు.
ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.