ఈ మధ్యకాలంలో యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్నిటిని చూసి నవ్వుకుంటాం, ఇంకొన్నిటిని చూసి సర్ప్రైజ్ అవుతుంటాం, మరికొన్నిటిని చూసి సింపతీ చూపిస్తుంటాం. అయితే, ఈ వీడియోలో ఎవర్ని చూసి సింపతీ చూపించాలో మీరే డిసైడ్ చేసుకోండి.
వివరాల్లోకి వెళ్తే… జాంబియా సఫారీలోని ఓ నీటి కొలనులో నీరు తాగేందుకు ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. ఏనుగులన్నీ నీరు తాగుతుండగా… నీటి లోపల ఒక మొసలి కాపు కాచింది. దాని టార్గెట్ మొత్తం ఆ గుంపులోని ఒక గున్న ఏనుగుపైనే ఉంది. ఇంతలో అదునుచూసి ఆ గున్న ఏనుగుని నీటిలోకి లాక్కెళ్లేందుకు విఫలయత్నం చేసింది.
నిజానికి నీటిలో ఉన్నంత వరకు మొసలిని ఢీకొట్టడం ఏ జంతువుకూ సాధ్యం కాని పని. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ గున్న ఏనుగు తృటిలో తప్పించుకుని ఒడ్డుకి వచ్చేసింది. దీంతో తల్లి ఏనుగు ఆ నీటి కుంటలోకి దిగి… మొసలితో తలపడింది. తన బిడ్డనే పొట్టన పెట్టుకోవాలని చూసిన ఆ మొసలిని అంతమొందించటమే టార్గెట్ గా పెట్టుకొని పోరాడింది. చివరికి ఏనుగు దెబ్బకి మొసలి ప్రాణాలు విడిచింది.
సఫారీకి వెళ్ళిన ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి ఏనుగు చేసిన సాహసం అమోఘమంటూ కామెంట్లు పెడుతున్నారు.