Most Dangerous Places on Earth,

Top 15 Most Dangerous Places on Earth

ప్రమాదం అనేది ఎటునుంచీ అయినా పొంచి ఉండొచ్చు. తర్వాతి నిముషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెలియక ప్రమాదం జరిగితే ఏం చేయలేం. కానీ, తెలిసి తెలిసి ప్రమాదాలను ఎవ్వరూ కొని తెచ్చుకోరు. మరలాంటిది ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయని తెలిస్తే, మనం ఆ చుట్టుపక్కలకి కూడా వెళ్ళం. 

ఈ భూమిపైన మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎలా అయితే ఉన్నాయో… మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ కూడా అలానే ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి గనుక వెళ్ళామో… ఇక అంతే! తిరిగిరావటమనేది ఉండదు. అయితే, అలాంటి డేంజరస్ ప్లేసెస్ అనేవి ఐలాండ్స్, మౌంటైన్స్, వ్యాలీస్, వాల్కెనోస్, ఐస్ బర్గ్స్, ఫారెస్ట్స్, డిజర్ట్స్, ల్యాండ్స్, లేక్స్, ఇంకా ఏవైనా కావచ్చు. మరి ఈ భూమ్మీద ఉన్న అలాంటి డేంజరస్ ప్లేసెస్ లో 15 మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ గురించి ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాం. అవేంటో మీరే చూడండి. 

రామ్రీ ఐలాండ్

రామ్రీ ఐలాండ్ మయన్మార్ లోని రాఖైన్ స్టేట్ కోస్ట్ లో ఉన్న లార్జెస్ట్ ఐలాండ్. ఇది 1,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద ద్వీపం. ఈ ఐలాండ్ లో మొసళ్లు ఎక్కువగా జీవిస్తాయి. తెలియక ఎవరైనా ఈ ఐలాండ్ లో అడుగుపెడితే మొసళ్ళకి బలవ్వాల్సిందే! అందుకే ఈ ఐలాండ్ ని “మోస్ట్ యానిమల్ విక్టిమ్ ఐలాండ్” అని అంటారు. 

ఈ ఐలాండ్ లో ఉండే సాల్ట్ వాటర్ లో నివసించే మొసళ్లు జనాలపై దాడి చేసి చంపేవట. సెకండ్ వరల్డ్ వార్ టైమ్ లో బ్రిటిష్ మరియు జపనీస్ సోల్జర్స్ మధ్య జరిగిన బ్యాటిల్ లో 400 మందికి పైగా  జపనీస్ సోల్జర్స్ చనిపోవటంతో, మిగిలినవారంతా బ్రిటిష్ సోల్జర్స్ నుండీ తప్పించుకొని ఈ ఐలాండ్ గుండా పారిపోవటానికి ప్రయత్నించారు. అలా వెళ్ళిన జపనీస్ లో 900 మందిపై మొసళ్లు దాడి చేసి చంపేసి వారిని ఆహారంగా పంచుకున్నాయట. 20 మంది మాత్రం ఈ దాడినుండి ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఈ డిజాస్టర్ “వరల్డ్స్ మోస్ట్ వరస్ట్ క్రోకోడైల్ డిజాస్టర్” గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కింది. అందుకే ఈ ఐలాండ్ “వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ప్లేస్” గా పిలవబడుతుంది.

మౌంట్ వాషింగ్టన్ పీక్

మౌంట్ వాషింగ్టన్ పీక్ అనేది నార్త్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న వైట్ మౌంటెన్. ఇది మిస్సిస్సిప్పి నదికి తూర్పున 6,288.2 అడుగుల ఎత్తైన శిఖరం. ఈ మౌంటెన్ పై ఎప్పుడూ ఒకే రకమైన వాతావరణం ఉండదు. క్షణ క్షణానికీ మారిపోతుంటుంది. అంతేకాక ఇది మోస్ట్ కోల్డెస్ట్ ప్లేస్ కూడా.

మౌంట్ వాషింగ్టన్ సమ్మిట్ పై గంటకు 203 మైళ్ళు అంటే, గంటకు 327 కిలోమీటర్ల స్పీడ్ తో బలమైన గాలులు వీస్తాయి. అందుకే భూ ఉపరితలంపై అత్యంత వేగవంతమైన గాలులు కలిగిన ప్రదేశంగా ఇది  ప్రపంచ రికార్డుకెక్కింది. ఇంకా ఇక్కడ గడ్డకట్టే ఉష్ణోగ్రతలు −40 డిగ్రీల వరకు పడిపోతాయి. హెవీ స్నో ఫాల్స్ కంటిన్యూగా ఉంటుంటాయి. ఈ విధమైన టెంపరేచర్ మౌంట్ వాషింగ్టన్‌ని చాలా డేంజరస్ ప్లేస్ గా  మారుస్తాయి. అంతేకాక, ఇది  వరల్డ్స్ డెడ్లీయెస్ట్ పీక్స్ లో ఒకటి. 

నార్త్ సెంటినెల్ ఐలాండ్ 

నార్త్ సెంటినెల్ ఐలాండ్ బే అఫ్ బెంగాల్ లో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉంది. ఇక్కడ సెంటినెలెస్ అనే ట్రైబల్స్ నివసిస్తున్నారు. వీళ్ళు దాదాపు 6000 సంవత్సరాలనుండీ బాహ్య ప్రపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేకుండానే బతికేస్తున్నారు. అంతేకాదు, ఈ ద్వీపంలో ఉండే గిరిజనులు బయటి వ్యక్తులకు అలవాటుపడరు అలాగే టూరిస్టులు ఎవరైనా తమ ద్వీపంలో అడుగు పెడితే, వారిని చంపేస్తారు. దీనికి కారణం వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల కొత్తవాళ్ళు ఎవరైనా వస్తే, వైరల్ డిసీజెస్ వస్తాయని భయం. 

2006 లో ఇద్దరు ఫిషర్ మెన్స్ చేపలు పడుతూ, పొరపాటుగా ఈ ఐలాండ్ లోకి వెళ్ళిపోయారు. దీంతో వెంటనే ఆ ట్రైబల్స్ వాళ్ళని ఎటాక్ చేసి, రాళ్ళతో కొట్టి చంపేశారు. వీరిలా చేయటం టూరిస్ట్ లకి చాలా ప్రమాదమని భావించి, ఇండియన్ గవర్నమెంట్ దీనిని మోస్ట్ డేంజరస్ ప్లేస్ గా డిక్లేర్ చేసింది.

స్నేక్ ఐలాండ్

స్నేక్ ఐలాండ్ లేదా క్యూమాడా గ్రాండే ఐలాండ్ బ్రెజిల్ తీరంలోని అట్లాంటిక్ ఓషన్ మధ్య ఉన్న ఓ చిన్న దీవి. ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే మన ప్రాణం పోతుంది. కారణం ఈ ఐలాండ్ మొత్తం పాములతో నిండి ఉండటమే! అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. 

ఒకప్పుడు ఇక్కడ దాదాపు 1 లక్ష దాకా స్నేక్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం కేవలం 4000 మాత్రమే ఉన్నాయి. ఈ ఐలాండ్ లో ఒక్కో స్క్వేర్ మీటర్ కి ఐదు పాములు చొప్పున కనిపిస్తాయి. ఇక్కడ ఉండే స్నేక్స్ బైట్ కి రిమెడీ ఈ ప్రపంచంలోనే లేదు. అంతేకాదు, మోస్ట్ పాయిజనస్ స్నేక్ గా చెప్పుకొనే గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ కూడా ఈ ఐలాండ్ లోనే కనపడుతుంది. దీని విషం మనిషి మాంసాన్ని కూడా కరిగించేయగలదు. కాకపోతే, ఈ స్నేక్స్ మనుషులపై అంత త్వరగా ఎటాక్ చేయవు. అందుకే బ్రిజిల్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ కి రావటానికి ఎవ్వరికీ పర్మిషన్ ఇవ్వదు. అందుకే ఈ ఐలాండ్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ గా రికగ్నైజ్ చేయబడింది.

ఇది కూడా చదవండి: Unexplained Himalayan Natural Phenomena

డెత్ వ్యాలీ

డెత్ వ్యాలీ కాలిఫోర్నియా మరియు నెవాడా సరిహద్దులో ఉండే డిజర్ట్ వ్యాలీ. ఇది ప్రపంచంలోని హాటెస్ట్ ప్లేసెస్ లో ఒకటిగా పిలువబడుతుంది. నార్త్ అమెరికాలోనే మోస్ట్ డీపెస్ట్ ప్లేస్ అయిన ఈ డెత్ వ్యాలీ సముద్ర మట్టానికి 282 అడుగుల లోతున ఉంటుంది. ఇది అత్యంత పొడిగా, మరియు వేడిగా ఉండే ప్రదేశం. ఇక్కడ వేసవిలో భారీగా ఏర్పడే సాల్ట్ ప్లేట్స్ ని చూసేందుకు టూరిస్టులు విపరీతంగా వస్తుంటారు. సమ్మర్ లో ఇక్కడ టెంపరేచర్ పీక్స్ కి చేరుకుంటుంది. ఇక్కడ మోస్ట్ హైయెస్ట్ టెంపరేచర్ 56.7° సెంటీగ్రేడ్. 

డెత్ వ్యాలీలో టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోవటానికి కారణం ఆకాశాన్ని అందుకోనేలా 3000 మీటర్లకు పైగా ఎత్తున్న పర్వతాలు. తుఫానులు ఏర్పడినప్పుడు వాటర్ మొత్తం ఆ పర్వతాల మద్య ఉండే లోయలోకి వెళ్లి  ఆకస్మిక వరదలను కలిగిస్తాయి. ఇక ఇక్కడ ఉండే హై టెంపరేచర్ కి ఆ వాటర్ తోడైనప్పుడు హాట్ విండ్స్ ఏర్పడతాయి. అందువల్ల ఇక్కడికి ఎవరైనా వెళ్ళినా వాటర్ లేకుండా, 14 గంటలు మాత్రమే జీవించగలరు. అందుకే ఇది మోస్ట్ హాటెస్ట్ ప్లేసెస్ లో ఒకటిగా నిలిచింది.

ఇజు ఐలాండ్స్

ఇజు ఐలాండ్స్ డి వ్రీస్ అనే ఐలాండ్స్ గ్రూప్.  జపాన్లోని హోన్షోలోని ఇజు ద్వీపకల్పం నుండి దక్షిణ మరియు తూర్పున విస్తరించి ఉన్న అగ్నిపర్వత ద్వీపాల సమూహం ఇది. జపనీస్ భాషలో సాధారణంగా “సెవెన్ ఐలాండ్స్ ఆఫ్ ఇజు” అని పిలువబడుతున్నప్పటికీ, వాస్తవానికి డజనుకు పైగా ఐలాండ్స్  మరియు ఐలెట్స్ ఉన్నాయి. వాటిలో తొమ్మిది ఐలాండ్స్ లో మాత్రమే ప్రస్తుతం ప్రజలు నివసిస్తున్నారు.

ఈ దీవుల్లో 2 సిటీస్, 6 విలేజెస్ ఉన్నాయి. ఇక ఈ ఐలాండ్ మొత్తం గాలిలో ఘోరమైన సల్ఫర్‌తో నిండి ఉంది. దీనివల్ల అక్కడ నివసించేవారంతా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తారు. గాలిలో ప్రమాదకరమైన సల్ఫర్ భారీ మొత్తంలో ఉన్నప్పటికీ, ప్రజలు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. సల్ఫర్ టాక్సిన్ స్థాయికి చేరుకున్నప్పుడల్లా ఇక్కడ నివసించేవారిని అప్రమత్తం చేయడానికి ప్రత్యేకమైన సైరన్ అలారం ఉంది. అందుకే ఇది డేంజర్ ప్లేస్ గా రికార్డుకెక్కింది.

బెర్ముడా ట్రయాంగిల్

బెర్ముడా ట్రయాంగిల్ ని డెవిల్స్ ట్రయాంగిల్ లేదా హరికేన్ అల్లే అని కూడా పిలుస్తారు. ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్ లోని వెస్ట్రన్ పార్ట్ లో ఉంది. ఇక్కడ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా మిస్టీరియస్ గా అదృశ్యమయ్యాయి. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ అంటే, కొందరు అదృశ్య శక్తి అని.. కొందరు ఏలియన్స్ ఉండే ప్రాంతం అని.. ఇంకొందరు ఇక్కడ ఎర్త్ మ్యాగ్నెటిక్ పవర్ ఉండదని.. మరికొందరు ఈ ప్రాంతానికి రాగానే కంపాస్  పని చేయదని.. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారు. 

ఇక ఈ ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు కానీ నిజానికి ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉండదు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరం, శాన్ యువాన్, ఫోర్టిరికో  మధ్యలో ఉన్న దీవి ఈ బెర్ముడా. ఎక్కువ ప్రమాదాలు బాహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలోనే జరిగాయి. బెర్ముడా ట్రయాంగిల్ ఇంత మిస్టీరియస్ ప్లేస్ గా మారటానికి కారణం  అక్కడికి వెళ్లిన 75 ఎయిర్ క్రాఫ్ట్స్, వందలాది ఓడలు, ఇంకా లెక్కలేనన్ని  హెలీ కాప్టర్లు  ఇలా ఏవైనా సరే అదృశ్యమయిపోవడమే! 

ఇది ఇప్పుడు మొదలైనది కాదు, కొన్ని శతాబ్దాలుగా అంతుచిక్కని మిస్టరీగానే కొనసాగుతోంది. దీనికి కారణం గంటకు 170 మైళ్ల వేగంతో కదిలే కిల్లర్ క్లౌడ్స్ ఎయిర్ బాంబ్ తరహాలో తయారవుతాయి. సముద్రంలో అలలు 100 అడుగుల ఎత్తువరకు ఎగసిపడుతుంటాయి. దీంతో ఆ ఏరియాకి వచ్చిన వాటిని సముద్రం తనలోకి లాగేసుకుంటుంది. అలాగే ఇక్కడ వాటర్  అడుగు భాగం నుంచి పెద్దఎత్తున మిథేన్ వెలువడుతోందని, దీనికి ఉన్న మండే స్వభావం వల్ల భారీ పేలుళ్లు జరుగి, దాదాపు 150 అడుగుల లోతైన బిలాలు ఏర్పడుతున్నాయని, ఓడలు గానీ విమానాలు గానీ  ఆ బిలాల లోపలికి వెళ్లిపోతున్నాయని గుర్తించారు. అందుకే ఈ ప్లేస్ డేంజర్ జోన్ గా మారింది.

స్కెలిటెన్ కోస్ట్ 

స్కెలిటెన్ కోస్ట్ అనేది అట్లాంటిక్ తీరానికి నార్త్ సైడ్ ఉన్న నమీబియాకి, సౌత్ సైడ్ ఉన్న అంగోలాకి మద్యన ఉంది. ఇది కునేన్ నది నుండి స్వాకోప్ నది వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతమంతా నమీబియా ఎడారి తీరంలో ఉండటం వల్ల చాలా హార్ష్ క్లైమేట్ ఉంటుంది. అందుకే ఇక్కడ జీవులనేవి బతకటం చాలా కష్టం. ఇక్కడ ఉండే కఠినమైన వాతావరణం కారణంగా ఈ ఏరియా ఎర్త్ పై ఉన్న మోస్ట్ డెడ్లియెస్ట్ ప్లేసెస్ లో ఒకటిగా నిలిచింది. 

అట్లాంటిక్ ఓషన్లోని చల్లని నీటితో, నమీబ్ ఎడారి యొక్క వెచ్చని పొడి గాలి తోడవటంతో సముద్రం మీద దట్టమైన పొగమంచును ఏర్పడుతుంది. దీంతో ఈ సముద్రంలో ప్రయాణించే ఓడలు  ప్రమాదానికి గురవుతాయి. ఇక ఇక్కడి వాతావరణంలో ఉండే వేడి గాలులు, ఆహారం దొరకకపోవటం, మరియు నీరు లేకపోవడం వల్ల ఈ ప్రాంతమంతా రకరకాల జంతువుల ఎముకలతో నిండి ఉంటుంది. ఒకపక్క కఠినమైన వాతావరణం… మరోపక్క నీరు లేకపోవడం… కలిసి ఈ తీరంలో జీవించడాన్ని కష్టతరం చేస్తుంది, అందుకే ప్రతిచోటా స్కెలిటెన్సే కనిపిస్తుంటాయి. ఇంకా మునిగిపోయిన షిప్ రెక్స్ , హ్యూమన్ డెడ్ బాడీస్ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. అందుకే ఈ స్కెలిటెన్ కోస్ట్ విజిట్ చేయటానికి ఎవరైనా టూరిస్టులు వెళితే, చూడటానికి చాలా డేంజరస్ గా కనిపిస్తుంది.

దానకిల్ ఎడారి

దానకిల్ ఎడారి ఆఫ్రికా దేశంలోని నార్త్ ఈస్ట్ ఇథియోపియా, సౌత్ ఎరిట్రియా మరియు నార్త్ వెస్ట్ జిబౌటిలలో ఉన్న అఫర్ ట్రయాంగిల్‌లో ఉన్న ఎడారి. ఇది 136,956 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.

ఈ డిజర్ట్ ఎంత డేంజరస్ అంటే… ఊపిరి పీల్చుకోవటానికి కావాల్సిన ఆక్సిజన్ అసలు ఉండనే ఉండదు. ఇక్కడి ఎయిర్ మొత్తం సల్ఫర్ గ్యాస్ తో పొల్యూట్ అయి ఉంటుంది. కాబట్టి ప్రజలు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంటారు. అదికూడా సాల్ట్ మైనింగ్ చేసేవాళ్ళు మాత్రమే  ఇక్కడ ఉంటుంటారు. ఇంకా ఈ ప్రాంతంలో వాల్కేనోస్ ఎక్కువగా ఉండటం వల్ల  హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. డే టైమ్ టెంపరేచర్ 50° C వరకూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక అంగుళం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అందుకే చాలా మంది ప్రజలు ఈ భయంకరమైన స్థలాన్ని భూమీపై ఉన్న నరకంగా చెప్తారు. అంతేకాకుండా దీన్ని మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ లిస్ట్ లో కూడా  చేర్చారు. 

మాడిడి నేషనల్ పార్క్

మాడిడి నేషనల్ పార్క్ బొలీవియా దేశంలో ఉంది. ఈ పార్క్ వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అయిన అమెజాన్ రివర్ బేసిన్ లో ఉంది. దీని విస్తీర్ణం 18,958 చదరపు కిలోమీటర్లు. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ పార్క్… నిజానికి మోస్ట్ డేంజర్ ప్లేస్. ఎందుకంటే, ఇక్కడ వరల్డ్స్ మోస్ట్ పాయిజనస్ యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఉంటాయి. అలాగే, ఈ పార్క్ లో పెరిగే ఏదైనా మొక్కని పొరపాటున తాకితే భయకరమైన దురద, దద్దుర్లు, ఇంకా నెమ్మదిగా స్పృహ కోల్పోవటం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా, శరీరంపై ఎక్కడైనా చిన్న కోత గానీ, గాయం గానీ ఉన్నా… అక్కడ ఉండే బ్యాక్టీరియా వల్ల ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఇంత ప్రమాదకరమైన పార్క్ కాబట్టే… టూరిస్టులు ఈ ప్లేస్ ని విజిట్ చేయటానికి గవర్నమెంట్ ఏ విధమైన పర్మిషన్ ఇవ్వదు. అందుకే ఎర్త్ పై ఉన్న మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ లిస్ట్ లో ఇది కూడా చేరింది.

ఇది కూడా చదవండి: Uncovering the Secrets of Kumari Kandam’s Lost City

లేక్ నాట్రాన్

లేక్ నాట్రాన్  ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. అక్కడి నీటిని తాకిన ప్రతి జీవి శిలగా మారిపోతుంది. ఈ సరస్సు అందాలని క్యాప్చర్ చేయటానికి అక్కడికి వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్.. నీటిని తాకగానే అక్కడికక్కడే శిలలైపోతున్న పక్షులను చూసి షాకయ్యాడు. తనకు కనిపించిన ప్రతి జీవి ఫోటోని తన కెమెరాలో బంధించాడు. ఈ లేక్ వాటర్ ని తాకిన ప్రతి జీవి కళ్ళు, శరీరం కాలిపోయి… శరీరం శిలగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతన ఆయన తీసిన ఫొటోస్ లో కనిపిస్తుంది. ఈ ఫోటోస్ అన్నీ “అక్రాస్‌ ది రవగేడ్‌ ల్యాండ్‌” అనే బుక్ లో పొందుపర్చాడు. 

ఇక ఈ లేక్ ఇంత డేంజర్ గా మారడానికి కారణం దాని దగ్గర ఉన్న వాల్కెనోనే కారణం. వాల్కెనో కిందనే ఈ లేక్ ఉండటంతో దాని నుంచి వచ్చిన సోడియం కార్బోనేట్‌, సోడియం బై కార్బోనేట్‌లు డైరెక్ట్ గా వాటర్ లో కలుస్తున్నాయి. దీని ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా ఈ లేక్ లో వాటర్  రెడ్ కలర్ లో ఉంటుంది. ఇక సరస్సులోని నీరు ఎప్పుడూ 60° C వేడితో ఉంటుంది. ఈ ప్లేస్ ఫ్లెమింగో పక్షులకు సంతానోత్పత్తి ప్రదేశం. ఏటా కొన్ని వేల ఫ్లెమింగో పక్షులు ఇక్కడికి వస్తాయి. అయితే, ఈ లేక్ నాట్రాన్ చాలా జంతువులకు భూమిపై ఉన్న నరకంలా ఉంటుంది. అందుకే ప్రపంచంలోని డేంజరస్‌ ప్రాంతాల్లో ఒకటిగా టాంజానియాలోని ఈ సరస్సును కూడా ప్రకటించారు.

అఫర్ ట్రయాంగిల్/అఫర్ డిప్రెషన్

అఫర్ ట్రయాంగిల్ లేదా అఫర్ డిప్రెషన్ అనేది తూర్పు ఆఫ్రికాలోని గ్రేట్ రిఫ్ట్ లోయలో భాగమైన ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ వల్ల ఏర్పడిన జియోలాజికల్ డిప్రెషన్. ఇది రెడ్ సీ బోర్డర్ లో ఉంది. ఈ ట్రయాంగిల్ ఎరిట్రియా, జిబౌటి మరియు ఇథియోపియా యొక్క బార్డర్స్ ని కలుపుతూపోతుంది. దీనికి నార్త్ సైడ్ లో దానకిల్ అనే డిజర్ట్ ఉంది. 

ఇది భూమిపైనున్న మోస్ట్ హాటెస్ట్ ప్లేస్. సమ్మర్ సీజన్లో, వాల్కనిక్ యాక్టివిటీ వల్ల కలిగే జియోథర్మల్ హీట్ వల్ల టెంపరేచర్ 55 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. ప్రమాదకరమైన ఈ ప్రాంతం యొక్క ప్రధాన లక్షణం ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడమే! ఇక్కడి గాలి విషవాయువులతో నిండి ఉంటుంది. ఇథియోపియాలోని అఫర్ రీజియన్‌లోని ఎర్టా ఆలే అగ్నిపర్వతం ఈ భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటి. చిన్న చిన్న భూకంపాలు నిరంతరం ఈ ప్రాంతాన్ని వణికిస్తుంటాయి. అనేక లోతైన అగాధాలను ఏర్పరుస్తాయి. ఎర్టా ఆలే దాని శిఖరాగ్రంలో రెండు లావా సరస్సులను కలిగి ఉన్నందున ఇది జరుగుతుంది. వాటిలో లావా పరిమాణం నిరంతరం మారుతూ ఉంటుంది, దీనివల్ల భూమి ఉపరితలం పైకి క్రిందికి షేక్ అవుతూ ఉంటుంది.

బికిని అటోల్ 

బికిని అటోల్ పసిఫిక్ ఓషన్లో హవాయి మరియు ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న  మార్షల్ ఐలాండ్స్ లో ఉంది. సముద్రంలో ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే  ఈ ఐలాండ్ చూడటానికి స్వర్గంలా కనిపిస్తుంది. అటోల్‌ అంటే, మధ్యలో నీరు, చుట్టూ పగడపు దిబ్బలు, ఇసుక మేటలున్న ద్వీపపు మడుగులు.  ఇవి చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ అటోల్స్ పసిఫిక్‌ మహాసముద్రంలో ఎక్కువగా ఏర్పడతాయి. 

అయితే, ఈ బికిని అటోల్‌లో చాలా తక్కువమంది ట్రైబల్స్ నివసిస్తుంటారు. న్యూక్లియర్‌ రీసెర్చ్‌ కోసం ఈ అటోల్స్‌ని ఉపయోగిస్తుంటారు.  అమెరికా ఇప్పటివరకూ 23 న్యూక్లియర్‌ టెస్ట్‌లు దీనిపై నిర్వహించింది. అందుకే, ఇంత అందమైన దీవికూడా రేడియేషన్ తో నిండిపోయింది. దీంతో అక్కడ ఉండే ట్రైబల్స్ ఆ ప్లేస్ ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఇప్పటికీ  ఇది జీవులకు ప్రమాదకరంగానే ఉంది. ఇక్కడ రికార్డైన టెంపరేచర్ లో రేడియేషన్ ఎక్కువగా ఉండటంతో క్యాన్సర్‌కి కారణమవుతుంది. దీంతో  రాబోయే 10 సంవత్సరాలదాకా ఈ ద్వీపంలో నివసించడం అసాధ్యమని తేల్చింది. దీంతో ఈ ప్రాంతమంతా డేంజర్ జోన్ గా మారింది.

గేట్స్ ఆఫ్ హెల్

గేట్స్ ఆఫ్ హెల్ అనేది తుర్క్మెనిస్తాన్లో ఉన్న మండుతున్న ఒక గ్యాస్ బిలం. దీని పేరు చెపితే చాలు… అక్కడి ప్రజలు హడలెత్తిపోతారు. అందుకే దీన్ని “హెల్ డోర్” లేదా “డోర్ టు హెల్” అంటారు. అంటే “నరకద్వారం” అని అర్ధం.  కరాకుమ్ ఎడారిలో ఉన్న 70 మీటర్ల వెడెల్పు, 20 మీటర్ల లోతులో ఉండే ఈ బిలం… 40 ఏళ్ళనుంచి నిరంతరాయంగా మండుతూనే ఉంది. దీంతో ఈ బిలం టూరిస్టులని, ఎక్స్ ప్లోరర్స్ ని  ఎంతగానో ఆకర్షిస్తోంది. 

1971 లో సోవియట్ జియాలజిస్టులు కరాకుమ్ ఎడారిలో నేచురల్ గ్యాస్ తో నిండిన అండర్ గ్రౌండ్ పిట్ ని కనుగొన్నారు. అందులో ఉన్న నేచురల్ గ్యాస్, మరియు  మీథేన్  వ్యాప్తి చెందకుండా ఉండటానికి దీనికి నిప్పంటించారు. దీంతో అప్పటినుండీ ఇప్పటివరకూ మండుతూనే ఉంది. అందుకే ఇది ఎర్త్ పై ఉన్న మోస్ట్ డేంజరస్ ప్లేస్.

సినాబంగ్ అగ్నిపర్వతం

మౌంట్ సినాబంగ్ ఇండోనేషియాలోని సుమత్రాలో దీవుల్లో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ వాల్కెనో. ఇక్కడ విస్ఫోటనాలు చాలా తరచుగా జరుగుతుంటాయి. దీంతో తరచుగా వేలాది మందికి షెల్టర్ లేకుండా పోతుంది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఇప్పటికే చాలాసార్లు లావా మరియు బూడిదలో కప్పబడి ఉన్నాయి. ఈ వాల్కెనో 2010, 2013, 2014 మరియు 2015, రీసెంట్ గా 2016 లో ఎక్స్ ప్లోడ్ అయింది. 

ఆ విస్ఫోటనం సమయంలో వచ్చే గ్యాస్, యాష్, స్టోన్స్ కలిసి  2,500 మీటర్ల ఎత్తులో మేఘాలని ఏర్పరుస్తాయి. 7 కిలోమీటర్ల ఎత్తైన మందపాటి బూడిదని ఆకాశంలోకి చిమ్ముతుంది. దీనివల్ల అగ్నిపర్వతం సమీపంలో నివసిస్తున్న వారికి లావా వరదలు, బూడిద వర్షాలు కురుస్తాయి. ఇక్కడ ఉన్న ఈ డేంజరస్ సిట్యుయేషన్ వల్లనే ఈ ప్లేస్ ఎర్త్ పై ఉన్న డేంజరస్ ప్లేసెస్ లో ఒకటిగా మిగిలింది

చివరిమాట 

భూమిపై ఉన్న ఈ మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ గురించి విన్నప్పుడు మనకెంతో క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి. కానీ, ఇలాంటి ప్లేసెస్ గురించి విన్నప్పుడు అలాంటి చోటికి వెళ్లకుండా జాగ్రత్త పడటమే కాకుండా వీలైనంత వరకూ ఈ సమాచారాన్ని ఇతరులకి షేర్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top