Mother Throws her Baby in a Bear Enclosure

కన్న బిడ్డని ఎలుగుబంటికి ఎరగా వేసిన కసాయి తల్లి (వీడియో)

ఓ తల్లి తన కన్న బిడ్డని ఎలుగుబంటికి ఎరగా విసిరేసింది. ఏమైందో… ఏమో… తెలియదు కానీ, నిర్దాక్షిణ్యంగా తన పాపని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌ లోకి విసిరేసింది. 

ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో ఉన్న ఓ జూకి అందరు పర్యాటకుల లానే ఓ మహిళ కూడా తన మూడేళ్ల పాపతో వచ్చింది. బేర్ ఓపెన్‌ ఎన్‌క్లోజర్‌ వద్ద నిల్చొని ఎలుగుబంటిని పాపకు చూపిస్తుంది. 

ఇంతలో ఒక్కసారిగా ఆ చిన్నారిని పైకెత్తి… ఎలుగుబంటి ముందుకి విసిరేసింది. దీంతో పక్కన ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  పెద్దగా కేకలు వేయటంతో…   జూ నిర్వాహకులు అసలు విషయం తెలసుకుని… సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లిపోయారు. అనంతరం ఆ పాపని రక్షించి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. 

అదృష్టవశాత్తూ, ఆ చిన్నారి చిన్న చిన్న గాయాలతో గాయాలతో బయటపడింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సిసి టీవీ కెమెరాల్లో రికార్డైంది. 

అయితే, ఆ తల్లి ఉద్దేశపూర్వకంగానే బిడ్డని విసిరేసిందా..! లేక ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదా..! అనేది తెలియట్లేదు. కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top