నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన NBK 107 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా జూన్ 10న అందించాలనుకున్నారు. అందుకే ఈరోజు అనగా జూన్ 9 సాయంత్రం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
తాజాగా విడుదలైన ఈ టీజర్లో బాలయ్య గెటప్, డైలాగ్స్ అదిరిపోయాయి. పక్కా మాస్ గెటప్ లో… పులిచర్ల నేపథ్యంలో… పవర్ ఫుల్ యాక్షన్ తో,.. ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో బాలయ్య సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారు. ఇక సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో సెన్సేషన్. ఇందులో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఇతర ముఖ్య పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ నటిస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అందిస్తోంది. అయితే, ఈ సినిమాకు అన్నగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.