అంతరిక్షంలో జరిగే ఎన్నో అద్భుతాలని నాసా ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు కొన్ని అరుదైన విషయాలని కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా సరిగ్గా అలాంటిదే!
2014 జనవరి 9న అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా… ఓ రేర్ స్పేస్ ఫొటోని తన వెబ్సైట్లో షేర్ చేసింది. అది ఒక ఎక్స్-రే ఇమేజ్. చూడ్డానికి అచ్చం దేవుడి చెయ్యిలా ఉంది. అయితే, నిజానికిది గాడ్ హ్యాండ్ కాదు. ఇది ఓ పల్సర్ విండ్ నెబ్యులా. స్పేస్ లో సూపర్ నోవా నక్షత్రం ఒకటి ఎక్స్ ప్లోడ్ అవ్వడంతో… ఏర్పడిన మబ్బులాంటి పదార్థమే ఇది. న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోప్ టెలిస్కోప్ ఎర్రే సహాయంతో నాసా దీన్ని ఎక్స్-రే తీసింది. ఆ ఫొటోకి సంబందించిన రీసెంట్ అప్డేట్ ఇప్పుడు ఇచ్చింది.
నాసా ప్రతి రోజు ఏదో ఓ స్పెషల్ ఫొటోని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ‘ఇమేజ్ ఆఫ్ ది డే’ అని పిలుస్తుంది. ఇందులో అప్పుడప్పుడు ఇన్క్రీడబుల్ ఫొటోస్ ని కూడా షేర్ చేస్తుంది. అవి సోషల్ మీడియాలో దూసుకుపోతాయి. గతంలో కూడా ఇలానే పదేళ్లపాటు తీసిన సూర్యుడి ఫొటోలన్నింటినీ జతచేసి ఓ వీడియో రిలీజ్ చేసింది. గంట నిడివి గల ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది.
ఇక తాజా ఫొటోని నాసాకి చెందిన చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ క్యాప్చర్ చేసింది. సూపర్ నోవా నక్షత్రం పేలిపోవడంతో వచ్చిన దుమ్ము, దూళి, పదార్థాలన్నీ కలిసి… ఇలా చెయ్యి ఆకారాన్ని సంతరించుకున్నాయి. ఈ వీడియోలో పసుపు రంగులో కనిపించేది పల్సర్. ఇది చాలా పవర్ ఫుల్. సైంటిఫిక్గా దీన్ని PSR B1509-58 అని పిలుస్తారు. ఇది సుమారు 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే భూమి నుంచి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఏర్పడింది.