కలలు కనటం తప్పేమీ కాదు, అయితే, కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరగబోయే విషయాలని ముందే తెలియచేస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ కలకీ ఒక అర్థం ఉందని చెప్తారు. మరి మనకొచ్చే ఈ కలల్లో ఏమేమి కనిపిస్తే… ఎలాంటి ఫలితాలు ఉంటాయో… ఇప్పుడు తెలుసుకుందాం.
- కలలో అగ్ని, తగలబడటం, వంట చేయడం వంటివి కనిపిస్తే…త్వరలోనే కెరీర్లో డెవలప్ అవుతారని అర్ధం.
- డబ్బు కలలో కనిపిస్తే… రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెరుగుతుందని అర్ధం.
- కలలో మీరు దానిమ్మపండ్లు తింటునట్లు వస్తే… త్వరలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- పసుపు, ఎరుపు వంటి రంగులు మీ కలలో కనిపిస్తే… మీ ప్రతిష్ట పెరుగుతుందని అర్థం.
- గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్నట్లు కల వస్తే… త్వరలోనే ఉద్యోగం, ఉపాధి వంటివి కలుగుతాయని అర్ధం.
- రైతులు, పంట పొలాలు వంటివి కలలో కనిపిస్తే… త్వరలోనే సిరిసంపదలు వస్తాయని అర్థం.
- పాలు, పెరుగు, తేనె వంటివి కలలో కనిపిస్తే… భవిష్యత్లో ఆర్థికంగా స్థిరపడతారని అర్ధం.
తెలుసుకున్నారు కదా! దీనిని బట్టి మీకొచ్చే కలలు దేనికి సంకేతమో మీరే ఊహించండి.