శత్రువుల గుండెల్లో భయాన్ని కలిగించే ఎలైట్ ఫోర్సెస్ ద్వారా ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ఒక స్ట్రాంగ్ వెపన్ గా మారింది. నార్త్ సైడ్ మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి సౌత్ సైడ్ ఉన్న ట్రాపికల్ ఫారెస్ట్స్ వరకూ ఈ మోస్ట్ డేంజరస్ ఫోర్సెస్ ఎంతో యాక్యురసీ అండ్ సీక్రెసీతో వర్క్ చేస్తూ ఉంటాయి. హై-రిస్క్ మిషన్స్ కోసం వీళ్ళంతా స్పెషల్ గా ట్రైన్డ్ చేయబడి ఉంటారు. దేశరక్షణ విషయంలో ఎంతో కమిట్మెంట్ తో ఉంటారు. అందుకే వీరిని ‘Army’s true powerhouses’ అని కూడా అంటారు. ఈ ఆర్టికల్ లో మనం ఇండియా యొక్క మోస్ట్ డేంజరస్ ఫోర్సెస్ అయిన పారా కమాండోస్, మార్కోస్, గరుడ్ కమాండో ఫోర్స్, NSG మరియు SFF గురించి తెలుసుకుందాం. అలానే వారి యొక్క డేరింగ్ యాక్టివిటీస్ అండ్ అడ్వాన్స్డ్ టాక్టిక్స్ వెనుక ఉన్న మిస్టరీస్ గురించి కూడా తెలుసుకుందాం.
స్పెషల్ ఫోర్సెస్ అంటే ఏమిటి?
ఈ ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ ని ఫుల్లీ ట్రైన్డ్ మిలిటరీ ఎస్సెట్స్ గా భావిస్తారు. స్ట్రాటజిక్ అవుట్ కమ్స్ ని అందించటమే వీళ్ళ లక్ష్యం. టెర్రరిస్ట్ థ్రెట్స్ కి వెంటనే రియాక్ట్ అయి మిషన్ కంప్లీట్ చేసే విధంగా వీళ్ళని ప్రిపేర్ చేస్తారు. ఛాలెంజెస్ ఫేస్ చేయటానికి ఎప్పటికప్పుడు సైకలాజికల్ గా ఇంప్రూవ్ అవుతారు. అంతేకాదు, లక్ష్యాన్ని సాధించటం కోసం సైబర్ క్యాపబులిటీస్,ఆర్టిఫిషల్ ఇంటలిజన్స్, ఏరియల్ వెహికల్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు.
జాతీయ భద్రత కోసం సైనిక బలం యొక్క ప్రాముఖ్యత
ప్రతీ దేశానికీ ఉన్నట్లే మన దేశానికి కూడా ఓ స్ట్రాంగ్ డిఫెన్స్ ఫోర్స్ ఉంది. అది ఆర్మీ, నేవీ, అండ్ ఎయిర్‌ఫోర్స్ అని 3 టైప్స్ లో డివైడ్ అయి ఉంది. అయితే ఈ డిఫెన్స్ ఫోర్సెస్ మూడూ కూడా కొన్ని అవసరాల కోసం… మళ్ళీ స్పెషల్ కమాండో ఫోర్సెస్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాయి. ఈ కమాండర్లు అటు సోల్జర్స్ కాదు, ఇటు పోలీసులు అంతకంటే కాదు, డిఫెన్స్ ఫోర్స్ లో వివిధ రంగాల్లో ఆరితేరిన వారిని స్పెషల్ గా సెలెక్ట్ చేసి, ట్రైనింగ్ ఇస్తారు.
వీళ్ళ దగ్గర అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఉంటాయి. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా సక్సెస్ చేయాలో వీరికి బాగా తెలుసు. సిట్యుయేషన్ డిఫికల్ట్ గా మారినప్పుడు వీరిని రంగంలోకి దించుతారు. నేషనల్ సెక్యూరిటీ, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో ఇలాంటి ఫోర్సెస్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇండియాలో ఇలాంటి డేంజరస్ కమాండో ఫోర్సెస్ కొన్ని ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం
మోస్ట్ డేంజరస్ మిలిటరీ ఫోర్సెస్ టైప్స్
ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వర్క్ చేసే స్పెషల్ ఫోర్స్ యూనిట్స్… కౌంటర్-టెర్రరిజం, సర్వైలెన్స్, అండ్ కోవర్ట్ మిషన్స్ వంటి హై-రిస్క్ ఆపరేషన్స్ కోసం వర్క్ చేస్తాయి.
అయితే ఆ మోస్ట్ డేంజరస్ మిలిటరీ ఫోర్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. అవి: ఇండియన్ ఆర్మీ యొక్క పారా కమాండోస్, ఇండియన్ నేవీ యొక్క మార్కోస్, మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గరుడ్ కమాండో ఫోర్స్. ఇవి కాక మరో 2 స్పెషల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. అవి మిలిటరీచే కంట్రోల్ చేయబడవు. కానీ పౌర సంస్థల క్రింద పనిచేస్తాయి. అవి మినిస్టరీ అఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ – NSG మరియు ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ – RAW అనబడే స్పెషల్ గ్రూప్. RAW అండర్ కంట్రోల్ లో మళ్ళీ సపరేట్ స్పెషల్ ఫోర్సెస్ ని కలిగి ఉంది, అవి: స్పెషల్ ఫోర్స్ – SF మరియు స్పెషల్ ఫ్రాంచైర్ ఫోర్స్ – SFF. ముందుగా…
ఇది కూడా చదవండి: Top 15 Most Dangerous Places on Earth
పారా కమాండోలు
పారాచూట్ రెజిమెంట్ ని పారా కమాండోస్ అంటారు. ఇది ఇండియన్ ఆర్మీకి చెందిన ప్రత్యేక విభాగం. ఈ కమాండో ఫోర్స్‌ని 1952లో ఏర్పాటు చేశారు.
ఇది ఎక్కువగా ఏరియల్ ఆపరేషన్స్ పై ఫోకస్ చేస్తుంది. ఈ కమాండోలు ఎక్స్ట్రా ఆర్డినరీ కరేజ్, ఫిజికల్ స్టామినా, టాక్టికల్ స్కిల్ కలిగి ఉండి చాలా క్విక్ గా ఆపరేషన్ నిర్వహించగలరు. అందుకే పారా కమాండోలకు పారాచూటింగ్, కంబాట్ టాక్టిక్స్, సర్వైవల్ టెక్నిక్స్‌పై ట్రైనింగ్ ఇస్తారు.
పారా కమాండోస్ ట్రైనింగ్ విషయానికొస్తే… ఏరియల్ ఆపరేషన్స్, పారాచూట్ జంప్స్,హెలికాప్టర్ ఎటాక్స్ వంటి విషయాల్లో నైపుణ్యం సాధించటం; కౌంటర్ – టెర్రరిజం, గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందటం; అడ్వాన్స్డ్ వెపన్స్ యూజ్ చేయటం; కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించటం వంటి విషయాల్లో ఫుల్ ట్రైన్డ్ అవుతారు.
ఈ ఇండియన్ ఆర్మీ యూనిట్ల వాలంటీర్లు కఠినమైన సెలక్షన్ ట్రయల్స్‌కు గురవుతుంటారు. ఖచ్చితంగా వీరికి 90-డేస్ అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లో అడ్వాన్స్డ్ పారాచూటింగ్, కంబాట్ టాక్టిక్స్, సర్వైవల్ స్కిల్స్ వంటివి ఉంటాయి.
ఇప్పటివరకూ పారా కమాండోస్ 1984లో సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో నిర్వహంచిన ఆపరేషన్ మేఘదూత్, 1987లో శ్రీలంక ప్రాంతంలో జరిపిన ఆపరేషన్ పవన్, 1990లో కాశ్మీర్ దగ్గర చేపట్టిన ఆపరేషన్ రక్షక్, జమ్మూ కాశ్మీర్‌లో జరిపిన కౌంటర్ – టెర్రరిజం ఆపరేషన్స్ వంటి ముఖ్యమైన మిషన్స్ చేపట్టారు.
Sky-bound heroes అని చెప్పబడే ఈ పారా కమాండోస్ కరేజ్, అండ్ శాక్రిఫైజ్ అనే ఇన్స్పిరేషన్ కలిగి ఉంటారు. అందుకే వారిని వన్ అఫ్ ది ఇండియాస్ మోస్ట్ ఫియర్డ్ అండ్ రెస్పెక్టెడ్ స్పెషల్ ఫోర్స్ గా చెప్తారు. వీరి కార్యాచరణ విజయం మరియు పోరాటంలో శౌర్యం వారికి అనేక శౌర్య పురస్కారాలు మరియు ప్రశంసలను సంపాదించిపెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, “Men apart, every man a hero” అనే మోటోని వీళ్ళు ఫాలో అవుతుంటారు.
మార్కోస్
మెరైన్ కమాండోస్ ని మార్కోస్ అంటారు. ఇది ఇండియన్ నేవీకి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్. ఈ కమాండో ఫోర్స్‌ని 1987లో ఏర్పాటు చేశారు.
సముద్రంలో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్ళు రంగంలోకి దిగుతారు. కౌంటర్-టెర్రరిజం, కోవర్ట్ ఆపరేషన్స్ కోసం వీళ్ళు స్పెషల్ గా ట్రైన్డ్ చేయబడతారు.
మార్కోస్ ట్రైనింగ్ విషయానికొస్తే… అండర్ వాటర్ ఆపరేషన్స్, పారాచూటింగ్, హెలికాప్టర్ ఎటాక్స్ వంటి విషయాలలో మంచి నైపుణ్యం సాధించటం; కంబాట్ డైవింగ్, స్విమ్మింగ్, మెరైన్ స్పెషల్ ఆపరేషన్స్ లో ట్రైనింగ్ పొందటం; అడ్వాన్స్డ్ స్కూబా గేర్, స్నిపర్ రైఫిల్స్, స్పెషలైజ్డ్ వెహికల్స్ ఆపరేటింగ్ వంటి విషయాలలో మంచి ప్రాక్టీస్ కలిగి ఉండటం; ఇవేకాక కోస్టల్ ఏరియాలలో కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించటం; ఇంకా హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్, టాక్టికల్ మాన్యువర్స్ వంటి విషయాలలో కూడా అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారు.
ఇండియన్ నేవీకి చెందిన వాలంటీర్లకి సెలక్షన్ టెస్టులు కూడా చాలా టఫ్ గా ఉంటాయి. మెరైన్ కమాండోస్ గా మారేముందు 14-months ట్రైనింగ్ పిరియడ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో వీళ్ళు అడ్వాన్స్డ్ డైవింగ్, పారాచూటింగ్, కంబాట్ టాక్టిక్స్ లో ఎక్స్పీరియన్స్ పొందుతారు.
ఇప్పటివరకూ మార్కోస్ 1987లో శ్రీలంక ప్రాంతంలో జరిపిన ఆపరేషన్ పవన్, 2008లో ముంబయిలో జరిగిన ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో – దీనినే మనం చరిత్రలో తాజ్ హోటల్ పై జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ గా చెప్పుకుంటాం. అలాగే గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో యాంటీ పైరసీ ఆపరేషన్స్, జమ్మూ కాశ్మీర్‌లో కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్స్ వంటి డేంజరస్ మిషన్స్ ఎన్నో చేపట్టారు.
Naval warriors of stealth అని చెప్పబడే ఈ మార్కోస్ ఫిజికల్ ఫిట్నెస్, టాక్టికల్ ఎక్స్ పర్టైజ్ కలిగి ఉంటారు. అందుకే ఈ కమాండోస్ ని వన్ అఫ్ ది ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఫియర్డ్ స్పెషల్ ఫోర్స్ గా చెప్తారు. వీరి ఆపరేషనల్ సక్సెస్, ఫైటింగ్ బ్రేవరీ వంటివి వారికి అనేక శౌర్య పురస్కారాలు మరియు ప్రశంసలను సంపాదించిపెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, “The Few, The Fearless” అనే మోటోని వీళ్ళు ఫాలో అవుతుంటారు.
గరుడ్ కమాండో ఫోర్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ వింగ్ ని గరుడ్ కమాండో ఫోర్స్ అంటారు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎలైట్ స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్. ఈ కమాండో ఫోర్స్‌ని 2004లో ఏర్పాటు చేశారు.
ఇది క్రిటికల్ ఎయిర్ ఫోర్స్ బెసేస్ ని ప్రొటెక్ట్ చేయటానికి, కౌంటర్ టెర్రరిజం, సెర్చ్ అండ్ రెస్క్యూ, డిజాస్టర్ రిలీఫ్ వంటి విషయాలలో రెస్క్యూ మిషన్లు చేపడతారు. ఇంకా వీళ్ళు ల్యాండ్, అండ్ ఎయిర్ ఆపరేషన్స్ కూడా చేపడతారు.
గరుడ్ కమాండో ఫోర్స్ ట్రైనింగ్ విషయానికొస్తే… శత్రువుల లక్ష్యాలకు వ్యతిరేకంగా దాడులను నిర్వహించడం; శత్రువుల వెనుక ఉన్న ఇంటెల్‌ను గ్యాదర్ చేయటం; శత్రు భూభాగం నుండి కూలిపోయిన పైలట్‌లను ఎక్స్ట్రాక్ట్ చేయటం; ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్‌స్టలేషన్‌లను ప్రొటెక్ట్ చేయటం వంటి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన వాలంటీర్లకి 72-వీక్స్ హై-యాట్రిషన్ రేట్ తో చాలా టఫ్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ సమయంలో వీళ్ళు కంబాట్ డైవింగ్, పారాచూటింగ్, జంగిల్ సర్వైవల్ వంటి విషయాల్లో ఆరితేరి ఉంటారు. వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ లో 3 నెలలపాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ యొక్క పారా SF మరియు NSGతో స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది.
ఇప్పటివరకూ గరుడ్ కమాండో ఫోర్స్ 2018లో, ఆపరేషన్ రఖ్ హజిన్ పేరుతో కాశ్మీర్ వ్యాలీలో ఉన్న టెర్రరిస్ట్ లని న్యూట్రలైజ్ చేశారు. 2016లో, పఠాన్‌కోట్ ఎటాక్ లో చొరబాటు ఉగ్రవాదుల విషయంలో కీలక పాత్ర పోషించారు.
Airborne guardians అని చెప్పబడే ఈ గరుడ్ కమాండో ఫోర్స్ ని వారి యొక్క కరేజ్, అండ్ స్కిల్ కారణంగా ఇండియాస్ డిఫెన్స్ స్ట్రాటజీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా చేస్తుంది. వీరి స్పెషల్ క్వాలిటీస్ అశోక్ చక్ర మరియు వాయు సేన మెడల్ తో సహా అనేక శౌర్య పురస్కారాలను సంపాదించిపెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, “Defend Indian Skies” అనే మోటోని వీళ్ళు ఫాలో అవుతుంటారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)
NSG ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో ఫోర్స్ అంటారు. ఇది ఇండియా యొక్క ప్రీమియర్ స్పెషల్ కౌంటర్-టెర్రరిస్ట్ ఫోర్స్. NSG Ministry of Home Department క్రింద పనిచేస్తుంది. అయితే ఇది పారామిలిటరీ ఫోర్స్ మాత్రం కాదు. ఈ కమాండో ఫోర్స్‌ని 1984లో ఏర్పాటు చేశారు.
నేషనల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ లో ఇది ఒక ముఖ్యమైన భాగం. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, మరియు హై లెవల్ సెక్యూరిటీ కోసం ఈ స్పెషల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ కమాండోలను ‘బ్లాక్ క్యాట్స్’ అని కూడా పిలుస్తారు.
NSGలో 2 స్పెషల్ యాక్షన్ గ్రూపులు ఉన్నాయి. వాటిలో మొదటిది: స్పెషల్ యాక్షన్ గ్రూప్ – SAG. ఇది ఇండియన్ ఆర్మీ నుండి సిబ్బందిని రిక్రూట్ చేస్తుంది. రెండవది: స్పెషల్ రేంజర్స్ గ్రూప్ – SRG. ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మరియు స్టేట్ పోలీసుల నుండి సిబ్బందిని నియమిస్తుంది.
VIPలకి సెక్యూరిటీ ఇవ్వటం, టెర్రరిస్ట్ థ్రెట్స్ నుండీ న్యూట్రలైజ్ చేయడం హై రిస్క్ ఈవెంట్స్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం, ముఖ్యంగా ఇండియన్ బోర్డర్ లో ఉన్న క్రిటికల్ ఏరియాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం వంటి హై లెవల్ సెక్యూరిటీ కోసం ఈ స్పెషల్ ఫోర్స్ పనిచేస్తుంది.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ట్రైనింగ్ విషయానికొస్తే… కౌంటర్-టెర్రరిజం, హాస్టేజ్ రెస్క్యూ; బ్లాక్ జంప్‌సూట్స్ వాడకం; కంబాట్ టాక్టిక్స్, స్నిపర్ ట్రైనింగ్, ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్స్ వాడకం; పారాచూటింగ్, హెలీ-రాప్లింగ్ వంటి వివిధ రంగాల్లోనూ ఇంటెన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఉగ్రవాదుల చేతిలో ఉన్న బందీలను విడిపించాలంటే, ఖచ్చితంగా వీరు రంగంలోకి దిగాల్సిందే.
NSGకి చెందిన వాలంటీర్లకి 2 ఇయర్స్ ట్రైనింగ్ పిరియడ్ ఉంటుంది. ఈ పిరియడ్ లో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులు, మెడికల్ స్క్రీనింగ్, అండ్ సైకలాజికల్ ఎవల్యూషన్ వంటివి ఉంటాయి.
ఇప్పటివరకూ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఫోర్స్ 1986, 1988 మద్య గోల్డెన్ టెంపుల్‌లో జరిగిన సిక్కు మిలిటెంట్ల దాడి నుండీ ప్రజలని కాపాడారు. ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో వీళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 1990లో అమృత్‌సర్‌లో ‘ఆపరేషన్ అశ్వమేధ’ పేరుతో ఫ్లైట్ హైజాకింగ్ ని అడ్డుకున్నారు. 2001లో, ఆపరేషన్ వజ్ర శక్తి పేరుతో ఇండియన్ పార్లమెంటుపై జరిగిన దాడిలో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 2008లో, ముంబైలో తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్ర దాడుల్లో ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో అండ్ సైక్లోన్ పేరుతో ఉగ్రవాదులను తరిమికొట్టి, బందీలను రక్షించారు. 2016లో, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ లో 9 మంది భారత జవాన్లు కూడా అమరులయ్యారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన యాంటీ టెర్రరిజం ఆపరేషన్ లో కూడా వీళ్ళు పాల్గొన్నారు.
Counter-terrorism experts అని చెప్పబడే ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సాహసం, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారి అసాధారణమైన ధైర్యసాహసాలు, దేశానికి చేసిన సేవ కారణంగా అశోక్ చక్ర, శౌర్య చక్రతో పాటు అనేక సేవా పతకాలు, శౌర్య పురస్కారాలను సంపాదించిపెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, “Everywhere and Always the Best Security” అనే మోటోని వీళ్ళు ఫాలో అవుతుంటారు.
ఇది కూడా చదవండి: Top 10 Worst Air Disasters in History
పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (R&AW)
రా ఇంటెలిజెన్స్ అనేది సర్వైలెన్స్, ఇంటర్వ్యూస్, అండ్ ఇంటర్‌సెప్ట్ కమ్యూనికేషన్‌ల వంటి పద్ధతుల ద్వారా స్పై ఏజెన్సీస్ కలెక్ట్ చేసిన ప్రాసెస్ చేయని డేటా.
రా ఇంటెలిజెన్స్ లో 2 స్పెషల్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది: స్పెషల్ ఫోర్స్ – SF; రెండవది: స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ – SFF. వీటి గురించి కూడా ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పుకుందాం.
స్పెషల్ ఫోర్స్ – SF
ఇది 1981లో ఏర్పడింది. ఈ ఫోర్స్ కోవర్ట్ ఇంటలిజెన్స్ ఆపరేషన్స్, అండ్ కోవర్ట్ ఆపరేషన్స్ వంటివి నిర్వహిస్తాయి. దీనితో ఇండియన్ గవర్నమెంట్ ఓపెన్ రిలేషన్ షిప్ కలిగి ఉండకూడదు.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ – SFF
ఇది 1962లో ఏర్పడింది. ఈ స్పెషల్ ఫోర్స్ ఇండియా యొక్క ఈస్టర్న్ బార్డర్ ని ప్రొటెక్ట్ చేయటానికి మరియు కోవర్ట్ క్రాస్ బోర్డర్ ఆపరేషన్స్ నిర్వహించటానికి ఏర్పాటు చేయబడింది. అయితే SFF ఎందుకు ప్రత్యేకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రధానంగా టిబెటన్ శరణార్థులు మరియు గూర్ఖాలతో కూడిన ఎలైట్ ఇండియన్ పారామిలిటరీ యూనిట్. ఈ కమాండో ఫోర్స్‌ని 1962లో ఏర్పాటు చేశారు.
దీని ప్రాథమిక లక్ష్యం ఇండో-చైనా సరిహద్దులో రహస్య కార్యకలాపాలను నిర్వహించడం. ముఖ్యంగా 1962లో, చైనా-భారత యుద్ధంతో సహా చైనాతో ఏర్పడిన కాన్ఫ్లిక్ట్స్ కారణంగా దీన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
1959 టిబెటన్ తిరుగుబాటు తర్వాత, భారతదేశం దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పుడు రెండు దేశాల మధ్య బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. 1960-1962లో ప్రతిపాదిత చైనీస్ దౌత్య ఒప్పందాలను ఇండియా రేఫ్యూజ్ చేసింది. దీంతో చైనీస్ మిలిటరీ యాక్షన్ మరింత అగ్రెసివ్ గా మారింది. సరిగ్గా అదే సమయంలో, US అండ్ UK వంటి అగ్ర దేశాలు మనదేశానికి అడ్వాన్స్డ్ వెపన్స్ ని అమ్మడానికి నిరాకరించాయి, సైనిక సహాయం కోసం సోవియట్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.
సరైన సమయానికి సరైన మిలిటరీ పవర్ లేకపోవటంతో సరిహద్దు చొరబాట్లను అరికట్టడంలో భారత్ విఫలమైంది. చైనాతో ఉద్రిక్తతల సమయంలో ఇతర దేశాల నుండి సరైన సపోర్ట్ లేకపోవడంతో భారతదేశం తీవ్ర నిరాశను ఎదుర్కొంది. అప్పుడే ఇండియా డిసైడ్ అయింది చైనాకి ఎగైనెస్ట్ గా బోర్డర్ ఏరియాస్ లో కోవర్ట్ ఆపరేషన్స్ కండక్ట్ చేయటానికి ఒక స్పెషల్ యూనిట్ కావాలని. అందుకే SFF వంటి డెడికేటెడ్ ఫోర్స్ ని రెడీ చేసింది.
వాస్తవానికి SFF ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయిన RAW క్రింద పని చేస్తుంది. అంతేకాకుండా, కేబినెట్ సెక్రటేరియట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్స్ అందిస్తుంది.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ట్రైనింగ్ విషయానికొస్తే… ఇక్కడ కమాండోలు గెరిల్లా వార్‌ఫేర్, రాక్ క్లైంబింగ్, ఎయిర్ ఆపరేషన్స్ వంటి వాటిలో శిక్షణ పొందుతారు. ఇండో-చైనా యుద్ధ సమయంలో, ఈ కమాండోలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పారాట్రూపులుగా శిక్షణ పొందారు.
SFFకి చెందిన వాలంటీర్లకి 6 మంత్స్ ట్రైనింగ్ పిరియడ్ ఉంటుంది. ఇందులో 6 బెటాలియన్ గ్రూపులు ఉంటాయి. ఒక్కో బెటాలియన్‌లో 800 మంది సైనికులు ఉంటారు.
ఇప్పటివరకూ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ 1984లో లడఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి “ఆపరేషన్ మేఘదూత్” పేరుతో ఓ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో 1,000 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి పాకిస్థాన్ పై విజయం సాధించారు. 1971లో, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో పాకిస్థాన్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా “ఆపరేషన్ ఈగిల్” పేరుతో చేసిన హైలీ సీక్రెటివ్ మిషన్. 1999లో, కార్గిల్ వద్ద జరిగిన ఆపరేషన్ విజయ్. 1984లో, “ఆపరేషన్ బ్లూ స్టార్” పేరుతో పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ లో అల్లర్లు చేపట్టిన మిలిటెంట్ గ్రూప్ ని ఎలిమినేట్ చేయటానికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఆదేశించిన మిలిటరీ ఆపరేషన్. 1971లో, సరిహద్దు భూభాగంలో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం. 2020లో, గాల్వాన్ లోయలో జరిగిన “ఆపరేషన్ స్నో లెపార్డ్”.
Defend the Unseen అని చెప్పబడే ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు త్యాగం భారతదేశ సైనిక చరిత్రలో వారికి గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాయి. అశోక్ చక్ర, పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, వీర చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్ వంటి శౌర్య పురస్కారాలను సంపాదించిపెట్టాయి. ఒక్కమాటలో చెప్పాలంటే,”Victory Through Courage and Determination” అనే మోటోని వీళ్ళు ఫాలో అవుతుంటారు.
చివరిమాట
ఇండియన్ ఎలైట్ ఫోర్సెస్ అయిన ఈ పారా కమాండోస్, మార్కోస్, గరుడ్, NSG, అండ్ SFF అనేవి అచంచలమైన ధైర్యం, బలం, మరియు త్యాగం కలిగి ఉంటాయి. మనకి వారి ధైర్యం స్ఫూర్తినిస్తుంది; బలం భరోసానిస్తుంది; త్యాగం గర్వాన్నిస్తుంది. ఫైనల్ గా వీరిని మన దేశానికి అల్టిమేట్ గార్దియన్స్ గా చెప్పుకోవచ్చు.
So, let us salute our super heroes.