ల్యాండ్ అయిన విమానంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా రన్‌వే పై గందరగోళం నెలకొంది. సిబ్బంది ఎలర్ట్ అవ్వటంతో కథ సుఖాంతం అయింది.
డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెడ్ ఎయిర్ ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. విమానం అలా ల్యాండ్ అయిందో… లేదో… ఒక్కసారిగా దానినుండీ మంటలు చెలరేగాయి. విమానం అలా మంటల్లో చిక్కుకోవటానికి కారణం రన్‌వే పై ఉన్న ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే!
ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల విమానం వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ విమానంనుండీ మంటలు వ్యాపించాయి. అయితే, ఆల్రెడీ ఆ విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో… వీరంతా ఏం చేయాలో… ఎక్కడికి పోవాలో… దిక్కుతోచని పరిస్థితి.
ఇక విషయం తెలుసుకొని వెంటనే అలర్ట్ అయ్యింది ఎయిర్ పోర్టు సిబ్బంది. ఫైర్ ఇంజిన్స్, రెస్క్యూ టీమ్ ఇలా అంతా ఆ విమానం దగ్గరికి చేరుకున్నారు. విమానంలోని ప్రయాణికులందరినీ ఎమెర్జెన్సీ డోర్ నుంచి క్షేమంగా కిందకు దించారు. విమానానికి అంటుకున్న మంటలను చల్లార్చారు. అయితే, ఈ ఇన్సిడెంట్ లో ముగ్గురు ప్రయాణికులు మాత్రం స్వల్పంగా గాయపడ్డారు.
Plane catches fire after crash landing at Miami International Airport from DR. Sources state there were only minor injuries | #ONLYinDADE pic.twitter.com/AtL9vDYF74
— ONLY in DADE (@ONLYinDADE) June 21, 2022