ప్రమాదం అనేది చెప్పి రాదు. అది ఎటువైపు నుంచీ అయినా రావచ్చు. బయటకు వెళితేనే కాదు… అది ఇంట్లో ఉన్నా… వచ్చే అవకాశం ఉంది.
సాదారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో సడెన్ గా ఏదైనా పెద్ద శబ్దం వస్తే ఏం చేస్తాం..? ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాం. కానీ, జీవితంలో ఎప్పుడూ చూడని… కనీ, వినీ ఎరుగని దృశ్యం కనపడితే… ఏం చేయాలో మాటల్లో వర్ణించలేము.
అలాంటి సంఘటనే ప్రస్తుతం కెనడాలో జరిగింది. అక్టోబర్ 4న, కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ప్రావిన్స్‌లో నివసిస్తున్న ‘రూత్ హామిల్టన్’ అనే మహిళ రోజూ లాగే ఆ రోజు కూడా తన బెడ్రూంలో నిద్రిస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వినిపించడంతో ఆమె గబుక్కున లేచింది. చూస్తే… నా దిండుపై ఓ నల్లని గట్టి రాయి లాంటి పదార్థం కనిపించింది. పరీక్షగా చూసినప్పుడు అదో ఉల్క అని అర్థమైంది.
రూత్ లేచిన వేళా విశేషం బాగుండి… ఆమె ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎందుకంటే ఉల్క మీద పడితే ఆమె చనిపోయి ఉండేది. ఇక వెంటనే రూత్ ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్ చేసింది.
ఈ సంఘటన తర్వాత రూత్ మాట్లాడుతూ… ‘మన జీవితంలో ఏ క్షణానికి ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం అని చెప్పటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకిప్పుడు అర్థం అయ్యిందని చెప్పింది. అంతేకాదు, హాయిగా బెడ్ పై నిద్రపోతున్న నాకు ఒక్కసారిగా పెద్ద సౌండ్ వినిపించడంతో మొదట ఏం జరిగిందో అర్ధం కాలేదు. కాకపోతే, ఆ శబ్దం ధాటికి నేను లేచి కూర్చున్నాను. నేను లేవగానే నా పిల్లో పై ఒక గట్టి రాయి వచ్చి పడింది. చూడటానికి అది నల్లగా మాడిపోయినట్లుగా ఉంది. తర్వాత నాకు అర్ధమైంది అది ఒక ఉల్క అని. ఒకవేళ నేను బెడ్ మీద నుంచి లేవకపోతే ఏం జరిగి ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తుంది’. అంటూ భయం భయంగా చెప్పింది.
ఈ విషయాన్ని రూత్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ… ‘దీన్ని నేను బద్రంగా దాచుకుంటాను. దీన్ని నా మనుమలకి చూపిస్తే… వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు’. అని తెలిపింది.