ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే! అయితే, దీనికి కారణం టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీనే అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
షమీ పాకిస్థాన్ కి అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాల్సిందే అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే, క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటివారు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక పొలిటికల్ లీడర్స్ అయిన రాహుల్ గాంధి, ఒమర్ అబ్దుల్లా అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయంలో షమీకి సపోర్ట్ చేస్తున్నారు. షమీ టీమిండియాని ఎన్నోసార్లు గెలిపించాడనీ, అలాగే దేశంపట్ల, ఆటపట్ల ఎంతో డెడికేషన్ కలిగిన వ్యక్తి అని తెలిపారు.
ఇదిలా ఉంటే, వీరి కామెంట్లకి చెక్ పెడుతూ సోషల్ మీడియా ఒక పాత వీడియో రిలీజ్ చేసింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. షమీని దూషించేవారికి ఇది గుణపాఠంలా ఉంది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా సరిగ్గా ఇలానే భారత్ పాక్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత భారత జట్టు మొత్తం డ్రెస్సెంగ్ రూమ్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలో, గ్యాలరీలోని ఓ పాక్ అభిమాని టీమిండియా జట్టు మొత్తాన్ని దూషించటం మొదలు పెట్టాడు. టీమ్ మొత్తం దీంతో మహ్మద్ షమీ పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతలోనే కెప్టెన్ ధోనీ అక్కడికి వచ్చి షమీని లోపలికి తీసుకెళ్లాడు.
Those calling @mdshami11 a #gaddar after the #IndiaVsPak match, please watch this 2017 video, when after losing to Pakistan, only Shami had the courage to confront the bullying Pakistani. #IndvsPak #shami #Kohli #ICCT20WorldCup #RohithSharma pic.twitter.com/8ixvhbJadP
— निंदाTurtle (@Tawishz) October 25, 2021