హిస్టరీ పేజీల్లో నుంచీ బయటపడిన మరో మిస్టరీ పూరీ జగన్నాధుని రత్న బండార్. ఇది పూరీ ఆలయంలో ఉన్న మిస్టీరియస్ రూమ్. విచిత్రం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఈ సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, వందల ఏళ్లుగా భూస్థాపితమైన ఆ మిస్టరీని రివీల్ చేస్తే ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుందట. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి? ఆ సీక్రెట్ రూమ్ లో ఏముంది? అది ఓపెన్ చేస్తే ప్రపంచానికి వచ్చిన ముప్పు ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
రత్న భండార్ అంటే ఏమిటి?
మన దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఆయన మనవడు అయినటువంటి అనంగ భీమ్ దేవ్ పాలనలో ఆలయంలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో ఉండే ప్రధాన దేవతలు. కృష్ణుని ఆరాధించేవారికి ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం.
ఈ క్షేత్రంలో పూజలందుకొనే కృష్ణుడిని జగన్నాథుడిగా పిలుస్తుంటారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అలాంటి ఈ ఆలయానికి నార్త్ సైడ్ ఉన్న బేస్‌మెంట్‌లో రత్న భండార్ ఉంది. ఈ రత్న భండార్ లో ‘భితర్ భండార్’, ‘బాహర్ భండార్’ అనే రెండు గదులు ఉన్నాయి.
‘బాహర్ భండార్’ ని ‘అవుటర్ ట్రెజరీ’ అంటారు. ఉత్సవాలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో దేవుడి విగ్రహాలని అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం ఈ బాహర్ భండార్‌ను తరచూ తెరుస్తుంటారు.
‘భీతర్ భండార్’ ని ‘ఇన్నర్ ట్రెజరీ’ అంటారు. రాజులు పెద్దయెత్తున విరాళంగా ఇచ్చిన బంగారు ఆభరణాలు, కిరీటాలు, రత్నాలు, వజ్రవైడూర్యాలు ఇలా వెలకట్టలేనంత అపార సంపద ఇక్కడ ఉంది. వీటితోపాటు సాధారణ భక్తులు సమర్పించుకొనే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలను కూడా ఈ భండార్‌లోనే భద్రపరుస్తూ వచ్చారు.
బాహర్ భండార్ ని ఎప్పుడూ తెరుస్తూనే ఉంటారు. కానీ, భీతర్ భండార్ ని తెరచి 40 ఏళ్లకుపైనే అవుతోంది. అత్యంత రహస్యమైనదీ, అంతులేని సంపదతో నిండి ఉన్నదీ శతాబ్దాలుగా తెరుచుకోని ఈ రెండో గదిలోనే అసలు మిస్టరీ అంతా ఉందని చరిత్ర చెబుతోంది.
చరిత్రని తిరగేసి చూస్తే, ఇప్పుడు మనం ఓడిస్సాగా చెప్పుకొంటున్న ప్రాంతాన్ని ఒకప్పుడు ఉత్కళ అని పిలిచేవారు. 12వ శతాబ్ధం నుండీ 18వ శతాబ్ధం వరకూ ఈ ఉత్కళని అనేకమంది రాజులు పాలించారు. వారంతా తమ సంపదని జగన్నాథుని సన్నిథిలో ఉన్న ఈ రత్న భాండాగారంలోనే దాచి ఉంచేవారు.
ఈ సీక్రెట్ రూమ్ తెరవాలంటే ఏం చేయాలి?
అప్పట్లో ఓ గదికి మూడు తాళాలు వేయడం అంటే ఎంత పకడ్బందీగా చేసుంటారో అర్ధం చేసుకోవచ్చు. రత్నభండార్ లోని ఇన్నర్ ట్రెజరీకి 3 డోర్స్ ఉంటాయి. ఒక్కో డోర్ కీ ఒక్కో కీ చొప్పున మొత్తం 3 కీస్ ఉంటాయి. వీటిలో ఒక కీ గజపతి రాజుల దగ్గర ఉంటుంది. మరో కీ దేవాలయ పాలనాధికారుల దగ్గర ఉంటుంది. ఇక మూడో కీ ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.
ఈ గదిని తెరవాలంటే మూడు తాళాలు ఉండాలి. అయితే, ప్రస్తుతం రెండు తాళాలు ఉన్నప్పటికీ మూడో తాళం దశాబ్ధాలుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆ మిస్టీరియస్ రూమ్ ని తెరవడం అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఓ హిస్టారియన్ పూరీ జగన్నాథుని సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయాలంటే దానికి కీతో పనిలేదని చెప్పి షాకిచ్చాడు. ఆ రెండో గదిని చేరుకునేందుకు దానికింద నుంచీ ఓ టన్నెల్ వే ఉందన్నారు. అయితే, అక్కడికి చేరుకోవటం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.
ఇది కూడా చదవండి: అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం
గతంలో ఈ గదిని తెరిచినప్పుడు ఏమి జరిగింది?
నిజానికి 1926లోనే పూరీ రాజు గజపతి రామచంద్రదేవ, బ్రిటిష్ పాలకులు కలిసి పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారు. 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు, 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. కానీ రత్న భాండాగారంలోని అసలైన సీక్రెట్ రూమ్ డోర్స్ మాత్రం ఓపెన్ చేయలేక పోయారు. ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ రకరకాల వింత శబ్ధాలు రావడమే. దీంతో ఎవరికీ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక పోయింది. దీంతో ఆ గదిని తెరవాలన్న ఆలోచనే విరమించుకున్నారు.
అప్పట్లో శ్రీక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ, జగన్నాథుని రత్న భాండాగారం లోపలి గదుల్లోకి మాత్రం ఎవరూ వెళ్ళలేక లేకపోయారు. అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్‌గా డిస్క్రైబ్ చేశారు. అంతేకాదు, వాళ్ళ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ, ఆచార నియమాలకు ఎలాంటి భంగం కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.
1926లో లెక్కించింది ఒక గదిలో సంపద మాత్రమే! అసలు సంపదంతా ఆ రెండో గదిలోనే ఉందనేది చరిత్ర కారులు చెబుతున్న మాట. శతాబ్ధాలుగా ఆ రెండో గది మిస్టరీని రివీల్ చేయాలని ప్రభుత్వాలు, యంత్రాగాలు ఎంత ప్రయత్నించినా గది తలుపులు తెరవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ గది తాళం కనిపించకుండా పోవడమే! ఒకవేళ తాళం పగలగొడదామన్నా అదంత ఈజీ కాదని ఆర్కియాలజిస్టులు తేల్చి చెప్పారు.
1978లో ఈ రత్న భండార్ లోపలి గదిని తెరచారు. ఆ ఏడాది మే నెలలో తలుపులు తెరిస్తే… లోపల సంపదను లెక్కించటం జులైలో ముగిసింది. అయితే, అప్పట్లో లోపలున్న సంపద విలువెంతో ఆలయ నిర్వహణ కమిటీ బయటపెట్టలేదు.
తిరిగి 1982లో ఒడిశా గవర్నమెంట్ ఈ ట్రెజరీని ఓపెన్ చేయాలనుకుంది. ఆ సమయంలో భాండాగారంలోని రెండు ద్వారాలని తెరిచిన అధికారులు అసలైన మూడో ద్వారం విషయానికొస్తే, దాని దగ్గర వరకూ మాత్రమే వెళ్ళి, లోపలికి వెళ్లకుండానే తిరిగి వెళ్లిపోయారు.
ఎందుకంటే, ఆ గది లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయని దీంతో అధికారులు లోపలికి వెళ్లలేక పోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, లోపలికి వెళ్లలేకపోవడానికి అసలు కారణం ఆ గదికి సంబంధించిన ఓ తాళం కనిపించకుండా పోవడమే. అంతకుముందే తాళం మిస్సవడంతో డూప్లికేట్ తాళం చెవి చేయించారు. కానీ, అదికూడా కనిపించకుండా పోవడంతో కాంట్రవర్సీకి దారితీసింది.
1985లో ఆర్కియాలజిస్టులు ఆలయ అధికారుల దగ్గర ఉన్న ఆ రెండు తాళాలతోనే మూడో తలుపు తెరవటానికి ట్రై చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయంకరమైన శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను మూసివేసి వెనక్కి వెళ్లిపోయారు.
ఈ డోర్ ఓపెన్ చేయాలని ట్రై చేసినప్పుడల్లా ఇలానే జరిగేదని, అందుకే దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు.
నిజానికి జగన్నాథుని రత్నభాండాగారం గురించి అంతా రహస్యమే. లోపల ఎన్ని గదులున్నాయి? ఎంత సంపద ఉంది? ఇవేవీ బయటకి తెలియవు. భక్తులు ఈ ఆలయాన్ని మహాలక్ష్మి నిలయంగా నమ్ముతారు. అలాంటి ఈ భాండాగారంలో విశాలమైన గదులు ఎన్ని ఉన్నాయో కేవలం అంచనా మాత్రమే. విలువైన సంపద పుష్కలంగా ఉన్నా ఇప్పటివరకూ దానిని పూర్తిగా చూసిన వారెవరూ లేరు.
ఒడిశా ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది?
ఈ విషయంపై 2018లో ఒడిశా గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్‌లో రత్న భండార్ లోపలి గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం సక్సెస్ కాలేదు.
రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. అయితే, ఆ గదికి ఉన్న కిటికీ ద్వారా లోపలి చూసినప్పుడు ఆ గది పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే రిపేర్ చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ కీ దొరికిందని గవర్నమెంట్ తెలిపింది.
మరోవైపు రత్న భండార్ లోపల ఎంత సంపద ఉంది? దీన్ని ఎప్పుడు తెరుస్తారు? అని ఒక ఉద్యమకారుడు టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద అప్లికేషన్ దాఖలు చేశాడు. ఆ అప్లికేషన్ కి రెస్పాండ్ అవకపోవటంతో, 2022 ఆగస్టులో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమీషన్ జరిమానా కూడా విధించింది.
ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన రత్న భండార్ లోపలి గదిని తెరిచే నిర్ణయం మా చేతుల్లో లేదు, ఈ విషయాన్ని ఆలయ నిర్వహణ కమిటీకి తెలియచేస్తాం, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం,అప్పుడే ఈ విషయంలో ఏదైనా చేయటం సాధ్యం అవుతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Mysterious Powers of Katarmal Sun Temple
ఆలయ కమిటీ ఏమని నిర్ణయించింది?
మొత్తానికి ఈ ఏడాది ఆగస్టు 5న రత్న భండార్‌లోని లోపలి గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. దానికి ఒడిశా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కూడా సూచించింది.
ముఖ్యంగా ఆలయ సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా లోపలి గదిలో దెబ్బతిన్న ఏరియాని సరిచేయాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచించడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకొంది.
చట్టం ఏం చెబుతోంది?
టెంపుల్ మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చిన శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్-1955 ప్రకారం ప్రతి మూడేళ్లకొకసారి రత్న భండార్‌ని తెరచి, లోపల సంపదను లెక్కించాల్సి ఉంటుంది. అయితే, 40 ఏళ్లుగా రత్న భండార్ లోపలి గది తెరవట్లేదు.
అందుకే ఎలాగైనా ఈ సంవత్సరం ఆ గదిని తెరిచి ఆడిట్ చేయాలని అపోజిషన్ పార్టీలు ఓడిసా గవర్నమెంట్ ని కోరుతున్నాయి. కానీ, గవర్నమెంట్ మాత్రం ఈ విషయాన్ని ఎందుకో డిలే చేస్తూ వస్తుంది.
ముగింపు
ఫైనల్ గా చెప్పాలంటే… 46 మంది రాజులు… వందల యుద్ధాలు… విజయం సాధించిన ప్రతిసారీ ఆ సంపద వచ్చి చేరేది జగన్నాథుని పాదాల చెంతకే స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర, వైఢూర్యాలు, రత్నాభరణాలు జగన్నాథుని రత్న భాండాగారంలోనే దాచేవారని చరిత్ర చెబుతోంది. ఆ మిస్టీరియస్ గదుల దగ్గరకు చేరుకోవాలంటే ఏం చేయాలి అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది.
ప్రభుత్వాలు, యంత్రాగాలు మారినా… ఎన్ని ప్రయత్నాలు చేసినా… గది తలుపులు తెరవడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మూడో తాళం కనిపించకుండా పోవడమే. ఒకవేళ తాళం పగలగొడదామన్నా అదంత ఈజీ కాదని పురావస్తుశాఖ అధికారులే తేల్చేశారు.
ఇక మరోపక్క, స్వామి వారి రత్న భాండాగారం తలుపులు పగలగొడితే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో అనే భయం ఎలాగో ఉండనే ఉంది. మొత్తంగా టెక్నికల్‌గానూ సెంటిమెంట్ పరంగానూ జగన్నాథుని మిస్టీరియస్ గదిని తెరవడం ఇప్పటి వరకూ వీలు పడలేదు.
కానీ, ఇలాంటి సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 5న రత్న భండార్‌లోని లోపలి గది డోర్స్ తెరిచారు. సంపదని లెక్కించారు. ఇప్పటికీ లిక్కింపు పూర్తయ్యిందో… లేదో… ఆ వివరాలేమీ బయట పెట్టలేదు.
ఏదేమైనా, మనల్ని కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? ఈ టాపికే ఇప్పుడు టాప్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది.